మూడు రాజధానుల విషయంలో ముందుకే వెళ్లాలని ఏపీ సీఎం జగన్ నిర్ణయించారు. ఈ నేపథ్యంలో వచ్చే మార్చిలోపే సచివాలయాన్ని అమరావతి నుంచి తరలించడం ఖాయంగా కనిపిస్తోందని సమాచారం. వచ్చే తెలుగు సంవత్సరాది ఉగాదికి నూతన రాజధానిని ప్రారంభించి విశాఖ నుంచే పరిపాలన సాగాలే సీఎం జగన్ రెడీ చేస్తున్నారని తెలుస్తోంది.
Also Read: దీపావళిని కాలుష్య రహితంగా జరుపుకోవాలి: ఏపీ ప్రభుత్వం
సీఎం జగన్ మూడు రాజధానులపై వెనక్కి వెళ్లకూడదని నిర్ణయించుకున్నట్టు సమాచారం. వచ్చే మార్చి నాటికి తరలింపు ఖాయమని తెలుస్తోంది. అసెంబ్లీలోనూ దీన్ని చర్చించారు.
వచ్చే మార్చి కల్లా సచివాలయం, సీఎం కార్యాలయాన్ని విశాఖకు మార్చడానికి జగన్ ప్రయత్నాలు చేస్తున్నాడని అధికార వర్గాలు తెలిపాయి. భీమిలిలోని మూతబడిన ఓ ఇంజినీరింగ్ కాలేజీని తాత్కాలిక సచివాలయంగా మార్చవచ్చని తెలుస్తోంది. మాజీ సీఎం రోశయ్య అల్లుడు పైడా కృష్ణ ప్రసాద్ కు చెందిన పైడా ఇంజినీరింగ్ కాలేజీ రెండేళ్ల నుంచి మూతపడింది. దీన్నే సచివాలయంగా మారుస్తారని సమాచారం.
విశాఖ శారదా పీఠాధిపతి సూచనల మేరకు ఉగాది నాటికి సచివాలయాన్ని తరలిస్తారంటూ వార్తలు వచ్చాయి.ఇదే మూహూర్తాన్ని జగన్ విశాఖ నుంచి పాలించడానికి ఫిక్స్ చేసినట్టు తెలుస్తోంది.
Also Read: ఏపీలో కరోనా వ్యాక్సిన్ పంపిణీ రెడీ..!
పరిపాలన కేంద్రం.. సీఎం క్యాంప్ ఆఫీస్.. సీఎం నివాసం ఎక్కడా అనే ఉత్కంఠ నెలకొంది. విశ్వసనీయ సమాచారం ప్రకారం..తిమ్మాపురం గ్రేహౌండ్స్ స్థలంలో సీఎం క్యాంప్ కార్యాలయం ఏర్పాటు కానుందని వార్తలు వస్తున్నాయి. ఇక్కడి గ్రౌహౌండ్స్ ఆనందపురానికి తరలించనున్నారు. అక్కడ 300 ఎకరాలను గ్రేహౌండ్స్ కు ప్రభుత్వం కేటాయించింది.తిమ్మాపురంలో ఇప్పటికే స్టేట్ గెస్ట్ హౌస్ పేరుతో నిర్మాణాలకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఇది సీఎం క్యాంప్ కార్యాలయం అని అంటున్నారు.
ఇక సీఎం నివాసం రుషికొండపై ఏర్పాటు చేయాలని అధికార యంత్రాంగం భావిస్తోంది. కొండపై ప్రస్తుతం పర్యాటక శాఖ అతిథి గృహాలు ఉన్నాయి. కొండపైన నివాసం వాస్తు, రాష్ట్రాభివృద్ధికి మేలు అని భావిస్తున్నారు.
మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్
విశాఖ సెంట్రల్ జైలు ఆవరణలో డీజీపీ కార్యాలయం ఏర్పాటు చేస్తారని ప్రచారం జరుగుతోంది. విశాఖ జైలు 100.40 ఎకరాల్లో ఉంది. దీంతో ఇక్కడే ఏర్పాటు చేస్తారని అంటున్నారు.