మనలో ప్రతి ఒక్కరినీ సాధారణంగా వేధించే ఆరోగ్య సమస్యల్లో కడుపునొప్పి కూడా ఒకటి. పిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు ప్రతి ఒక్కరూ ఏదో ఒక సమయంలో కడుపునొప్పితో బాధ పడి ఉంటారు. అజీర్ణం, అతిసారం లాంటి సమస్యల వల్ల కొన్ని సందర్భాల్లో కడుపునొప్పి వస్తుంది. కడుపునొప్పి ఎప్పుడో ఒకసారి వస్తే ప్రమాదం లేదు. కానీ తరచూ కడుపునొప్పి వస్తే మాత్రం వైద్యుడిని సంప్రదించి చికిత్స చేయించుకుంటే మంచిది.
చాలా సందర్భాల్లో ఆహారం సరిగ్గా జీర్ణం కాకపోవడం వల్ల కడుపునొప్పి వస్తుంది. కొన్ని ఇంటి చిట్కాలను పాటించడం ద్వారా సులభంగా కడుపునొప్పికి చెక్ పెట్టడం సాధ్యమవుతుంది. క్షణాల్లోనే కడుపునొప్పిని తగ్గించడంలో పుదీనా అద్భుతంగా పని చేస్తుంది. పుదీనా ఆకులను శుభ్రం చేసి నోట్లో వేసుకుని మింగితే కడుపునొప్పి సమస్య తగ్గుతుంది. కడుపునొప్పి నుంచి తక్షణ ఉపశమనం కలిగించడంలో ఆలోవెరా జ్యూస్ కూడా సహాయపడుతుంది.
గోరువెచ్చని నీటిలో నిమ్మరసం పిండి కొంచెం తేనె కలిపి తీసుకున్నా మంచి ఫలితాలు ఉంటాయి. గోరువెచ్చని నీటిలో బేకింగ్ సోడా మిక్స్ చేసి తీసుకున్నా మంచి ఫలితం ఉంటుంది. అల్లం టీ చేసుకుని తాగినా కడుపునొప్పి సమస్య నుంచి బయటపడవచ్చు. ఈ చిట్కాలు పాటించినా కడుపునొప్పి సమస్య తగ్గకపోతే వైద్యుడిని సంప్రదించి చికిత్స చేయించుకోవాలి.
అజీర్ణం, లూజ్ మోషన్, మలబద్ధకం, నులిపురుగులు, పేగు వ్యాధులు సైతం కడుపునొప్పికి కారణమవుతాయి. మనం తీసుకున్న ఆహార పదార్థాల వల్ల కడుపునొప్పి వచ్చిందని భావిస్తే కొన్ని వారాల పాటు ఆ ఉత్పత్తులకు దూరంగా ఉంటే మంచిది.