https://oktelugu.com/

టెన్షన్.. టెన్షన్: శుక్రవారం పూట పాతబస్తీకి కార్పొరేటర్లతో బండి సంజయ్

బీజేపీ పెద్దలతో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఢిల్లీలో ఓ వైపు దోస్తీకి ప్రయత్నిస్తున్నారు.  మరోవైపు తెలంగాణలో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కేసీఆర్ ను ప్రశాంతంగా ఉండనీయకుండా ప్లాన్లు చేస్తున్నారు. పాతబస్తీలో కాకరేపేలా చర్యలు చేపడుతున్నారు. తాజాగా బండి సంజయ్ పాతబస్తీపై దండెత్తబోతున్నారు. అదీ గెలిచిన కార్పొరేటర్ల అందరితో కలిసి. ఇది మరోసారి పాతబస్తీలో ఉద్రిక్తతలు పెంచేలా ఉంది. Also Read: పీసీసీ రేసు నుంచి శ్రీధర్ బాబు తప్పుకున్నాడా? హైదరాబాద్ లోని చార్మినార్ […]

Written By: NARESH, Updated On : December 18, 2020 8:43 pm
Follow us on

Bandi Sanjay

బీజేపీ పెద్దలతో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఢిల్లీలో ఓ వైపు దోస్తీకి ప్రయత్నిస్తున్నారు.  మరోవైపు తెలంగాణలో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కేసీఆర్ ను ప్రశాంతంగా ఉండనీయకుండా ప్లాన్లు చేస్తున్నారు. పాతబస్తీలో కాకరేపేలా చర్యలు చేపడుతున్నారు. తాజాగా బండి సంజయ్ పాతబస్తీపై దండెత్తబోతున్నారు. అదీ గెలిచిన కార్పొరేటర్ల అందరితో కలిసి. ఇది మరోసారి పాతబస్తీలో ఉద్రిక్తతలు పెంచేలా ఉంది.

Also Read: పీసీసీ రేసు నుంచి శ్రీధర్ బాబు తప్పుకున్నాడా?

హైదరాబాద్ లోని చార్మినార్ వద్దనున్న భాగ్యలక్ష్మీ టెంపుల్ కు నేడు బీజేపీ కార్పొరేటర్లతో కలిసి బండి సంజయ్ వెళుతున్నారు. అమ్మవారిని దర్శించుకోవడానికి రెడీ అయ్యారు. జీహెచ్ఎంసీ ఎన్నికలకు ముందు భాగ్యలక్ష్మీ అమ్మవారిని దర్శించుకున్న బండికి   జీహెచ్ఎంసీలో భారీ విజయం దక్కింది.. టీఆర్ఎస్ వెనుకబడి హంగ్ వచ్చింది. ఈ విజయం నేపథ్యంలోనే బండి సంజయ్ మరోసారి భాగ్యలక్ష్మీ అమ్మవారికి పూజలు చేసేందుకు రెడీ అయ్యారు. అమ్మవారికి మొక్కిన మొక్కులు చెల్లించుకుంటానని డిసైడ్ అయ్యారు.

అయితే ఈరోజు శుక్రవారం బండి సంజయ్ భాగ్య లక్ష్మీ అమ్మవారి పర్యటన పెట్టుకోవడం… పక్కనే ఉన్న మసీదుల్లో ముస్లింలు ప్రార్థనలకు వస్తుండడంతో టెన్షన్ వాతావరణం నెలకొంది.  చార్మినార్ భాగ్యలక్ష్మీ టెంపుల్ కు 48 మంది కార్పొరేటర్లు, బీజేపీ నేతలతో బండి సంజయ్ వస్తే తీవ్ర ఉద్రిక్తతలు అల్లర్లు జరిగే అవకాశాలు లేకపోలేదు. దీంతో పోలీసులు భారీగా మోహరిస్తున్నారు. అయితే పోలీసులు బండి, కార్పొరేటర్లకు పర్మిషన్ ఇవ్వకుండా అడ్డుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తెలుస్తోంది.

Also Read: నాగార్జున్ సాగర్ ఉప ఎన్నిక.. పంథా మార్చనున్న గులాబీ బాస్..!

బండి సంజయ్ శుక్రవారమే భాగ్య లక్ష్మీ టెంపుల్ కు పెద్ద ఎత్తున బీజేపీ నేతలు వెళుతుండడంతో పాతబస్తీలో మరోసారి హీట్ పెరిగింది. దీన్ని అడ్డుకునే అవకాశాలు ఉన్నాయన్న వార్తల నేపథ్యంలో ఏం జరుగుతుందోనన్న ఉత్కంఠ నెలకొంది.కానీ తాను దర్శించుకొని తీరుతానని బండి సంజయ్ ప్రకటించారు.

మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్