
ఆంధ్రప్రదేశ్ కేబినేట్ సమావేశం శుక్రవారం నిర్వహించనున్నారు. మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ కార్ఫొరేషన్ ఏర్పాటు మంత్రి వర్గం ఆమోదం తెలిపే అవకాశాలున్నాయి. రాష్ట్రంలోని వైద్య కళాశాలల నిర్మాణాన్ని ఏపీ మెడికల్ ఎడ్యుకేషన్, రీసెర్చ్ కార్పొరేషన్ పర్యవేక్షిస్తుంది. తిరుపతిలో ల్యాండ్ సర్వే అకాడమీతో పాటు భూ కేటాయింపు అంశంపై చర్చించనున్నారు. అమ్మఒడి పథకం జనవరి 9న అమలుకు అనుమతి కోరుతూ కేబినెట్ ముందుకు ప్రతిపాదన రానుంది. ఉదయం 11 గంటలకు జరిగే ఈ సమావేశంలో పౌరసరఫరాల కార్పొరేషన్ ద్వారా 5 వేల కోట్ల రుణాన్ని తీసుకునే అంశంపై కేడా కేబినేట్ చర్చించనుంది.