విజృంభిస్తున్న కరోనా కొత్త స్ట్రెయిన్.. కేసులెన్నంటే?

కొత్త ఏడాదిలో కరోనా కొత్త స్ట్రెయిన్ ప్రపంచానికి సవాల్ విసురుతోంది. ఇప్పటికే కరోనా నేర్పిన గుణపాఠంతో అన్ని దేశాలు అప్రమత్తమం అవుతున్నాయి. బ్రిటన్లో కరోనా కొత్త స్ట్రెయిన్ విజృంభిస్తున్న నేపథ్యంలోనే అన్నిదేశాలు ఆ దేశానికి విమాన ప్రయాణాలను నిలిపివేశాయి. Also Read: దేశంలో కరోనా వ్యాక్సిన్ కు కేంద్రం గ్రీన్ సిగ్నల్! కరోనా కొత్త స్ట్రెయిన్ కేసులు నమోదవుతున్న దేశాలు లాక్డౌన్ ను కఠినంగా అమలు చేస్తున్నాయి. భారత్ లోనూ కరోనా కొత్త కేసుల సంఖ్య రోజురోజుకు […]

Written By: Neelambaram, Updated On : January 2, 2021 12:51 pm
Follow us on

కొత్త ఏడాదిలో కరోనా కొత్త స్ట్రెయిన్ ప్రపంచానికి సవాల్ విసురుతోంది. ఇప్పటికే కరోనా నేర్పిన గుణపాఠంతో అన్ని దేశాలు అప్రమత్తమం అవుతున్నాయి. బ్రిటన్లో కరోనా కొత్త స్ట్రెయిన్ విజృంభిస్తున్న నేపథ్యంలోనే అన్నిదేశాలు ఆ దేశానికి విమాన ప్రయాణాలను నిలిపివేశాయి.

Also Read: దేశంలో కరోనా వ్యాక్సిన్ కు కేంద్రం గ్రీన్ సిగ్నల్!

కరోనా కొత్త స్ట్రెయిన్ కేసులు నమోదవుతున్న దేశాలు లాక్డౌన్ ను కఠినంగా అమలు చేస్తున్నాయి. భారత్ లోనూ కరోనా కొత్త కేసుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతుండటం ఆందోళన రేపుతోంది.

ఇప్పటికే యూకే నుంచి గత నెలరోజులుగా భారత్ వచ్చిన వారి వివరాలను సేకరించి వారిందరికీ కరోనా టెస్టులు నిర్వహించింద. వీరిలో 114మంది కరోనా పాజిటివ్ వచ్చింది. తొలినాళ్లలో ఆరు కేసులకే పరిమితమైన క్రమంగా పెరుగుతూ ప్రస్తుతం 29కి చేరాయి.

Also Read: నామో మోడీ.. పట్టంకట్టిన ప్రపంచ సర్వే సంస్థ..!

దేశంలోని వివిధ రాష్ట్రాల్లోని కొత్త కేసులన్ని కలుపుకొని 29కి చేరడం ఆందోళన రేపుతోంది. రోజురోజుకు కరోనా కొత్త కేసులు సంఖ్య పెరిగిపోతుండటం ఆందోళన రేపుతోంది.

న్యూఇయర్ వేడుకలపై కొన్ని రాష్ట్రాల్లో ఆంక్షలు విధించగా.. మరికొన్ని రాష్ట్రాల్లో పెద్దగా పట్టించుకోకపోవడం గమనార్హం. కరోనా కొత్త స్ట్రెయిన్ ఎఫెక్ట్ రాబోయే సంక్రాంతి పండుగపై పడే అవకాశం కన్పిస్తుంది.

మరిన్ని జాతీయ రాజకీయ వార్తల కోసం జాతీయ పాలిటిక్స్