https://oktelugu.com/

బెంగాల్ లో బీజేపీ గెలవదు.. ఇట్స్ మై చాలెంజ్

‘బెంగాల్ తమ సొంత ఆడబిడ్డనే అక్కున చేర్చుకుంటోంది.. ఢిల్లీ నుంచి దండయాత్రకు వచ్చిన బీజేపీ నేతలను తరిమికొడుతుంది.. పశ్చిమ బెంగాల్ లో జరుగుతున్న ఈ యుద్ధంలో ప్రజాస్వామ్యమే గెలవబోతోంది.. బెంగాల్ ప్రజలు దేశానికి ఒక గొప్ప మెసేజ్ ఇవ్వబోతున్నారు.. వారు తమకు ఎవరు అవసరమో తేల్చిచెప్పబోతున్నారు..’ అంటూ దేశంలో పాపులర్, ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ సంచలన ట్వీట్ చేశారు. పశ్చిమ బెంగాల్ లో అసెంబ్లీ ఎన్నికల వేడి రాజుకుంటోంది. అధికార తృణమూల్ కాంగ్రెస్ తో […]

Written By:
  • NARESH
  • , Updated On : February 27, 2021 / 07:03 PM IST
    Follow us on

    ‘బెంగాల్ తమ సొంత ఆడబిడ్డనే అక్కున చేర్చుకుంటోంది.. ఢిల్లీ నుంచి దండయాత్రకు వచ్చిన బీజేపీ నేతలను తరిమికొడుతుంది.. పశ్చిమ బెంగాల్ లో జరుగుతున్న ఈ యుద్ధంలో ప్రజాస్వామ్యమే గెలవబోతోంది.. బెంగాల్ ప్రజలు దేశానికి ఒక గొప్ప మెసేజ్ ఇవ్వబోతున్నారు.. వారు తమకు ఎవరు అవసరమో తేల్చిచెప్పబోతున్నారు..’ అంటూ దేశంలో పాపులర్, ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ సంచలన ట్వీట్ చేశారు.

    పశ్చిమ బెంగాల్ లో అసెంబ్లీ ఎన్నికల వేడి రాజుకుంటోంది. అధికార తృణమూల్ కాంగ్రెస్ తో బీజేపీ సై అంటే సై అంటోంది. బెంగాల్ సీఎం మమతా బెనర్జీని ఎలాగైనా సరే ఓడించాలని కేంద్రహోంమంత్రి అమిత్ షా పట్టుదలగా ఉన్నారు. ఇరు పక్షాలు దీనిపై హోరాహోరీగా తలపడుతున్నాయి.

    తృణమూల్ కాంగ్రెస్ అధికారంలో ఉన్న పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ఈసారి ఎలాగైనా బీజేపీ పాగా వేయడానికి ఎత్తులు, పైఎత్తులు వేస్తోంది. ఇప్పటికే రాష్ట్రంలో అలజడి సృష్టించిన కమలం నాయకులు అధికారం దిశగా పావులు కదుపుతున్నారు. ఇక్కడ అధికారంలోకి రావడానికి హిందూ నినాదాన్ని వాడుకుంటున్నారు. హిందూ నినాదాలతో మా ప్రజలను ఆకట్టుకోలేరని, మేం కూడా హిందువులమేనని తృణమూల్ కార్యకర్తలు తిప్పికొడుతున్నారు.

    ఇప్పటికే అధికార టీఎంసీ పార్టీ నుంచి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు బీజేపీలోకి వలసలు పెరిగాయి. దీంతో బీజేపీలో జోష్ పెరిగింది. మరోవైపు కాంగ్రెస్-వామపక్షాలు కూటమిగా ఏర్పడి ఉనికి చాటుకునే ప్రయత్నంలో ఉన్నాయి. వరుసగా రెండు సార్లు గెలిచిన మమతా బెనర్జీ మూడోసారి గెలిచి హ్యాట్రిక్ కొట్టడానికి ప్రయత్నాలు చేస్తున్నారు.

    తాజాగా పశ్చిమ బెంగాల్ ఎన్నికల ఫలితాలపై ప్రశాంత్ కిషోర్ సంచలన సవాల్ విసిరారు. గత ఏడాది డిసెంబర్ లో బెంగాల్ ఎన్నికలపై పీకే ట్వీట్ చేశాడు. బెంగాల్ ఎన్నికల్లో బీజేపీకి కనీసం రెండంకెల సీట్లు కూడా రావని పీకే అంచనా వేశారు. ఈ ట్వీట్ కు ఇప్పటికీ తాను కట్టుబడి ఉన్నట్లు తాజా ట్వీట్ తో పీకే స్పష్టం చేశాడు. బెంగాల్ లో బీజేపీ ఓడిపోతుందని పీకే బల్లగుద్ది వాయిస్తున్నాడు.