https://oktelugu.com/

మహేష్ మరీ ఇంత స్లో అయితే ఎలా ?

సూపర్ స్టార్ మహేష్ బాబుకి షూటింగ్స్ లో బాగా లేట్ గా చేస్తాడు అనే నేమ్ ఉంది. మహేష్ నటించిన ‘సరిలేరు నీకెవ్వరు’ 2020 సంక్రాంతికి విడుదలై సూపర్ హిట్ అయింది. ఆ తరువాత కరోనా రావడం, అలా ఆ సినిమా విడుదలైన తర్వాత ఏడాదిపాటు ఇంటిపట్టునే ఉన్నాడు మహేష్. ఏడాది తర్వాత ‘సర్కారు వారి పాట’ సినిమా షూటింగ్ మొదలుపెట్టి ప్రస్తుతం ఆ సినిమా షూట్ లో ఉన్నాడు. ఏడాది ఇంటిలో ఉన్నాడు కాబట్టి, స్పీడ్ […]

Written By:
  • admin
  • , Updated On : February 27, 2021 / 07:04 PM IST
    Follow us on


    సూపర్ స్టార్ మహేష్ బాబుకి షూటింగ్స్ లో బాగా లేట్ గా చేస్తాడు అనే నేమ్ ఉంది. మహేష్ నటించిన ‘సరిలేరు నీకెవ్వరు’ 2020 సంక్రాంతికి విడుదలై సూపర్ హిట్ అయింది. ఆ తరువాత కరోనా రావడం, అలా ఆ సినిమా విడుదలైన తర్వాత ఏడాదిపాటు ఇంటిపట్టునే ఉన్నాడు మహేష్. ఏడాది తర్వాత ‘సర్కారు వారి పాట’ సినిమా షూటింగ్ మొదలుపెట్టి ప్రస్తుతం ఆ సినిమా షూట్ లో ఉన్నాడు. ఏడాది ఇంటిలో ఉన్నాడు కాబట్టి, స్పీడ్ గా షూటింగ్ పూర్తి చేసి, సినిమాని ఈ ఏడాది ఆగస్టులోనే రిలీజ్ చేస్తాడు అనుకున్నారు మహేష్ ఫ్యాన్స్. కానీ అది సాధ్యం అయ్యేలా కనబడటం లేదు.

    Also Read: అఖిల్ కోసం బికినీ వేస్తోన్న పూజ హెగ్డే !

    ఏకంగా ఆ సినిమాని ఏడాది తర్వాత తీసుకొస్తాడని.. అంటే 2022 సంక్రాంతికి ఈ సినిమా విడుదలవుతుందని తెలుస్తోంది. ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాకి ‘సర్కారు వారి పాట’ విడుదలకి మధ్య గ్యాప్ రెండేళ్లు అన్నమాట. అసలు అప్పటివరకూ ఎందుకు సినిమాని ఆపడం అంటే.. వచ్చే నెల నుండి ఈ సినిమా షూటింగ్ కి మహేష్ బ్రేక్ ఇస్తాడని.. అలాగే సమ్మర్ లో కూడా ఎలాంటి షూటింగ్ లేకుండా మహేష్ ప్లాన్ చేసుకున్నాడని.. ఆ కారణంగానే ఈ సినిమా మరో ఆరు నెలలు ఆలస్యం అవుతుందని.. అందుకే తప్పనిసరి పరిస్థితుల్లో వచ్చే సంక్రాంతికి ఈ సినిమా రిలీజ్ ని ప్లాన్ చేస్తున్నారట.

    Also Read: 100 కోట్ల క్లబ్ లో మెగా మేనల్లుడు !

    అయినా 45 ఏళ్ల ఈ సూపర్ స్టార్ మరీ ఇంత స్లోగా సినిమాలు చేస్తే.. అరవై ఏళ్ళు వచ్చేసరికి మరో పది సినిమాల కంటే ఎక్కువ చెయ్యడు ఏమో. ఎలాగూ వచ్చే ఏడాది రాజమౌళి మహేష్ బాబుతో సినిమా స్టార్ట్ చేసేందుకు రెడీగా ఉంటాడు కాబట్టి, ఈజీగా మరో మూడేళ్లు పాటు మహేష్ నుండి మరో సినిమా రాదు. అయితే రాజమౌళి సినిమాని వచ్చే ఏడాది సెట్స్ పైకి వెళ్తుంది కాబట్టి, ఈ లోపు, మహేష్ మరో మూవీ స్టార్ట్ చేసేందుకు కూడా ఇంట్రస్ట్ చూపించడం లేదు. ఏంటో మహేష్, మరీ ఇంత స్లో అయితే ఎలా ?

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్