భారీగా ఇస్తే ఐటమ్ సాంగ్స్ కి నేనెప్పుడూ రెడీనే !

యాంకరింగ్ లోకంలో కూడా గ్లామర్ ప్రపంచాన్ని పరిచయం చేసి.. అందాలను పరిచి ఫుల్ క్రేజ్ ను సంపాదించి ఆల్ టైం హాట్ బ్యూటీగా తనకంటూ సోషల్ మీడియాలో ఓ సెపెరేట్ ఫాలోయింగ్ ను సాధించింది అనసూయ. అయితే, అనసూయ మళ్ళీ ఐటెం పాటలతో బిజీ అయినట్టు కనిపిస్తోంది. భారీ మొత్తంలో ఇస్తే.. ఎలాంటి మొహమాటం లేకుండా ఐటమ్ సాంగ్స్ చేయడానికి తానూ ఎప్పుడూ సిద్ధమే అన్నట్టు ఉంది ఆమె వ్యవహారశైలి. తాజాగా కార్తికేయ హీరోగా, లావణ్య త్రిపాఠి […]

Written By: admin, Updated On : February 27, 2021 6:56 pm
Follow us on


యాంకరింగ్ లోకంలో కూడా గ్లామర్ ప్రపంచాన్ని పరిచయం చేసి.. అందాలను పరిచి ఫుల్ క్రేజ్ ను సంపాదించి ఆల్ టైం హాట్ బ్యూటీగా తనకంటూ సోషల్ మీడియాలో ఓ సెపెరేట్ ఫాలోయింగ్ ను సాధించింది అనసూయ. అయితే, అనసూయ మళ్ళీ ఐటెం పాటలతో బిజీ అయినట్టు కనిపిస్తోంది. భారీ మొత్తంలో ఇస్తే.. ఎలాంటి మొహమాటం లేకుండా ఐటమ్ సాంగ్స్ చేయడానికి తానూ ఎప్పుడూ సిద్ధమే అన్నట్టు ఉంది ఆమె వ్యవహారశైలి. తాజాగా కార్తికేయ హీరోగా, లావణ్య త్రిపాఠి హీరోయిన్ గా రూపొందుతోన్న ‘చావు కబురు చల్లగా’ సినిమాలో ఆమె ఒక పాటలో మెరిసింది.

Also Read: అఖిల్ కోసం బికినీ వేస్తోన్న పూజ హెగ్డే !

కాగా ఈ సాయంత్రం ఈ పాట ప్రోమో రిలీజ్ అయి బాగానే వైరల్ అవుతుంది. ఇక అనసూయ మరో ఐటమ్ సాంగ్ కూడా వచ్చే వారం నుండి చేయడానికి రెడీ అవుతుంది. ‘క్రాక్’ సినిమాతో సాలిడ్ హిట్ అందుకున్న రవితేజ తన తరువాత సినిమాని రమేష్ వర్మ దర్శకత్వంలో ‘ఖిలాడి’ అనే టైటిల్ తో రాబోతున్న సినిమా చేస్తోన్నాడు. కాగా ఈ సినిమాలో ఓ పబ్ సాంగ్ ఉందట. ఈ సాంగ్ లో అనసూయనే పెట్టి తీస్తున్నారు. పబ్ సాంగ్ కాబట్టి ఎక్స్ పోజింగ్ కూడా కాస్త ఎక్కువుగానే ఉంటుందట. అయినా అనసూయ మాత్రం సాంగ్ చేయడానికి అంగీకరించింది.

Also Read: 100 కోట్ల క్లబ్ లో మెగా మేనల్లుడు !

కాకపోతే రెమ్యునరేషన్ మాత్రం 70 లక్షల వరకూ పుచ్చుకుందట. మీడియమ్ రేంజ్ హీరోయిన్ రెమ్యునరేషనే 50 లక్షలు లోపే ఉంటుంది. కానీ ఒక్క సాంగ్ లో చేసి హీరోయిన్ కంటే ఎక్కువ తీసుకుంటుంది అనసూయ. ఇక చాలా గ్యాప్ తర్వాత అనసూయ ఇలా సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ చేస్తోంది. అలాగే కొన్ని వైవిధ్యమైన పాత్రలు చేస్తూ బిజీగా ఉంది. మొత్తానికి బుల్లితెర నుండి వెండితెర మీదికి ఎంట్రీ ఇచ్చి అక్కడ కూడా ఫుల్ డిమాండ్ సంపాదించి బాగా డబ్బు చేసుకుంటుంది ఈ హాట్ బ్యూటీ.

మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్