డిబేట్ లో బీజేపీ నేతపై చెప్పుతో దాడి..లైవ్ కట్..ఆ తరువాత ఏం జరిగిందంటే..?

సమాజం గురించి చర్చించే ఛానెళ్లు ఒక్కోసారి వివాదాస్పదంగా మారుతాయి. పలు విషయాలపై చర్చించేటప్పుడు నేతల మధ్య ఆక్రోశం పెరిగి గొడవలకు దారి తీస్తోంది. వారిని అదుపు చేయడానికి ఎంత ప్రయత్నించినా అది సాధ్యం కాదు. ఇదే సీన్ ఇప్పుడో ప్రముఖ ఛానెల్ లో జరిగింది. ఏపీ రాజధాని అమరావతిపై ఓ ప్రముఖ ఛానెల్ నిర్వహించిన డిబెట్ రచ్చరచ్చగా మారింది. ఇద్దరు నేతలు కొట్టుకునే స్థాయి వరకు వెళ్లింది. ఓ నేత ఏకంగా లైవ్ లో మరో నేతపై […]

Written By: NARESH, Updated On : February 24, 2021 12:16 pm
Follow us on

సమాజం గురించి చర్చించే ఛానెళ్లు ఒక్కోసారి వివాదాస్పదంగా మారుతాయి. పలు విషయాలపై చర్చించేటప్పుడు నేతల మధ్య ఆక్రోశం పెరిగి గొడవలకు దారి తీస్తోంది. వారిని అదుపు చేయడానికి ఎంత ప్రయత్నించినా అది సాధ్యం కాదు. ఇదే సీన్ ఇప్పుడో ప్రముఖ ఛానెల్ లో జరిగింది. ఏపీ రాజధాని అమరావతిపై ఓ ప్రముఖ ఛానెల్ నిర్వహించిన డిబెట్ రచ్చరచ్చగా మారింది. ఇద్దరు నేతలు కొట్టుకునే స్థాయి వరకు వెళ్లింది. ఓ నేత ఏకంగా లైవ్ లో మరో నేతపై చెప్పు చూపించడంతో చర్చనీయాంశంగా మారింది.

ఏపీలో అమరావతి రాజధాని కోసం రైతులతో పాటు ఏబీఎన్ ఆంధ్రజ్యోతి లో తరుచూ చర్చ జరుగతోంది. ఇదే క్రమంలో మంగళవారం అమరావతి రాజధాని విషయంలో జర్నలిస్టు వెంటకకృష్ణ ఆధ్వర్యంలో డిబేట్ నిర్వహించారు. ఈ చర్చలో అమరావతి రైతులకు మద్దతు తెలుపుతున్న శ్రీవివాసరావు, బీజేపీ ఏపీ నేత విష్ణువర్దన్ పాల్గొన్నారు. అయితే డిబేట్ కొనసాగుతుండగా శ్రీనివాస రావు విష్ణుపై చెప్పు చూపించారు. దీంతో డిబేట్ లైవ్ కట్ అయింది.

అయితే విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు ఆ తరువాత కూడా విష్ణుపై దాడి కొనసాగినట్లు సమాచారం. లైట్ కట్ అయిన తరువాత శ్రీనివాసరావు మరో చెప్పుతో దాడికి దిగేందుకు సిద్ధమైనట్లు సమాచారం. దీంతో ప్యానెల్లో ఉన్నవారు వారిద్దరిని అదుపులోకి తీసుకున్నారు. ఈ విషయం తెలిసిన తెలంగాణ బీజేపీ నాయకులు ఏబీఎన్ స్టూడియోకి వెళ్లారు. డిబేట్ ముగిసే వరకు అక్కడే ఉన్నారు.

అప్పటికే శ్రీనివాసరావును అక్కడి నుంచి పంపేశారు. ఆ తరువాత విష్ణను కలిసి విషయం తెలుసుకున్నారు. ఆ తరువాత తెలంగాణ బీజేపీ నాయకులు శ్రీనివాసరావు నివాసం అడ్రస్ తెలుసుకొని ఆయన ఇంటికెళ్లినట్లు తెలుస్తోంది. అయితే ఇలా ప్రజల మధ్య జరిగిన చర్యలో ఓ నేత మరో నేతపై చెప్పు చూపించడంపై రకరకాలుగా చర్చలు సాగుతున్నాయి.

గతంలోనూ ఓ ఇంగ్లీస్ ఛానెల్ లో ఇలా డిబేట్ నిర్వహించడంతో ఒకరినొకరు గల్లాలు పట్టుకున్న సందర్భాలున్నాయి. ఇప్పుడు ఆ సంస్కృతి తెలుగు చానెల్స్ లోకి వచ్చింది. డిబేట్ నిర్వహించే ఛానెల్ యాజమాన్యం నేతల మధ్య వివాదం తలెత్తినప్పుడు వారిని సముదాయించాలే గానీ.. వాదన తీవ్ర స్థాయికి వెళ్లేవరకు చర్చ కొనసాగించడంపై కొన్ని వర్గాలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి.

ఇక శ్రీనివాసరావు అడ్రస్ తెలుసుకొని బీజేపీ నాయకులు ఆయన ఇంటికి వెళ్లినట్లు తెలుస్తోంది. దీంతో ఆయనకు ఏదైనా ప్రమాదం ఏర్పడితే అండగా ఎవరుంటారనే చర్చ జరుగుతోంది. కరోనా కాలంలో న్యూస్ కవరేజీ తక్కువవడంతో పలు ప్రముఖ ఛానెళ్లు ఎక్కువగా డిబేట్ కొనసాగిస్తున్నాయి. అయితే కుటుంబ సభ్యుల మధ్య చూసే ఇలాంటి వివాదాస్పద చర్చలతో యువతరంలో చెడుభావన వ్యక్తమయ్యే ప్రమాదం ఉందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Tags