https://oktelugu.com/

కృతిశెట్టి జోరు మామూలుగా లేదుగా.. పారితోషికం ఎంతో తెలుసా?

ఇప్పుడు టాలీవుడ్లో సంచ‌ల‌నం రేకెత్తిస్తున్న పేరు ‘కృతి శెట్టి.’ ఉప్పెన సినిమాలో ఈ అమ్మ‌డి అందానికి యువ‌త దాసోహం అవుతుండ‌గా.. ఈ బుల్లి యాక్టింగ్ చూసిన ఆడియ‌న్స్ అంతా.. ‘ఔరా’ అని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అన్ని ఎమోషన్స్ అద్భుతంగా పలికించగల సత్తా ఉన్న కృతి కోసం ఇప్పుడు నిర్మాత‌లు క్యూ క‌డుతున్నారు. దీంతో ఈ బ్యూటీ రెమ్యున‌రేష‌న్ ఆకాశంలో గాలిప‌టంలా చ‌క్క‌ర్లు కొడుతోంది. Also Read: భువి నుంచి దివికి.. నేడు అతిలోక సుందరి వర్ధంతి […]

Written By:
  • Rocky
  • , Updated On : February 24, 2021 / 11:29 AM IST
    Follow us on


    ఇప్పుడు టాలీవుడ్లో సంచ‌ల‌నం రేకెత్తిస్తున్న పేరు ‘కృతి శెట్టి.’ ఉప్పెన సినిమాలో ఈ అమ్మ‌డి అందానికి యువ‌త దాసోహం అవుతుండ‌గా.. ఈ బుల్లి యాక్టింగ్ చూసిన ఆడియ‌న్స్ అంతా.. ‘ఔరా’ అని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అన్ని ఎమోషన్స్ అద్భుతంగా పలికించగల సత్తా ఉన్న కృతి కోసం ఇప్పుడు నిర్మాత‌లు క్యూ క‌డుతున్నారు. దీంతో ఈ బ్యూటీ రెమ్యున‌రేష‌న్ ఆకాశంలో గాలిప‌టంలా చ‌క్క‌ర్లు కొడుతోంది.

    Also Read: భువి నుంచి దివికి.. నేడు అతిలోక సుందరి వర్ధంతి

    ‘‘కృతిశెట్టి డేట్స్ కావాల్సిన వారు ముందుగానే బుక్ చేసుకోండి. ‘ఉప్పెన’ సినిమా రిలీజ్ అయితే.. ఈ అమ్మాయికి మీకు దొరక్కపోవచ్చు’’ అని ప్రీ-రిలీజ్ వేడుకలో అన్నారు చిరంజీవి. ఆయన అన్న మాటలు ఇప్పుడు అక్షరాలా నిజమవుతున్నాయి. చూడచక్కని రూపంతో, అంతకు మించిన పెర్ఫార్మెన్స్ తో ఆడియన్స్ మనసు దోచేస్తుండడంతో.. మేకర్స్ అంతా కృతిచుట్టూ చ‌క్క‌ర్లు కొడుతున్నారు. దీంతో.. ‘ఉప్పెన’ కోసం తీసుకున్న పారితోషికం ఎకాఎకిన ఎన్నో రెట్లు పెంచేసిందట.

    ఉప్పెన సినిమా విజయంలో కృతి పాత్ర‌కూడా ప్ర‌ముఖ‌మైందే అని చెప్ప‌డంలో సందేహం లేదు. ఆమె అందం, అభినయం కూడా సినిమాకు మంచి పెచ్చింగ్ అయ్యింది. మొత్తానికి బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ తో టాలీవుడ్ లో ఖాతా తెరిచిన కృతి.. ఇప్ప‌టికే రెండు సినిమాల‌కు సైన్ చేసి ఉంది.

    నాని హీరోగా వ‌స్తున్న ‘శ్యామ్ సింఘ రాయ్’ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది కృతి. ఇంకా టైటిల్ ఫిక్స్ చేయ‌ని సుధీర్ బాబు రొమాంటిక్ ఎంటర్టైనర్ లోనూ ఈ అమ్మ‌డే హీరోయిన్‌. ఉప్పెన రిలీజ్ కు ముందే ఈ రెండు ప్రాజెక్టులపై సైన్ చేసింది కృతి. ఈ రెండు చిత్రాల్లో ఒక్కోదానికి రూ .25 లక్షల చొప్పున తీసుకుంటోందీ చిన్న‌ది.

    Also Read: బాలయ్య బాబు ఇలా షాకిచ్చాడు!

    అయితే.. తన తొలిచిత్రం ‘ఉప్పెన’లో కృతి రెమ్యున‌రేష‌న్ కేవ‌లం రూ .6 లక్షలే. అవును.. అక్షరాలా అంతే. అయితే.. టాప్ ప్రొడక్షన్ హౌస్ మైత్రి మూవీ మేకర్స్ నుండి వ‌చ్చిన ఆఫ‌ర్ కావ‌డంతో ఓకే చెప్పేసిందీ బ్యూటీ. ఈ సినిమా ఎవ్వరూ ఊహించని రీతిలో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడంతో తన పారితోషికం భారీగా పెంచేసిందట. ఇక మీద తాను ఏ ప్రాజెక్టు సైన్ చేయాల‌న్నా.. రూ.60 లక్షలు చెల్లించాల్సిందేన‌ని డిమాండ్ చేస్తోంద‌ట కృతి. ఇప్పటికే తాను సైన్ చేసిన రెండు సినిమాల్లో ఏ ఒక్కటి హిట్ కొట్టినా.. ఈ లెక్కలు మరింత పైకి వెళ్తాయని అంటున్నారు. మొత్తానికి.. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలనే ఎవర్ గ్రీన్ సూత్రాన్ని పక్కాగా అప్లై చేస్తోంది కృతి.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్