https://oktelugu.com/

విడుదలకు రంగులద్దుకుంటున్న ‘రంగ్ దే’

యూత్ స్టార్ ‘నితిన్’, ‘కీర్తి సురేష్’ ల తొలి కాంబినేషన్ లో ప్రసిద్ధ చలన చిత్ర నిర్మాణ సంస్థ’ సితార ఎంటర్ టైన్మెంట్స్’ నిర్మిస్తున్న చిత్రం ఈ ‘రంగ్ దే’. ‘ప్రతిభగల యువ దర్శకుడు ‘వెంకీ అట్లూరి’ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని నిర్మాత సూర్యదేవర నాగవంశి నిర్మిస్తున్నారు. Also Read:  కృతిశెట్టి జోరు మామూలుగా లేదుగా.. పారితోషికం ఎంతో తెలుసా? గత నాలుగు రోజులుగా చిత్రంలోని ఓ గీతానికి సంభందించిన దృశ్యాలు చిత్రీకరించడంతో షూటింగ్ పూర్తి చేసుకున్నది […]

Written By:
  • Neelambaram
  • , Updated On : February 24, 2021 / 12:23 PM IST
    Follow us on


    యూత్ స్టార్ ‘నితిన్’, ‘కీర్తి సురేష్’ ల తొలి కాంబినేషన్ లో ప్రసిద్ధ చలన చిత్ర నిర్మాణ సంస్థ’ సితార ఎంటర్ టైన్మెంట్స్’ నిర్మిస్తున్న చిత్రం ఈ ‘రంగ్ దే’. ‘ప్రతిభగల యువ దర్శకుడు ‘వెంకీ అట్లూరి’ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని నిర్మాత సూర్యదేవర నాగవంశి నిర్మిస్తున్నారు.

    Also Read:  కృతిశెట్టి జోరు మామూలుగా లేదుగా.. పారితోషికం ఎంతో తెలుసా?

    గత నాలుగు రోజులుగా చిత్రంలోని ఓ గీతానికి సంభందించిన దృశ్యాలు చిత్రీకరించడంతో షూటింగ్ పూర్తి చేసుకున్నది ఈ చిత్రం. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. చిత్ర నిర్మాత సూర్యదేవర నాగవంశి 2021 మార్చి 26న ధియేటర్ లలో ‘ రంగ్ దే’ సంబరాలు షురూ అవుతాయని తెలిపారు. సకుటుంబ సమేతంగా చూడతగ్గ చిత్రంగా దీనికి రూపకల్పన చేశారు దర్శకుడు ‘వెంకీ అట్లూరి’.యూత్ స్టార్ నితిన్, నాయిక కీర్తి సురేష్ ల జంట వెండితెరపై కనువిందు చేయనుంది.

    Also Read: భువి నుంచి దివికి.. నేడు అతిలోక సుందరి వర్ధంతి

    ఇటీవల ‘రంగ్ దే‘ చిత్రం నుంచి విడుదల అయిన దృశ్యాలతో కూడిన వీడియో, అలాగే ఓ గీతం బహుళ ప్రేక్షకాదరణ పొందిన విషయం విదితమే. ‘ప్రేమ’ తో కూడిన కుటుంబ కధా చిత్రం ఈ ‘రంగ్ దే’.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్