https://oktelugu.com/

కుప్పలుగా చచ్చిపోయిన పక్షులు.. తెలుగు రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ కలకలం

దేశంలో శరవేగంగా విజృంభిస్తున్న బర్డ్ ఫ్లూ తాజాగా తెలుగు రాష్ట్రాలకు పాకింది. కరోనా మహమ్మారి ఉపద్రవం పోతుందని అందరూ సంతోషపడుతున్న సమయంలోనే ఈ కొత్త మహమ్మారి పక్షుల ప్రాణాలు తీస్తూ ఇప్పుడు మనుషులను భయాందోళనకు గురిచేస్తోంది. బర్డ్ ఫ్లూ దెబ్బకు ఇప్పుడు పౌల్ట్రీ పరిశ్రమ దెబ్బతింది. చికెన్ తినడానికే జనాలు హడలిచస్తుండడంతో వాటి ధరలు వేగంగా పడిపోతున్నాయి. Also Read: కొడాలి నాని కౌంటర్ కు నందమూరి బాలక్రిష్ణ ఎన్ కౌంటర్ ఇప్పటికే దేశంలోని పలు రాష్ట్రాల్లో […]

Written By:
  • NARESH
  • , Updated On : January 6, 2021 / 08:43 PM IST
    Follow us on

    దేశంలో శరవేగంగా విజృంభిస్తున్న బర్డ్ ఫ్లూ తాజాగా తెలుగు రాష్ట్రాలకు పాకింది. కరోనా మహమ్మారి ఉపద్రవం పోతుందని అందరూ సంతోషపడుతున్న సమయంలోనే ఈ కొత్త మహమ్మారి పక్షుల ప్రాణాలు తీస్తూ ఇప్పుడు మనుషులను భయాందోళనకు గురిచేస్తోంది. బర్డ్ ఫ్లూ దెబ్బకు ఇప్పుడు పౌల్ట్రీ పరిశ్రమ దెబ్బతింది. చికెన్ తినడానికే జనాలు హడలిచస్తుండడంతో వాటి ధరలు వేగంగా పడిపోతున్నాయి.

    Also Read: కొడాలి నాని కౌంటర్ కు నందమూరి బాలక్రిష్ణ ఎన్ కౌంటర్

    ఇప్పటికే దేశంలోని పలు రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ కేసులు నమోదు కావడంతో పక్షలు చనిపోతున్నాయి. ప్రభుత్వాలు కోళ్లు, పక్షులను చంపేస్తున్నాయి. ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్ లోని తెనాలి సమీపంలో వందలాది పక్షులు మృతిచెందడం కలకలం రేపింది.

    ఈ పక్షులు మృతి చెందడంతో తెలుగు రాష్ట్రాలు అలెర్ట్ ప్రకటించాయి. ఇప్పటివరకు పక్షులకు మాత్రమే బర్డ్ ఫ్లూ సోకాయి. కానీ ఇప్పుడు ఎగిరే పక్షులకు సైతం సోకడంతో పౌల్ట్రీ పరిశ్రమల్లోని కోళ్లకు ఈ వైరస్ సోకకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాయి.

    Also Read: చంద్రబాబు, లోకేష్.. టీడీపీ మీడియా పరువు తీసిన కొడాలి నాని

    ఇప్పటికే హిమాచల్ ప్రదేశ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, కేరళ రాష్ట్రాల్లో ఈ వైరస్ బయటపడింది. వేల సంఖ్యలో పక్షులు మృత్యువాత పడుతున్నాయి. దీంతో ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు ఇప్పటికే అప్రమత్తమయ్యాయి. దీంతో తాజాగా కేంద్రప్రభుత్వం అన్ని రాష్ట్రాలను అలెర్ట్ చేసింది. మార్గదర్శకాలను రిలీజ్ చేసింది.

    మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్