పిల్లలు బరువు పెరగడానికి తీసుకోవాల్సిన ఆహార పదార్థాలివే..?

చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లలు చిన్న వయస్సులో సరిగ్గా బరువు పెరగడం లేదని భయాందోళనకు గురవుతూ ఉంటారు. అయితే పిల్లలకు సరైన ఆహారం ఇవ్వడం వల్ల సులభంగా బరువు పెరిగే అవకాశం ఉంటుంది. పిల్లలు ఎత్తు, బరువు పెరగకపోతే పోషకాహార లోపం అని గుర్తుంచుకోవాలి. ఎత్తు పెరిగి బరువు పెరగకపోతే మాత్రం సరైన ఆహారం పిల్లలకు ఇవ్వడం ద్వారా పిల్లల్లో తక్కువ బరువు సమస్యను సులభంగా అధిగమించవచ్చు. Also Read: వ్యాయామం ఎక్కువగా చేస్తే కలిగే నష్టాలు […]

Written By: Navya, Updated On : January 7, 2021 11:10 am
Follow us on

చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లలు చిన్న వయస్సులో సరిగ్గా బరువు పెరగడం లేదని భయాందోళనకు గురవుతూ ఉంటారు. అయితే పిల్లలకు సరైన ఆహారం ఇవ్వడం వల్ల సులభంగా బరువు పెరిగే అవకాశం ఉంటుంది. పిల్లలు ఎత్తు, బరువు పెరగకపోతే పోషకాహార లోపం అని గుర్తుంచుకోవాలి. ఎత్తు పెరిగి బరువు పెరగకపోతే మాత్రం సరైన ఆహారం పిల్లలకు ఇవ్వడం ద్వారా పిల్లల్లో తక్కువ బరువు సమస్యను సులభంగా అధిగమించవచ్చు.

Also Read: వ్యాయామం ఎక్కువగా చేస్తే కలిగే నష్టాలు తెలుసా..?

పిల్లలు పుట్టిన తొలి సంవత్సరంలోనే మూడు రెట్లు బరువు పెరిగే అవకాశం ఉంటుంది. బరువు పెరగకపోతే మొదట అందుకు తగిన కారణాన్ని తెలుసుకోవాలి. ఏడాది కంటే ఎక్కువ వయస్సు ఉన్న పిల్లలకు ఘనాహారం ఇవ్వడం ద్వారా సులభంగా బరువు పెరుతుతారు. పాలలో రొట్టెను నానబెట్టి ఇవ్వడం, అన్నం తినిపించడం ద్వారా పిల్లల్లో అందులోని పిండి పదార్థాలు పిల్లలకు అవసరమైన శక్తిని ఇస్తాయి.

Also Read: గుండె ఆరోగ్యంగా ఉండాలంటే తీసుకోవాల్సిన ఆహార పదార్థాలివే..?

పిల్లలు గుడ్డు, మాంసం, పప్పు తీసుకుంటే శరీరానికి అవసరమైన ప్రోటీన్లు లభిస్తాయి. పిల్లలకు ఎప్పుడూ వెన్నతో ఉన్న పాలను మాత్రమే ఇవ్వాలి. పిల్లల్లో కేలరీలు పెరగాలని అనుకుంటే ఆహారంలో కొంత నెయ్యి వేసి పిల్లలకు ఇవ్వవచ్చు. పిల్లలకు మాంసాహారం అప్పుడప్పుడు ఇవ్వాలి. పిల్లలు తినే ఆహారంలో ఆకుకూరలు, కూరగాయలు ఉండే విధంగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.

మరిన్ని వార్తలు కోసం: ఆరోగ్యం/జీవనం

ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నా పిల్లలు బరువు పెరగకపోతే వైద్యుడిని సంప్రదించి వైద్య పరీక్షలు చేయించడం ద్వారా బరువు పెరగకపోవడానికి కారణం తెలుసుకోవచ్చు. రోజుకు ఒకసారైనా మెత్తగా నలిపిన పండ్లను పిల్లలకు తినిపిస్తే మంచిది.