https://oktelugu.com/

‘ఆచార్య’ మూవీలోని మరో రహస్యాన్ని బయటపెట్టిన చిరంజీవి

మెగాస్టార్ చిరంజీవి హీరోగా అగ్ర దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘ఆచార్య’. ఇప్పటికే ఎంతో సీక్రెట్ గా ప్లాన్ చేసిన ఈ చిత్రం పేరును పొరపాటున చిరంజీవి రిలీజ్ చేయడం దుమారం రేపింది. దీనిపై దర్శకుడు, చిత్ర బృందం షాక్ తిన్నది. రహస్యంగా విడుదల చేసి ప్రేక్షకులకు షాకిద్దామని అనుకున్నారు. Also Read: జబర్దస్త్ కి వస్తానంటే వద్దంటున్నారట ! అయితే తాజాగా చిరంజీవియే తన సోషల్ మీడియాలో ఖాతాలో చిత్రంలోని కీలకమైన మరో […]

Written By:
  • NARESH
  • , Updated On : January 6, 2021 / 08:08 PM IST
    Follow us on

    మెగాస్టార్ చిరంజీవి హీరోగా అగ్ర దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘ఆచార్య’. ఇప్పటికే ఎంతో సీక్రెట్ గా ప్లాన్ చేసిన ఈ చిత్రం పేరును పొరపాటున చిరంజీవి రిలీజ్ చేయడం దుమారం రేపింది. దీనిపై దర్శకుడు, చిత్ర బృందం షాక్ తిన్నది. రహస్యంగా విడుదల చేసి ప్రేక్షకులకు షాకిద్దామని అనుకున్నారు.

    Also Read: జబర్దస్త్ కి వస్తానంటే వద్దంటున్నారట !

    అయితే తాజాగా చిరంజీవియే తన సోషల్ మీడియాలో ఖాతాలో చిత్రంలోని కీలకమైన మరో రహస్యాన్ని బయటపెట్టాడు.. ‘ఆచార్య’లోని అద్భుతమైన ఆలయ సెట్ ను అభిమానులతో పంచుకున్నాడు.

    ఆచార్య సినిమాలోనే హైలెట్ గా నిలిచే ఈ ఆలయ సెట్ కు సంబంధించిన వీడియోను ట్విట్టర్ లో చిరంజీవి పంచుకున్నారు. ప్రస్తుతం ఈ షూటింగ్ హైదరాబాద్ లో శరవేగంగా సాగుతోంది. మెగా పవర్ స్టార్ రాంచరణ్ సైతం ఇందులో కీలక పాత్ర పోషిస్తున్నారు.

    Also Read: ‘సమంత’ వద్దు అంటున్న నాగచైతన్య !

    ఈ చిత్రానికి ఆర్ట్ డైరెక్టర్ గా సురేష్ సెల్వరాజన్ పనిచేస్తున్నారు. ఆయనే ఈ అద్భుతమైన ఆలయ సెట్ ను వేశారు. రాంచరణ్, మ్యాట్నీ ఎంటర్ టైన్ మెంట్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్