బ్రేకింగ్: కేసీఆర్ బంధువుల కిడ్నాప్.. భూమా అఖిలప్రియ అరెస్ట్

ఏపీలోని వైఎస్ జగన్ సర్కార్ ఎన్ని ఆరోపణలు వచ్చినా గతంలో వైసీపీ ఎమ్మెల్యేగా చేసి టీడీపీలో చేరిన భూమా అఖిలప్రియపై సీరియస్ యాక్షన్ ఇప్పటిదాకా తీసుకోలేదు. వైఎస్ విజయమ్మకు భూమా అఖిలప్రియ దగ్గర కావడంతో ఇన్నాళ్లు కర్నూలులో పలు హత్యాయత్నం కేసుల్లో ఇరుకున్నా కూడా వైసీపీ ప్రభుత్వం చర్యలు తీసుకోలేదు.ఇక భూమా అఖిలప్రియ భర్త భార్గవ్ రామ్ పై కర్నూలులో హత్యాయత్నం, భూకబ్జాలు, బెదిరింపుల కేసులు నమోదైనా పెద్దగా చర్యలు లేవు. Also Read: క్వాలిటీ బియ్యం.. […]

Written By: NARESH, Updated On : January 6, 2021 4:18 pm
Follow us on

ఏపీలోని వైఎస్ జగన్ సర్కార్ ఎన్ని ఆరోపణలు వచ్చినా గతంలో వైసీపీ ఎమ్మెల్యేగా చేసి టీడీపీలో చేరిన భూమా అఖిలప్రియపై సీరియస్ యాక్షన్ ఇప్పటిదాకా తీసుకోలేదు. వైఎస్ విజయమ్మకు భూమా అఖిలప్రియ దగ్గర కావడంతో ఇన్నాళ్లు కర్నూలులో పలు హత్యాయత్నం కేసుల్లో ఇరుకున్నా కూడా వైసీపీ ప్రభుత్వం చర్యలు తీసుకోలేదు.ఇక భూమా అఖిలప్రియ భర్త భార్గవ్ రామ్ పై కర్నూలులో హత్యాయత్నం, భూకబ్జాలు, బెదిరింపుల కేసులు నమోదైనా పెద్దగా చర్యలు లేవు.

Also Read: క్వాలిటీ బియ్యం.. ఈసారి పక్కా

కానీ ఇప్పుడే ఇదే దందా తెలంగాణలో చేస్తుండడం.. పెద్ద పెద్ద భూముల్లో భార్గవ్ రామ్ బ్యాచ్ రాయలసీమ ఫ్యాక్షన్ రాజకీయాలు, బెదిరింపులు చేస్తున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా ఏకంగా ఓ భూవివాదంలో తెలంగాణ సీఎం కేసీఆర్ బంధువులనే కిడ్నాప్ చేయడం కలకలం రేపింది. ఇదే వారి కొంప ముంచింది. తెలంగాణ సీఎం కేసీఆర్ బంధువులనే కిడ్నాప్ చేయడంపై కేసీఆర్ సర్కార్ సీరియస్ అయ్యింది.

తాజాగా కేసీఆర్ బంధువులు రాత పూర్వకంగా భూమా అఖిలప్రియ, ఆమె భర్త భార్గవ్ కిడ్నాప్ చేయించి ఉంటారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. వీరి ఫిర్యాదు ఆధారంగానే పోలీసులు భూమా అఖిలప్రియను అరెస్ట్ చేసినట్టు తెలిసింది. ఈ కిడ్నాప్ వెనుక భూమా అఖిలప్రియ భర్త, ఆయన సోదరుడు కీలక పాత్రధారులని పోలీసుల విచారణలో తేలింది. ఓ 100 కోట్ల భూ వివాదమే ఈ గొడవకు కారణంగా తేలింది.

Also Read: ప్యాకేజీ పవన్‌..: ఆ ముద్ర పోయేదెలా..!

దీంతో తెలంగాణ పోలీసులు ఈరోజు సీరియస్ యాక్షన్ తీసుకున్నారు. ఈ కేసులో ఏకంగా మాజీ మంత్రి, టీడీపీ నాయకురాలు భూమా అఖిలప్రియను తెలంగాణ సర్కార్ అరెస్ట్ చేయడం తీవ్ర సంచలనమైంది. భూమా అఖిల ప్రియను మాత్రమే అరెస్ట్ చేశారని తెలుస్తోంది. ఈ కిడ్నాప్ లో ఆరోపణలు ఎదుర్కొంటున్న మె భర్త భార్గవ్, ఆయన సోదరుడి అరెస్ట్ పై పోలీసుల నుంచి క్లారిటీ రాలేదు.

బోయినపల్లిలో కేసీఆర్ బంధువులు ముగ్గురిని కిడ్నాప్ చేసిన కేసులో మాజీ మంత్రి భూమా అఖిలప్రియను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు అధికారికంగా తెలిపారు.. కూకట్ పల్లిలో ఉన్న ఆమెను అరెస్ట్ చేసి ఆమె సొంత కారులోనే బోయినపల్లి పోలీస్ స్టేషన్ తరలించారు.

మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్