వాళ్లు రాజీకి వచ్చారు..! : ఇక ప్రపంచ వ్యాప్తంగా ఆ వ్యాక్సిన్లు

నోరు ఉంది కదా అని ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడితే.. ఏం జరుగుతుందో అందరం ఊహించగలం. ఒక్కసారి నోరు జారితే మళ్లీ ఆ మాటలను వెనక్కి తీసుకోలేం.అత్యుత్తమ స్థానాల్లో ఉన్న వారు తొందరపడి ఒక మాట మాట్లాడితే దాని ప్రభావం తీవ్రంగా ఉండటమే కాదు.. అందుకు తగిన ఫలితాన్ని అనుభవించాల్సి ఉంటుంది. Also Read: ఎన్నికల వేళ మమతకు షాక్‌ల మీద షాక్‌లు కరోనా వ్యాక్సిన్‌ తయారు చేసేందుకు భారత్‌ ఎంతలా కష్టపడిందో అందరికీ తెలుసు. అయితే.. భారత్‌లోని […]

Written By: Srinivas, Updated On : January 6, 2021 12:36 pm
Follow us on


నోరు ఉంది కదా అని ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడితే.. ఏం జరుగుతుందో అందరం ఊహించగలం. ఒక్కసారి నోరు జారితే మళ్లీ ఆ మాటలను వెనక్కి తీసుకోలేం.అత్యుత్తమ స్థానాల్లో ఉన్న వారు తొందరపడి ఒక మాట మాట్లాడితే దాని ప్రభావం తీవ్రంగా ఉండటమే కాదు.. అందుకు తగిన ఫలితాన్ని అనుభవించాల్సి ఉంటుంది.

Also Read: ఎన్నికల వేళ మమతకు షాక్‌ల మీద షాక్‌లు

కరోనా వ్యాక్సిన్‌ తయారు చేసేందుకు భారత్‌ ఎంతలా కష్టపడిందో అందరికీ తెలుసు. అయితే.. భారత్‌లోని రెండు వ్యాక్సిన్లకు ఒకేసారి అనుమతి రావడం కూడా గమనార్హం. అయితే.. దీనిపై సీరం సీఈవో దూకుడుగా ప్రవర్తించారు. మూడు టీకాలు తప్పించి.. మిగితా అన్నీ మంచినీళ్లతో సమానమంటూ మాట్లాడుకొచ్చారు.ఆ వెంటనే రంగంలోకి దిగిన భారత్ బయోటెక్ సీఎండీ క్రిష్ణా ఎల్లా.. మమ్మల్ని ప్రశ్నించే వారు.. యూకే సంస్థ ట్రయల్స్ ను ఎవరూ ఎందుకు ప్రశ్నించరు? అని అన్నారు. ఇది నేరుగా సీరంను తాకటంతో పరిణామాలు వేగంగా చోటు చేసుకున్నాయి.

ఇక ఏమైందో ఏమో కానీ.. సీరం తనకు తానే రాజీ ట్వీట్‌ చేసింది. ఆ పంచాయితీకి ఫుల్‌స్టాప్‌ పెట్టింది. సమాచార లోపంతో జరిగిన దానిని మన్నించాలని.. తెర వెనుక జరిగిన పరిణామాలు ట్విట్టర్ వేదికగా సీరం సీఈవో.. క్రిష్ణా ఎల్లా కలిసి సంయుక్త ప్రకటనను విడుదల చేశారు. ఇందులో దేశ.. ప్రపంచ ప్రజల ప్రాణాలను జీవనోపాధిని కాపాడటమే తమకు అత్యంత ముఖ్యమైన అంశమని స్పష్టం చేశారు. వ్యాక్సిన్ కు సంబంధించిన అన్ని అంశాల్ని రెండు కంపెనీల అధిపతులు మాట్లాడుకున్నట్లుగా ఈ ప్రకటన పేర్కొంది.

Also Read: ఏపీలో దేవాలయాలపై దాడులు.. కేంద్రం జోక్యం?

అంతేకాదు.. తమ కోవిడ్‌ టీకాలను ప్రపంచ వ్యాప్తంగా అందుబాటులోకి తెస్తామని కలిసికట్టుగా ప్రతిన చేశారు. ప్రపంచానికి టీకాను సజావుగా తేవటం తమ విధిగా భావిస్తున్నట్లు వెల్లడించిన ఈ రెండు కంపెనీల సంయుక్త ప్రకటన టీకా యుద్ధాన్ని ఒక కొలిక్కి తెచ్చినట్లుగా అనిపించింది. మొత్తంగా ఒక్క విమర్శ.. మరో ప్రతివిమర్శతో పెద్ద వివాదం కొలిక్కి అయితే వచ్చింది.

మరిన్ని జాతీయ రాజకీయ వార్తల కోసం జాతీయ పాలిటిక్స్