https://oktelugu.com/

భారత్ బంద్.. ఢిల్లీ సీఎంను గృహనిర్భంధం చేసిన పోలీసులు..!

కేంద్రం వ్యవసాయ సంస్కరణ పేరిట ఇటీవల తీసుకొచ్చిన మూడు బిల్లులను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ రైతు సంఘాల నాయకులు నేడు భారత్ బంద్ కు పిలుపునిచ్చారు. ఈ బంద్ కు దాదాపు అన్ని రాజకీయ పార్టీలు మద్దతు తెలుపడంతోపాటు ప్రత్యక్షంగా బంద్ లో పాల్గొంటున్నాయి. Also Read: భారత్ బంద్ లో ఉద్రిక్తత.. ఒకరిపై చేయిచేసుకున్న టీఆర్ఎస్ ఎమ్మెల్యే..! ఉదయం నుంచి భారత్ బంద్ ప్రభావం కొనసాగుతోంది. ప్రజలంతా స్వచ్చంధంగా బంద్ లో పాల్గొంటున్నారు. వ్యాపార, […]

Written By:
  • Neelambaram
  • , Updated On : December 8, 2020 / 12:18 PM IST
    Follow us on

    కేంద్రం వ్యవసాయ సంస్కరణ పేరిట ఇటీవల తీసుకొచ్చిన మూడు బిల్లులను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ రైతు సంఘాల నాయకులు నేడు భారత్ బంద్ కు పిలుపునిచ్చారు. ఈ బంద్ కు దాదాపు అన్ని రాజకీయ పార్టీలు మద్దతు తెలుపడంతోపాటు ప్రత్యక్షంగా బంద్ లో పాల్గొంటున్నాయి.

    Also Read: భారత్ బంద్ లో ఉద్రిక్తత.. ఒకరిపై చేయిచేసుకున్న టీఆర్ఎస్ ఎమ్మెల్యే..!

    ఉదయం నుంచి భారత్ బంద్ ప్రభావం కొనసాగుతోంది. ప్రజలంతా స్వచ్చంధంగా బంద్ లో పాల్గొంటున్నారు. వ్యాపార, వాణిజ్య, విద్యాసంస్థలు పూర్తిగా మూసివేశారు. బస్సులు.. రైళ్లు నిలిచిపోయాయి. రోడ్లపై ఆయా పార్టీల రాస్తారోకోలతో పెద్దఎత్తున ట్రాఫిక్ జామ్ అవుతోంది.

    భారత్ బంద్ కు ఆమ్ ఆద్మీ సైతం మద్దతు తెలిపింది. ఈక్రమంలోనే ఇటీవల ఢిల్లీ సీఎం క్రేజీవాల్ సింధ్ ప్రాంతానికి వెళ్లి రైతులను పరామర్శించారు. దీంతో రైతుల ఆందోళనకు ఢిల్లీ సీఎం క్రేజీవాల్ పరోక్షంగా ప్రోత్సహిస్తున్నారనే కారణంతోనే ఢిల్లీ పోలీసులు ఆయనను నేడు గృహ నిర్భంధంలోకి తీసుకున్నారు.

    Also Read: ట్విట్టర్ ట్రెండింగ్స్: ఈ ఏడాది దీని గురించే వెతికారు

    ఈ విషయాన్ని ఆమ్ ఆద్మీ పార్టీ ట్వీటర్లో కొద్దిసేపటి క్రితమే ట్వీటర్లో వెల్లడించింది. ఢిల్లీ సీఎం క్రేజీవాల్ ను పోలీసులు హౌస్ అరెస్టు చేశారని పేర్కొంది. దీంతో ఆయన ఇంట్లో నుంచి ఎవరినీ బయటికి రానివ్వడం లేదని.. లోపలికి పోనివ్వడం లేదని ఆమ్ ఆద్మీ నాయకులు ట్వీటర్లో వెల్లడించారు. ఢిల్లీ పోలీసులు బీజేపీ పోలీసులుగా మారారంటూ ఆ పార్టీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు.