https://oktelugu.com/

గూగుల్ ఉద్యోగి హైదరాబాద్ కార్పొరేటర్ ఎలా అయ్యింది?

గూగుల్ ఉద్యోగి హైదరాబాద్ కార్పొరేటర్ గా మారిన వైనం యువతకు స్ఫూర్తినిస్తోంది. అటు క్లాస్‌ను, ఇటు మాస్‌ను అందరినీ ఆకట్టుకుంటూ రెండో సారి తాజాగా 2020 జీహెచ్ఎంసీ ఎన్నికల్లోనూ పోటీచేసి నెగ్గి రాజకీయాల్లో రాణిస్తున్నారు సామల హేమ. Also Read: విజయశాంతి బీజేపీలోనైనా రాణిస్తుందా? సికింద్రాబాద్‌ నియోజకవర్గం సీతాఫల్‌మండికి చెందిన సామల రాజు (అలియాస్‌ కరాటే రాజు), జ్యోతి దంపతుల కుమార్తె సామల హేమ ప్రసుత్తం ఉస్మానియావర్సిటీలో కామర్స్‌ ఆఫ్‌ బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌ కాలేజీలో పీహెచ్‌డీ చేస్తున్నారు. […]

Written By:
  • NARESH
  • , Updated On : December 8, 2020 / 12:11 PM IST
    Follow us on

    గూగుల్ ఉద్యోగి హైదరాబాద్ కార్పొరేటర్ గా మారిన వైనం యువతకు స్ఫూర్తినిస్తోంది. అటు క్లాస్‌ను, ఇటు మాస్‌ను అందరినీ ఆకట్టుకుంటూ రెండో సారి తాజాగా 2020 జీహెచ్ఎంసీ ఎన్నికల్లోనూ పోటీచేసి నెగ్గి రాజకీయాల్లో రాణిస్తున్నారు సామల హేమ.

    Also Read: విజయశాంతి బీజేపీలోనైనా రాణిస్తుందా?

    సికింద్రాబాద్‌ నియోజకవర్గం సీతాఫల్‌మండికి చెందిన సామల రాజు (అలియాస్‌ కరాటే రాజు), జ్యోతి దంపతుల కుమార్తె సామల హేమ ప్రసుత్తం ఉస్మానియావర్సిటీలో కామర్స్‌ ఆఫ్‌ బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌ కాలేజీలో పీహెచ్‌డీ చేస్తున్నారు. 2013-15 వరకు జన్‌ప్యాక్‌లో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిగా చేసిన హేమ 2015లో గూగుల్‌లో చేరారు. 2016లో యూఎస్‌ వెళ్లటానికి ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు. ఇంతలో జీహెచ్‌ఎంసీ ఎన్నికల నగారా మోగింది. సికింద్రాబాద్‌ నియోజకర్గంలోని అన్ని డివిజన్‌లు మహిళలకు రిజర్వు అయ్యాయి.

    Also Read: భారత్ బంద్ లో ఉద్రిక్తత.. ఒకరిపై చేయిచేసుకున్న టీఆర్ఎస్ ఎమ్మెల్యే..!

    అప్పటి మంత్రి, ప్రసుత్త డిప్యూటీ స్పీకర్‌ తీగుళ్ల పద్మారావుగౌడ్‌ ఏకంగా సామల హేమకు టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా సీతాఫల్‌మండి నుంచి అవకాశం కల్పించారు. కుటుంబసభ్యుల కోరిక మేరకు యూఎస్‌ వెళ్లే ఆలోచనకు విరామం ఇచ్చి ఎన్నికల బరిలో నిలిచారు. 16 వేల ఓట్ల మెజారిటీతో సీతాఫల్‌మండి కార్పొరేటర్‌గా తొలి విజయం సాధించారు. ప్రజల్లో తిరుగుతూ, అధికారుల సమావేశాల్లో పాల్గొంటూ ప్రజాసమస్యలపై అవగాహన పెంచుకున్నారు.

    మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్

    గ్రేటర్ ఎన్నికల్లో కార్పొరేట్ ఉద్యోగి కార్పొరేటర్ అయిన వైనం ఇప్పుడు వైరల్ అయ్యింది. గ్రేటర్ ఎన్నికల్లో హైదరాబాద్ చరిత్రలోనే అత్యధిక మెజారిటీతో విజయం సాధించి సామల హేమ రికార్డు సృష్టించింది. ఎంబీఏ చదివిన హేమకు గూగుల్‌లో ఏడు నెలల క్రితం గూగుల్‌లో ఉద్యోగం వచ్చింది. అంతకు ముందు జెన్‌పాక్ట్‌లో ఉద్యోగం చేసింది. జాబ్ చేస్తూనే కీసరలోని అశ్విత్ జీజస్ కాలేజ్‌లో ఫైనాన్స్‌లో ఎంబీఏ చేసింది. అమ్మ, నాన్న, అన్నయ్య ఇదే ఆమె జీవితం. కానీ గ్రేటర్ ఎన్నికలు ఆమె జీవితాన్నే మార్చేశాయి.