https://oktelugu.com/

టీపీసీసీ చీఫ్: శ్రీధర్ బాబు అయితే అందరికీ ఓకే?

తెలంగాణ పీసీసీ రేసు సెగలు పుట్టిస్తోంది. ప్రజా క్షేత్రంలోని రాని ఎందరో నేతలు ఇప్పుడు ఆ పీఠం కోసం కొట్టుకుంటున్న పరిస్థితి నెలకొంది. మొన్నటి జీహెచ్ఎంసీ , దుబ్బాక ఎన్నికల్లో పాటు పడిన నేతలంతా పీఠం కోసం మాత్రం ముందుకు వస్తున్నారు. ప్రస్తుతం ఈ పీసీసీ చీఫ్ పదవి రేసులో రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి, జగ్గారెడ్డి, జీవన్ రెడ్డి తదితర నేతలు అధిష్టానం వద్ద లాబీయింగ్ చేస్తున్నారు. వీరంతా రెడ్డి సామాజికవర్గానికి చెందిన నేతలే కావడంతో మిగతా […]

Written By:
  • NARESH
  • , Updated On : December 8, 2020 / 12:25 PM IST
    Follow us on

    తెలంగాణ పీసీసీ రేసు సెగలు పుట్టిస్తోంది. ప్రజా క్షేత్రంలోని రాని ఎందరో నేతలు ఇప్పుడు ఆ పీఠం కోసం కొట్టుకుంటున్న పరిస్థితి నెలకొంది. మొన్నటి జీహెచ్ఎంసీ , దుబ్బాక ఎన్నికల్లో పాటు పడిన నేతలంతా పీఠం కోసం మాత్రం ముందుకు వస్తున్నారు. ప్రస్తుతం ఈ పీసీసీ చీఫ్ పదవి రేసులో రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి, జగ్గారెడ్డి, జీవన్ రెడ్డి తదితర నేతలు అధిష్టానం వద్ద లాబీయింగ్ చేస్తున్నారు. వీరంతా రెడ్డి సామాజికవర్గానికి చెందిన నేతలే కావడంతో మిగతా వర్గాల్లో వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఇప్పటివరకు చేసిన ఉత్తమ్ కూడా రెడ్డి కావడంతో ఇప్పుడు వాళ్లకు ఇవ్వవద్దనే వాదన తెరపైకి వచ్చింది. బీసీలు లేదా ఇతర సామాజికవర్గాలకు ఇవ్వాలన్న డిమాండ్ వినిపిస్తోంది. ఈ క్రమంలోనే శ్రీధర్ బాబు పేరు తెరపైకి వచ్చినట్టు తెలుస్తోంది.

    Also Read: గూగుల్ ఉద్యోగి హైదరాబాద్ కార్పొరేటర్ ఎలా అయ్యింది?

    టీపీసీసీ చీఫ్ గా సౌమ్యుడు, వివాదరహితుడు అయిన మంథని కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీధర్ బాబు అయితే అందరికీ బెటర్ అని అభిప్రాయపడుతున్నారు. కాంగ్రెస్ లోని అన్ని వర్గాల మద్దతు ఆయనకే ఉందని సమాచారం. అధిష్టానం ఆశీస్సులు కూడా శ్రీధర్ బాబుకు ఉన్నాయని అంటున్నారు.

    Also Read: బీజేపీ ‘మిషన్-2023’ స్టార్ట్ : కాంగ్రెస్, టీఆర్ఎస్ టార్గెట్?

    శ్రీధర్ బాబు బ్రాహ్మణ సామాజికవర్గానికి చెందిన నేత కావడంతో ఆయనకు మద్దతు పెరుగుతోంది. పార్టీ పెద్దలతో సాన్నిహిత్యం ఉంది. మంథని ఎమ్మెల్యేగా మూడు సార్లు గెలిచాడు. వైఎస్ఆర్ హయాంలో మంత్రిగా చేశాడు. మూడు దశాబ్ధాలుగా రాజకీయాల్లో ఉన్నారు. కాంగ్రెస్ తరుఫున దుద్దిళ్ల శ్రీపాదరావు స్పీకర్ గా పనిచేశాడు. ఇక శ్రీధర్ బాబుకు టీపీసీసీ చీఫ్ ఇస్తే అభ్యంతరం లేదని ఇప్పటికే కోమటిరెడ్డి ,రేవంత్ రెడ్డి స్పష్టం చేయడం విశేషం. దీంతో ఇక ఆయనకే అధిష్టానం ఇస్తుందని ప్రచారం సాగుతోంది.

    దీంతో టీపీసీసీ చీఫ్ రేసులో దుద్దిళ్ల శ్రీధర్ బాబు పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. పాత కరీంనగర్ జిల్లాలోని కాటారం మండలం ధన్వాడ శ్రీధర్ బాబు సొంతూరు. ఆయనకు రాజకీయాల్లో వివాదరహితుడిగా.. సౌమ్యుడిగా పేరుంది. అధిష్టానంతో నేరుగా సంబంధాలు ఉన్న శ్రీధర్ బాబును పీసీసీ చీఫ్ చేస్తే అన్ని వర్గాలను సమన్వయం చేయగలడని.. పార్టీకి పూర్వ వైభవం వస్తుందని అధిష్టానం భావిస్తున్నట్టు తెలిసింది.

    మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్

    దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఓటమితో తెలంగాణ పీసీసీ చీఫ్ గా ఉత్తమ్ కుమార్ రెడ్డి వైదొలిగారు. ఇప్పుడా హాట్ సీటు ఎవరికి వస్తుందనే ఉత్కంఠ అందరిలోనూ ఉంది. రేవంత్ రెడ్డి అందరికంటే ముందు ఉండగా.. కోమటిరెడ్డి తానే ముందు అని ప్రకటన ఇచ్చాడు. అయితే కాంగ్రెస్ లోని అన్ని వర్గాలకు వీరిద్దరూ ఆమోదయోగ్యం కాదని అంటున్నారు. అందుకే శ్రీధర్ బాబు పేరును తెరపైకి తెచ్చారు.