https://oktelugu.com/

భారత్ బంద్ కు అనుహ్య స్పందన.. రైతు కోసం ఏకతాటిపైకొచ్చిన దేశం..!

భారత్ లోకి కరోనా ఎంట్రీ ఇవ్వగానే కేంద్రం లాక్డౌన్ విధించింది. ఆ సమయంలో దాదాపు అన్నిరంగాలు షట్ డౌన్ అయ్యాయి. దీంతో దేశ ఆర్థిక వ్యవస్థ కుదేలైంది. అయితే ఒక్క వ్యవసాయం రంగం మాత్రం దేశాన్ని గాడినపెట్టే పనిలో పడింది. లాక్డౌన్లోనూ అన్నదాత ఏమాత్రం వెనక్కి తగ్గకుండా పంటలను పండించి అందరికీ అన్నం పెట్టేందుకు సిద్ధమయ్యాడు. Also Read: రైతుల ఆందోళన.. ప్రతిపక్షాల కుట్రనా..! కరోనాకు కూడా భయపడని అన్నదాత.. కేంద్రం తెచ్చిన కొత్త వ్యవసాయ బిల్లులపై […]

Written By:
  • Neelambaram
  • , Updated On : December 8, 2020 / 06:49 PM IST
    Follow us on

    భారత్ లోకి కరోనా ఎంట్రీ ఇవ్వగానే కేంద్రం లాక్డౌన్ విధించింది. ఆ సమయంలో దాదాపు అన్నిరంగాలు షట్ డౌన్ అయ్యాయి. దీంతో దేశ ఆర్థిక వ్యవస్థ కుదేలైంది. అయితే ఒక్క వ్యవసాయం రంగం మాత్రం దేశాన్ని గాడినపెట్టే పనిలో పడింది. లాక్డౌన్లోనూ అన్నదాత ఏమాత్రం వెనక్కి తగ్గకుండా పంటలను పండించి అందరికీ అన్నం పెట్టేందుకు సిద్ధమయ్యాడు.

    Also Read: రైతుల ఆందోళన.. ప్రతిపక్షాల కుట్రనా..!

    కరోనాకు కూడా భయపడని అన్నదాత.. కేంద్రం తెచ్చిన కొత్త వ్యవసాయ బిల్లులపై మాత్రం ఆందోళన చెందుతుండటం గమనార్హం. వ్యవసాయ సంస్కరణ పేరిట కేంద్రం తెచ్చిన కొత్త చట్టాల వల్ల తమకు కనీసం గిట్టుబాటు కూడా దక్కదని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈక్రమంలోనే రైతులు గడిచిన 12రోజులుగా వణికించే చలిని కూడా లెక్కచేయకుండా ఢిల్లీలో నిరసనలు చేపడుతున్నారు.

    రైతులకు కేంద్రానికి మధ్య కొన్నిసార్లు చర్చలు జరిగినా ఫలితం మాత్రం రాలేదు. కేంద్రం తీసుకొచ్చిన మూడు చట్టాలను వెనక్కి తీసుకోవాలని రైతులు పట్టుబడుతుండటంతో చర్చలు అసంతృప్తి నిలిచిపోతున్నాయి. ఈక్రమంలో రైతు సంఘాల నేతలు నేడు భారత్ బంద్ కు పిలుపునిచ్చారు. ఈ బంద్ కు దాదాపు అన్ని రాజకీయ పార్టీలు మద్దతు తెలిపాయి.

    Also Read: వ్యవసాయ బిల్లులతో రైతులకు లాభామా.. నష్టమా?

    కేంద్రం తెచ్చిన కొత్త చట్టాలపై ఉత్తరాది రైతులకు ఎక్కువగా అవగాహన ఉండటంతో ఆయా రాష్ట్రాల్లో భారత్ బంద్ సంపూర్ణంగా జరిగింది. ఇక దక్షిణాది రైతులకు ఈ చట్టాలపై కనీస అవగాహన లేకపోవడంతో రైతులు ఈ బంద్ లో పెద్దగా పాల్గొనలేదు. అయితే రాజకీయ పార్టీలు రైతులకు మద్దతు తెలుపడంతో తెలంగాణ.. ఏపీ.. తమిళనాడు.. కర్ణాటక రాష్ట్రాల్లోనూ భారత్ బంద్ విజయవంతమైంది.

    రైతుల కోసం ప్రతిపక్ష పార్టీలన్నీ రోడ్లపైకి కేంద్రానికి వ్యతిరేకంగా నిరసన తెలిపాయి. ఈ బంద్ బీజేపీయేత పార్టీలన్నీ ఏకతాటిపైకి తెచ్చినట్లు కన్పిస్తోంది. ఇది ఒకరకంగా బీజేపీకి ఇబ్బంది కలిగించే అంశంగా మారింది. దీంతో కేంద్రం సైతం వ్యవసాయ బిల్లులపై చర్చించేందుకు మరోసారి రైతులను చర్చలకు పిలిచింది. రాత్రి 7గంటలకు కేంద్ర మంత్రి అమిత్ షా నేతృత్వంలో చర్చలు జరుగనునండటంతో ఈ సమస్యకు ఓ పరిష్కారం వచ్చేలా కన్పిస్తోంది.

    మరిన్ని జాతీయ రాజకీయ వార్తల కోసం జాతీయ పాలిటిక్స్