కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ ప్రభుత్వం ఎన్నో స్కీమ్ లను అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. కేంద్రం అమలు చేస్తున్న స్కీమ్ లలో ప్రధాన మంత్రి వయో వందన యోజన స్కీమ్ కూడా ఒకటి. 60 సంవత్సరాల వయస్సు దాటిన పెద్దలకు జీవితంపై భరోసా కల్పించాలనే ఉద్దేశంతో కేంద్రం ఈ స్కీమ్ ను అమలు చేస్తోంది. కేంద్ర ప్రభుత్వం దేశీయ బీమా దిగ్గజ కంపెనీ ఎల్ఐసీ తరపున ఈ స్కీమ్ ను అమలు చేస్తుండటం గమనార్హం.
Also Read: తిరుపతి ఉప ఎన్నికల్లో బలాబలాలు.. పవన్ ప్రయాణం ఎటు?
ప్రధాన మంత్రి వయో వందన యోజన స్కీమ్ అమలుకు చివరి తేదీ 2021 మార్చి 31 కాగా కేంద్రం మరో రెండేళ్ల పాటు ఈ స్కీమ్ గడువును పొడిగించడం గమనార్హం. ఈ స్కీమ్ లో చేరాలనే ఆసక్తి ఉన్నవాళ్లు 2023 సంవత్సరం మార్చి 31వ తేదీలోగా ఈ స్కీమ్ లో చేరవచ్చు. కేవలం సీనియర్ సిటిజన్స్ ను దృష్టిలో ఉంచుకుని కేంద్రం ఈ స్కీమ్ ను అమలు చేస్తుండటం గమనార్హం. ఆసక్తి ఉన్నవాళ్లు ఆన్ లైన్ లో కూడా ఈ స్కీమ్ లో చేరవచ్చు.
Also Read: కరోనాపై మరో షాకింగ్ న్యూస్.. ఆ అవయవానికి ప్రమాదం..?
ఈ స్కీమ్ లో గరిష్టంగా 15 లక్షల రూపాయల వరకు డిపాజిట్ చేసుకునే అవకాశం ఉంటుంది. పాలసీ కాలవ్యవధి 10 సంవత్సరాలు కాగా ఈ ఏడాది మార్చి ఆర్థిక సంవత్సరంలోపు కొనుగోలు చేసే పాలసీలపై 7.4 శాతం వార్షిక వడ్డీరేటును పొందే అవకాశం ఉంటుంది. 2022, 2023లో కొనుగోలు చేసే పాలసీలకు ఆర్థిక సంవత్సరాల ప్రారంభాన్ని బట్టి ప్రభుత్వం వడ్డీరేటును నిర్ణయించడం జరుగుతుంది.
మరిన్ని వార్తల కోసం: అత్యంత ప్రజాదరణ (ట్రెండింగ్)
ఈ స్కీమ్ ద్వారా కనిష్టంగా 1,000 రూపాయల నుంచి గరిష్టంగా 9,250 రూపాయల వరకు పెన్షన్ ను పొందే అవకాశం ఉంటుంది. పాలసీని కొనుగోలు చేసిన మూడు సంవత్సరాల తర్వాత 75 శాతం వరకు రుణం పొందే సదుపాయం ఉంది. పాలసీదారులకు తీవ్ర అనారోగ్య పరిస్థితులు తలెత్తితే కొనుగోలు చేసిన ధరలో 98 శాతం తిరిగి పొందవచ్చు.