https://oktelugu.com/

బ్యాంక్ ఖాతాదారులకు అలర్ట్.. మార్చి 27 నుంచి వరుస సెలవులు..?

మన దేశంలో ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో కానీ ప్రైవేట్ రంగ బ్యాంకుల్లో కానీ ఖాతాలను కలిగి ఉన్నవాళ్లు తరచూ ఏదో ఒక పనిపై బ్యాంకు లావాదేవీలను నిర్వహిస్తూ ఉంటారు. బ్యాంకు లావాదేవీలు చేసేవాళ్లు బ్యాంకు సెలవుల గురించి తప్పనిసరిగా అవగాహన ఏర్పరచుకోవాలి. మార్చి నెల 27వ తేదీ బ్యాంకు సెలవులు వరుసగా ఉన్నాయి. మార్చి నెల 27 నుంచి ఏప్రిల్ నెల 4 మధ్య కేవలం రెండే రోజులు బ్యాంకు లావాదేవీలు జరుపుకోవచ్చు. ఆర్బీఐ బ్యాంక్ హాలిడే […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : March 20, 2021 / 08:37 PM IST
    Follow us on

    మన దేశంలో ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో కానీ ప్రైవేట్ రంగ బ్యాంకుల్లో కానీ ఖాతాలను కలిగి ఉన్నవాళ్లు తరచూ ఏదో ఒక పనిపై బ్యాంకు లావాదేవీలను నిర్వహిస్తూ ఉంటారు. బ్యాంకు లావాదేవీలు చేసేవాళ్లు బ్యాంకు సెలవుల గురించి తప్పనిసరిగా అవగాహన ఏర్పరచుకోవాలి. మార్చి నెల 27వ తేదీ బ్యాంకు సెలవులు వరుసగా ఉన్నాయి. మార్చి నెల 27 నుంచి ఏప్రిల్ నెల 4 మధ్య కేవలం రెండే రోజులు బ్యాంకు లావాదేవీలు జరుపుకోవచ్చు.

    ఆర్బీఐ బ్యాంక్ హాలిడే ప్రకారం రెండో శనివారం, హోలీ పండుగల వల్ల మార్చి నెల 27 నుంచి 29వ తేదీ వరకు సెలవులు ఉన్నాయి. మార్చి నెల 30వ తేదీన పాట్నాలోని బ్యాంక్ శాఖలు నాలుగు రోజుల పాటు మూసివేస్తారు. మార్చి నెల 31వ తేదీన సెలవు కాకపోయినా ఆర్థిక సంవత్సరం చివరి రోజు బ్యాంకు లావాదేవీలు జరగవు. ఏప్రిల్ 2వ తేదీన గుడ్ ఫ్రైడే కావడంతో బ్యాంకులకు సెలవు దినంగా ఉంటుంది.

    దేశవ్యాప్తంగా బ్యాంకులకు వరుస సెలవులు కావడంతో ఖాతాదారులు గమనించి తొందరగా లావాదేవీలు జరుపుకుంటే మంచిది. ఏప్రిల్ 1 బ్యాంకులు తమ వార్షిక ఖాతాలను మూసివేయడానికి బ్యాంకులు కల్పిస్తాయి. ఏప్రిల్ నెలలో కూడా గుడ్ ఫ్రైడే, ఏప్రిల్ 5 బాబు జగ్జీవన్ రామ్ పుట్టినరోజు, ఏప్రిల్ 13 ఉగాది పండుగ, ఏప్రిల్ 14 అంబేద్కర్ జయంతి, ఏప్రిల్ 15 హిమాచల్ డే / బెంగాలీ నూతన సంవత్సర దినోత్సవం ఉన్నాయి.

    ఏప్రిల్ 16వ తేదీన బోహాగ్ బిహు, ఏప్రిల్ 17వ తేదీన శ్రీ రామనవమి, గారియా పూజ సెలవులుగా ఉన్నాయి. ఏప్రిల్ నెలలో కూడా ఎక్కువ సెలవులు ఉండటంతో వరుస సెలవులు ఉండటంతో జాగ్రత్తలు తీసుకుంటే మంచిది