https://oktelugu.com/

అల్లుడితో అత్త ఎఫైర్.. అడ్డొచ్చిన భర్తను ఇలా..

సమాజంలో మానవ సంబంధాలకు విలువ లేకుండా పోతోంది. వ్యామోహాల మోజులో బంధాలను కడతేరుస్తున్న పరిస్థితి నెలకొంది. ప్రేమలు, అప్యాయతలకు అస్సలు అర్థం లేకుండా పోతోంది. తాజాగా చిత్తూరు జిల్లాలో దారుణం జరిగింది. అల్లుడుతో అక్రమ సంబంధం పెట్టుకున్న అత్తు ఏకంగా కట్టుకున్న భర్తనే కడతేర్చిన వైనం చోటుచేసుకుంది. ఐరాల మండలం రంగయ్యచెరువు ఎస్టీకాలనీకి చెందిన నాగరాజు (51), మంజులకు కొన్నేళ్ల క్రితం పెళ్లి జరిగింది. వీరి కుమార్తె రాణిని బంగారు పాళ్యం మండలం చిట్టేరి ఎస్టీ కాలనీకి […]

Written By:
  • NARESH
  • , Updated On : August 1, 2021 / 10:18 AM IST
    Follow us on

    సమాజంలో మానవ సంబంధాలకు విలువ లేకుండా పోతోంది. వ్యామోహాల మోజులో బంధాలను కడతేరుస్తున్న పరిస్థితి నెలకొంది. ప్రేమలు, అప్యాయతలకు అస్సలు అర్థం లేకుండా పోతోంది. తాజాగా చిత్తూరు జిల్లాలో దారుణం జరిగింది. అల్లుడుతో అక్రమ సంబంధం పెట్టుకున్న అత్తు ఏకంగా కట్టుకున్న భర్తనే కడతేర్చిన వైనం చోటుచేసుకుంది.

    ఐరాల మండలం రంగయ్యచెరువు ఎస్టీకాలనీకి చెందిన నాగరాజు (51), మంజులకు కొన్నేళ్ల క్రితం పెళ్లి జరిగింది. వీరి కుమార్తె రాణిని బంగారు పాళ్యం మండలం చిట్టేరి ఎస్టీ కాలనీకి చెందిన సుబ్రహ్మణ్యానికి ఇచ్చి వివాహం చేశారు.

    అయితే కూతురు భర్త, అల్లుడైన సుబ్రహ్మణ్యంతో అత్త మంజుల మూడేళ్లుగా వివాహేతర సంబంధం పెట్టుకుంది. అల్లుడితో తెగ ఎంజాయ్ చేస్తోంది. కూతురు మొగుడు అని కూడా చూడకుండా అతడితో స్వర్గాన్ని చూస్తోంది. వారం రోజుల కిందట సోమల మండలం ఇర్లపల్లెలో కాపురం ఉంటున్న కుమార్తె రాణి ఇంటికి మంజుల వచ్చింది. తమ అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్న భర్తను కడతేర్చేందుకు భార్య, అల్లుడు పథకం వేశారు.

    అత్తా, అల్లుడు ఇద్దరూ కలిసి మామ నాగరాజును కంచెంవారి పల్లె సమీపంలోని అడవిలోకి తీసుకెళ్లి అతిగా మద్యం తాగించారు. అనంతరం కర్రలు, రాళ్లతో కొట్టి చంపి వడ్లవాణి కుంటలో పడేసి వెళ్లిపోయారు.

    నీటిలో తేలిన శవంపై సమాచారం అందుకున్న పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని శవ పరీక్షలకు పంపి దర్యాప్తు చేపట్టారు. విచారణ జరపగా.. ఇదంతా చేసింది అల్లుడు, అత్త అని తెలియడంతో అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపినట్లు సీఐ వివరించారు.