https://oktelugu.com/

టీఆర్ఎస్ గెలిచే ఎమ్మెల్సీ ఎన్నికలను కేసీఆర్ ఎందుకాపారు?

తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికలు నిర్వహించాల్సి ఉన్నా ప్రభుత్వం మాత్రం వాయిదా వేస్తోంది. దీంతో ఆశావహుల్లో నిరాశే ఎదురవుతోంది. రాష్ర్టంలో ఆరు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగాల్సి ఉంది. కానీ కేసీఆర్ ఇప్పుడే ఎన్నికలు నిర్వహించే వీలు లేదని ఎన్నికల కమిషన్ కు లేఖ రాయడంతో అందరు ఆశ్చర్యపోతున్నారు. అసలు ఎన్నికలు వాయిదా వేయాల్సిన అవసరం ఏమిటనే ప్రశ్న ఉత్పన్నం అవుతోంది. దీంతో ఎమ్మెల్సీ ఎన్నికలు ఇప్పట్లో జరిగే అవకాశాలు లేవని తెలుస్తోంది. ఆరు ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ […]

Written By: , Updated On : August 1, 2021 / 10:21 AM IST
Follow us on

KCR Stops MLC Elections

తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికలు నిర్వహించాల్సి ఉన్నా ప్రభుత్వం మాత్రం వాయిదా వేస్తోంది. దీంతో ఆశావహుల్లో నిరాశే ఎదురవుతోంది. రాష్ర్టంలో ఆరు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగాల్సి ఉంది. కానీ కేసీఆర్ ఇప్పుడే ఎన్నికలు నిర్వహించే వీలు లేదని ఎన్నికల కమిషన్ కు లేఖ రాయడంతో అందరు ఆశ్చర్యపోతున్నారు. అసలు ఎన్నికలు వాయిదా వేయాల్సిన అవసరం ఏమిటనే ప్రశ్న ఉత్పన్నం అవుతోంది. దీంతో ఎమ్మెల్సీ ఎన్నికలు ఇప్పట్లో జరిగే అవకాశాలు లేవని తెలుస్తోంది. ఆరు ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అయి రెండు నెలలు అవుతున్నా ప్రభుత్వం మాత్రం పట్టించుకోవడం లేదు. గతంలో ఈసీ కరోనా కారణంగా ఎన్నికలు వాయిదా వేసిన సంగతి తెలిసిందే.

హుజురాబాద్ ఉప ఎన్నిక నేపథ్యంలో ఎమ్మెల్సీ ఎన్నికలు వాయిదా వేసినట్లు సమాచారం. కానీ ప్రభుత్వం మాత్రం కరోనా నేపథ్యంలో ఎన్నికలు నిర్వహించడం సాధ్యం కాదని చెప్పడం కొసమెరుపు. కరోనా కేసులు తగ్గినా ప్రభుత్వం కరోనా సాకు చూపించడంపై అందరిలో అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఎన్నికల నిర్వహణపై దృష్టి సారించాల్సిన ప్రభుత్వం కావాలనే వాయిదా పాట అందుకుంటుందని తెలుస్తోంది.

హుజురాబాద్ ఎన్నిక ఉండడంతో ఎమ్మెల్సీ ఎన్నికలు నిర్వహిస్తే పదవులు రాని వారు ఎదురుతిరిగే అవకాశం ఉండడంతోనే వాయిదా వేస్తున్నట్లు చెబుతున్నారు. ప్రస్తుతం ఆరు ఎమ్మెల్సీ స్థానాలుండగా వాటిని ఆశిస్తున్న వారి సంఖ్య ఇరవైదాకా ఉండడంతో పదవులు రాని వారు హుజురాబాద్ ఎన్నికకు అభ్యంతరం చెప్పే సూచనలున్నట్లు తెలియడంతోనే వాయిదా వేస్తూ వస్తోందని తెలుస్తోంది.

ఎమ్మెల్సీ ఎన్నికల కోసం ఎదురుచూస్తున్న ఆశావహుల కోరిక మాత్రం నెరవేరడం లేదు. ఈ నేపథ్యంలో హుజురాబాద్ ఉప ఎన్నికపై ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ఎటూ పాలుపోని పరిస్థితి. ఇన్నాళ్లు పదవి వస్తుందని ఆశించిన వారికి నిరాశే ఎదురవుతోంది. కేసీఆర్ పరిస్థితులను తనకు అనుకూలంగా మలుచుకోవడంలో అందెవేసిన చేయి. అందుకే కావాలనే ఎమ్మెల్సీ ఎన్నికలను వాయిదా వేసి ఆశావహుల్లో ఆగ్రహం చవి చూసే విధంగా చేస్తున్నారని ప్రచారం.