https://oktelugu.com/

నిరుద్యోగులకు శుభవార్త.. పరీక్ష లేకుండా హెటిరో డ్రగ్స్ లో జాబ్స్..?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో ఉన్న జగన్ సర్కార్ లక్షల సంఖ్యలో గ్రామ సచివాలయాల, గ్రామ వాలంటీర్ల ఉద్యోగాలను భర్తీ చేసి నిరుద్యోగులకు ప్రయోజనం చేకూర్చిన సంగతి తెలిసిందే. అదే సమయంలో ప్రైవేట్ కంపెనీలలో ఉద్యోగ ఖాళీల భర్తీ కొరకు ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ రిక్రూట్‌మెంట్‌ డ్రైవ్స్ నిర్వహిస్తూ నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలను కల్పిస్తోంది. తాజాగా హెటిరో డ్రగ్స్ వేర్వేరు ఉద్యోగ ఖాళీల భర్తీ చేయడానికి ఇంటర్వ్యూలను నిర్వహిస్తున్నట్టు ఏపీ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ నుంచి […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : March 23, 2021 / 11:56 AM IST
    Follow us on

    ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో ఉన్న జగన్ సర్కార్ లక్షల సంఖ్యలో గ్రామ సచివాలయాల, గ్రామ వాలంటీర్ల ఉద్యోగాలను భర్తీ చేసి నిరుద్యోగులకు ప్రయోజనం చేకూర్చిన సంగతి తెలిసిందే. అదే సమయంలో ప్రైవేట్ కంపెనీలలో ఉద్యోగ ఖాళీల భర్తీ కొరకు ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ రిక్రూట్‌మెంట్‌ డ్రైవ్స్ నిర్వహిస్తూ నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలను కల్పిస్తోంది.

    తాజాగా హెటిరో డ్రగ్స్ వేర్వేరు ఉద్యోగ ఖాళీల భర్తీ చేయడానికి ఇంటర్వ్యూలను నిర్వహిస్తున్నట్టు ఏపీ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ నుంచి ప్రకటన వెలువడింది. మార్చి నెల 28వ తేదీన విజయనగరంలో ఈ రిక్రూట్ మెంట్ డ్రైవ్ జరగనుంది. హెటిరో డ్రగ్స్ మొత్తం 175 ఉద్యోగ ఖాళీలను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనుంది. హెటిరో డ్రగ్స్ ఈ నోటిఫికేషన్ ద్వారా జూనియర్‌ కెమిస్ట్‌, జూనియర్ టెక్నీషియన్, ట్రైనీ, ఇతర ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయనుంది.

    అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. 1800 4252 422 నంబర్ ద్వారా ఈ ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు. విజయనగరంలోని తోటపాలెం, ఎస్‌ఎస్‌ఎస్‌ఎస్‌ డిగ్రీ కాలేజీలో ఈ ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు జరుగుతున్నాయి. ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఉదయం 10 గంటల లోపు రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. బీఎస్సీ కెమిస్ట్రీ, బీకామ్‌, బీఏ పాసైన వాళ్లు జూనియర్ కెమిస్ట్ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవచ్చు.

    బీ ఫార్మసీ, ఎంఎస్సీ ఆర్గానిక్‌ అండ్‌ అనలిటికల్‌ కెమిస్ట్రీ పాసైన వాళ్లు ట్రైనీ పోస్టుకు అర్హులు. జూనియర్‌ టెక్నీషియన్‌ ఉద్యోగానికి ఫిట్టర్‌ ట్రేడ్‌లో ఐటీఐ పాసైన వాళ్లు అర్హులు. 18 సంవత్సరాల నుంచి 27 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఉద్యోగాలకు ఎంపికైన వారికి 10,000 రూపాయల నుంచి 16,000 రూపాయల వరకు వేతనం లభిస్తుంది.