https://oktelugu.com/

సూప‌ర్ స్టార్‌కు ప‌వ‌ర్ స్టార్ గ్రీటింగ్స్‌.. ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీస్‌!

సినిమా ఇండ‌స్ట్రీలోని ఇద్ద‌రు టాప్ స్టార్స్ పాజిటివ్ గా మాట్లాడుకుంటే ఫ్యాన్స్ లో ఆ కిక్కే వేరుగా ఉంటుంది. ఇప్పుడు ఫ్యాన్స్ ఇలాంటి సంబ‌రాల్లోనే ఉన్నారు. ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబుకు శుభాకాంక్ష‌లు తెలియ‌జేయ‌డం హాట్ టాపిక్ గా మారింది. మ‌హేష్ సినిమా గురించి మాట్లాడుతూ స్పెష‌ల్ గా ఓ ప్రెస్ నోట్ నే రిలీజ్ చేశాడు ప‌వ‌న్‌. Also Read: సెకండ్ వేవ్ టెన్షన్ లేదు.. టాలీవుడ్ ధీమా.. అగ్ర‌హీరోలుగా […]

Written By:
  • Rocky
  • , Updated On : March 23, 2021 / 12:10 PM IST
    Follow us on


    సినిమా ఇండ‌స్ట్రీలోని ఇద్ద‌రు టాప్ స్టార్స్ పాజిటివ్ గా మాట్లాడుకుంటే ఫ్యాన్స్ లో ఆ కిక్కే వేరుగా ఉంటుంది. ఇప్పుడు ఫ్యాన్స్ ఇలాంటి సంబ‌రాల్లోనే ఉన్నారు. ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబుకు శుభాకాంక్ష‌లు తెలియ‌జేయ‌డం హాట్ టాపిక్ గా మారింది. మ‌హేష్ సినిమా గురించి మాట్లాడుతూ స్పెష‌ల్ గా ఓ ప్రెస్ నోట్ నే రిలీజ్ చేశాడు ప‌వ‌న్‌.

    Also Read: సెకండ్ వేవ్ టెన్షన్ లేదు.. టాలీవుడ్ ధీమా..

    అగ్ర‌హీరోలుగా ప‌వ‌న్ – మ‌హేష్ పాపులారిటీ ఆకాశాన్ని తాకుతున్న‌ప్ప‌టికీ.. ఆఫ్ ది స్క్రీన్ మాత్రం వీళ్లిద్ద‌రూ చాలా సింపుల్ గా ఉంటారు. అదే స‌మ‌యంలో సంద‌ర్భాన్ని బ‌ట్టి ఒక‌రిపై ఒక‌రు ప్ర‌శంస‌లు కూడా కురిపించుకుంటారు. గ‌తంలో అర్జున్ సినిమాలో స‌మయంలో పైర‌సీకి వ్య‌తిరేకంగా గ‌ళం విప్పాడు మ‌హేష్‌. ఆ స‌మ‌యంలో వ‌రంగ‌ల్ టూర్ వేసిన సినిమా టీం.. పైర‌సీ సీడీలు ఉన్న ఓ షాప్ వ‌ద్ద‌ మ‌హేష్ ఫ్యాన్స్ ఆందోళ‌న చేశారు. ఈ స‌మ‌యంలో పైర‌సీకి అడ్డుక‌ట్ట వేయాల్సిన అవ‌స‌రం ఉందంటూ మాట్లాడారు మ‌హేష్‌.

    Also Read: అందరిదీ ఒక బాధ అయితే.. ఈ హీరోది మరో బాధ !

    ఆ స‌మ‌యంలో జ‌రిగిన గొడ‌వ‌తో మ‌హేష్ పై కేసు కూడా న‌మోదైంది. అప్పుడు ప్రిన్స్ కు అండ‌గా నిల‌బ‌డ్డాడు ప‌వ‌న్‌. పైర‌సీపై పోరులో మ‌హేష్ తో క‌లిసి ఎంత దూర‌మైనా వెళ్ల‌డానికి సిద్ధంగా ఉన్నాన‌ని కామెంట్ చేశాడు. దీంతో.. ఫ్యాన్స్ సంబ‌రాలు చేసుకున్నారు. ఆ త‌ర్వాత జ‌ల్సా సినిమాకు మ‌హేష్ వాయిస్ ఓవ‌ర్ అందించ‌డంతో అభిమానులు ఇంకా ఖుషీ అయిపోయారు. ఆ విధంగా వీరి రిలేష‌న్ కంటిన్యూ అవుతూనే ఉంది.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్

    తాజాగా.. జాతీయ సినిమా అవార్డులు ప్ర‌క‌టించారు. ఇందులో ప్రిన్స్ మ‌హ‌ర్షి సినిమాకు నేష‌న‌ల్ అవార్డు వ‌చ్చింది. అత్య‌ధిక ప్ర‌జాద‌ర‌ణ పొందిన సినిమా విభాగంలో అవార్డు సొంతం చేసుకుంది. దీనిపై ప‌వ‌న్ స్పందించారు. మ‌హేష్ బాబుకు, మ‌హ‌ర్షి సినిమాకు ప‌నిచేసిన వారికి శుభాకాంక్ష‌లు తెలిపారు. అవార్డు రావ‌డం ఎంతో సంతోషంగా ఉంద‌ని చెప్పారు ప‌వ‌న్‌. అదేవిధంగా.. జెర్సీ సినిమాకు సైతం అవార్డు ద‌క్క‌డంతో ఆ మూవీ టీమ్ కు సైతం శుభాకాంక్ష‌లు తెలిపారు ప‌వ‌న్. దీంతో.. అభిమానులు ఆనందం వ్య‌క్తంచేస్తున్నారు.