ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడే నాటికే తెలంగాణ మిగులు బడ్జెట్ రాష్ట్రం. అలాంటి మిగులు బడ్జెట్‌తో ఉన్న రాష్ట్రం ఇప్పుడు లక్షలాది కోట్ల రూపాయల అప్పుల్లోకి కూరుకుపోయింది. అంతేకాదు.. రాష్ట్రంలో ఎలాంటి ప్రళయాలు వచ్చినా ఇతర రాష్ట్రాలను సాయం కోరాల్సిన పరిస్థితి వచ్చింది. ఒక్క ఆరేండ్లలోనే కొత్త పురుడు పోసుకున్న రాష్ట్రానికి ఇంతటి దౌర్భాగ్య పరిస్థితి ఎందుకు వచ్చింది..? ఒక్క వరద.. ఒక్క భారీ వర్షానికే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దిగజారిందా..? ఒక్క కరోనాతో బిచ్చం ఎత్తుకునే దుస్థితి వచ్చిందా..? వేలాది కోట్ల నష్టం వచ్చిన రాష్ట్రంలో ఇప్పుడు వారు వీరు ఇచ్చే సాయం ఏమాత్రం సరిపోతుంది..?
Also Read: భాగ్యనగర రోదన.. ఆగని వాన.. అనుక్షణం భయంభయం
అంతకుమించి ఎంతో రాజకీయ చతురత కలిగిన కేసీఆర్ ఏది మాట్లాడినా ప్రజల్లో అదే స్థాయిలో ఆసక్తి కూడా ఉంటుంది. ఆయన నోటి నుంచి వచ్చే ప్రతి మాటకు ఏదో లెక్క ఉంది. అయితే.. తాజాగా ఇప్పుడు సాయం చేయమని ఎందుకు అడుగుతున్నారో ఎవరికీ అర్థం కాని విషయం. దేశ సరిహద్దుల్లో చైనావోళ్లను చావుదెబ్బ తీసి.. ఆ పోరాటంలో వీరమరణం పొందిన కల్నల్ కుటుంబానికే ఏకంగా రూ.5 కోట్ల చెక్కు ఇచ్చిన దొడ్డ మనసు కేసీఆర్‌ది. అలాంటి ఆయన.. ఎవరెవరో ఇచ్చే విరాళాల గురించి ప్రకటన చేయటం.. అందుకు స్పందించిన తమిళనాడు ప్రభుత్వం రూ.10 కోట్లు.. ఢిల్లీ సర్కారు రూ.15కోట్లు.. పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతాబెనర్జీ రూ.15 కోట్ల సాయాన్ని ప్రకటించడం జరిగింది. వారి నుంచి ప్రకటనలు వెలువడిన వెంటనే దానికి కేసీఆర్ అండ్ టీం థ్యాంక్స్ చెప్పటం ఆసక్తికరంగా మారింది. రాష్ట్ర ప్రభుత్వాలు రూ.10.. రూ.15 కోట్లు సాయంగా ఇవ్వడం ఏమిటన్న చర్చ కూడా నడుస్తోంది.
విపత్తు వచ్చినప్పుడల్లా సెలబ్రిటీలే భారీగా విరాళాలు ఇస్తుంటారు. క్రీడాకారుల కంటే కూడా సినిమా సెలబ్రిటీల మీద అందరి చూపులు ఉంటాయి. అందుకే వారు.. ఇప్పటికే తమకు తోచినంత ప్రకటించేశారు.సోషల్ మీడియా పుణ్యమా అని.. ఇప్పుడు సినీ హీరోలు.. హీరోయిన్లు ఇచ్చే విరాళాల మీదన చర్చ జరుగుతోంది. అంతేకాదు.. ఎవరైనా తక్కువ ఇస్తే వారికి నెగెటివ్ ప్రచారం చేస్తున్నారు. అందుకే.. సెటబ్రిటీలు కూడా ఒళ్లు దగ్గర పెట్టుకొని మరీ విరాళాలు ప్రకటించాల్సి వస్తోంది.
Also Read: యాంటీ మీడియా: జగన్‌కు అదే పెద్ద ప్లస్ పాయింట్
అయితే.. ఒక్కో కోటి సాయం కాస్త 500 కోట్లకు చేరుతుందా..? అనేది ఇప్పుడు మొదలైన సందేహం. మొన్న కరోనా టైంలోనూ సీఎంఆర్‌ఎఫ్‌కు పెద్ద ఎత్తున ఫండ్స్ వచ్చాయి. ఇప్పుడు మరోసారి విరాళాలు వస్తున్నాయి. కేసీఆర్ లాంటి ధనిక రాష్ట్రపు సీఎం ఇలా విరాళాలు అడగడం నిజంగా కరోనా తెచ్చినా దుర్భిక్ష్యానికి, ఆర్థిక విపత్తుకు నిదర్శనమా అన్న చర్చ రాజకీయవర్గాల్లో సాగుతోంది.