చంద్రబాబుకు మరో దెబ్బ.. కీలకనేత రాజీనామా..

తెలుగుదేశం పార్టీకి మరో ఎదురు దెబ్బ తగిలింది. ఉత్తరాంధ్ర టీడీపీలో కీలక మహిళానేతగా పేరొందిన ఆ పార్టీ సీనియర్‌ నాయకురాలు, మాజీ మంత్రి పడాల అరుణ.. పార్టీకి గుడ్‌బై చెప్పారు. రాజీనామా ప్రతాన్ని పార్టీ అధ్యక్షుడికి పంపారు. నాలుగు సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి మంత్రిగా పడాల అరుణ పనిచేశారు. 33 ఏళ్లుగా టీడీపీలో పనిచేసినా, పావుగా వాడుకున్నారే తప్ప.. సరైన గుర్తింపు ఇవ్వలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీలో ఇమడలేకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు పడాల […]

Written By: NARESH, Updated On : January 30, 2021 2:29 pm
Follow us on

తెలుగుదేశం పార్టీకి మరో ఎదురు దెబ్బ తగిలింది. ఉత్తరాంధ్ర టీడీపీలో కీలక మహిళానేతగా పేరొందిన ఆ పార్టీ సీనియర్‌ నాయకురాలు, మాజీ మంత్రి పడాల అరుణ.. పార్టీకి గుడ్‌బై చెప్పారు. రాజీనామా ప్రతాన్ని పార్టీ అధ్యక్షుడికి పంపారు.

నాలుగు సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి మంత్రిగా పడాల అరుణ పనిచేశారు. 33 ఏళ్లుగా టీడీపీలో పనిచేసినా, పావుగా వాడుకున్నారే తప్ప.. సరైన గుర్తింపు ఇవ్వలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీలో ఇమడలేకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు పడాల అరుణ తెలిపారు. అటు అధిష్టానం, ఇటు జిల్లా పార్టీ పెద్దలు కనీసం ప్రాధాన్యత ఇవ్వకపోవడం, రాష్ట్ర కమిటీలలో సైతం చోటు కల్పించకపోవడం వంటి కారణాలతో తీవ్ర అసంతృప్తితో ఉన్న అరుణ.. టీడీపీకి గుడ్‌బై చెప్పారు.

ఏపీలో గ్రామ పంచాయతీ ఎన్నికలు రణరంగాన్ని తలపిస్తున్నాయి. విజయనగరం జిల్లాలో ఓ వర్గం పంచాయతీ ఎన్నికల్లోనూ కుట్ర రాజకీయాలకు తెరలేపింది. ప్రజాబలం లేని ఓ పార్టీ ఆర్థిక బలంతో దురాశను ఎరవేసి ఎన్నికల్లో లబ్ధి పొందాలని చూస్తున్నారు. రాజకీయ పార్టీలకు అతీతంగా, పార్టీ గుర్తులతో సంబంధం లేకుండా జరగాల్సిన ఎన్నికల్లో దుష్ట సంప్రదాయాలను ప్రవేశపెడుతోంది. విజయనగరం జిల్లా రాజకీయ చరిత్రలో తమది ప్రత్యేక స్థానమని, తమ తరతరాల రాజకీయంలో నీతి తప్పింది లేదని గర్వంగా చెప్పుకుంటుంటారు. జిల్లా టీడీపీకి పెద్దదిక్కుగా చెలామణి అవుతున్న ఓనేత పంచాయతీ ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థులు గెలవరని తెలిసి కూడా ఏకగ్రీవాలు జరగకుండా అడ్డుపడుతున్నారు. ఈ క్రమంలో సదరు మహిళా నేత పార్టీని వీడినట్లు సమాచారం.

పంచాయతీ ఎన్నికలు ఏకగ్రీవం అయితే కలిగే ప్రయోజనాలు అన్నీ ఇన్నీ కావు. రాష్ట్ర ప్రభుత్వం రూ.లక్షల్లో నజరానాను పెంచి ప్రకటించింది. రెండు వేల లోపు జనాభా ఉంటే ఆ పంచాయతీకి రూ.5లక్షలు, ఐదు వేల లోపు ఉంటే రూ.10లక్షలు, పది వేల లోపు ఉంటే రూ.15 లక్షలు, అంతకు మించి జనాభా ఉన్న పంచాయతీల్లో సర్పంచ్, వార్డు మెంబర్లు ఏకగ్రీవం అయితే రూ.20లక్షల చొప్పున ప్రభుత్వం ఆర్థిక బహుమతిని అందిస్తుంది. కేవలం డబ్బు మాత్రమే కాదు. గ్రామంలో ఎన్నికల వల్ల జరిగే అవాంఛనీయ సంఘటనలు వంటివి ఏకగ్రీవం వల్ల మటుమాయమవుతాయి.

ఓటర్లకు, అధికారులకు ఎలాంటి శ్రమ లేకుండా, వారి విలువైన సమయం ఆదా అవుతుంది. ఏకగ్రీవ పంచాయతీలకు ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహకాలతో ఆ గ్రామం పూర్తిగా అభివృద్ధి చెందుతుంది. ఇటువంటి వాటిని అడ్డుకోవడం విడ్డూరంగా మారింది.