భద్రత మరింత కట్టుదిట్టం..: సీసీ టీవీ ఫుటేజీలో అనుమానితులు

దేశ రాజధాని ఢిల్లీలో శుక్రవారం బాంబు పేలుడు కలకలం రేపింది. ఈ కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఇజ్రాయెల్‌ రాయబార కార్యాలయం సమీపంలో జరిగిన పేలుడుకు సంబంధించి కీలక ఆధారాలను సేకరించినట్లు తెలుస్తోంది. ఆ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించిన దర్యాప్తు బృందం.. కీలక సమాచారాన్ని స్వాధీనం చేసుకున్నారు. పేలుడుకు ముందు ఆ ప్రాంతంలో ఇద్దరు వ్యక్తులు సంచరించినట్లు.. క్యాబ్‌లో వచ్చి అక్కడ దిగినట్లు గుర్తించారు. వీరికి ఈ పేలుడుతో ఏదైనా సంబంధం ఉందా అనే […]

Written By: Srinivas, Updated On : January 30, 2021 2:41 pm
Follow us on


దేశ రాజధాని ఢిల్లీలో శుక్రవారం బాంబు పేలుడు కలకలం రేపింది. ఈ కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఇజ్రాయెల్‌ రాయబార కార్యాలయం సమీపంలో జరిగిన పేలుడుకు సంబంధించి కీలక ఆధారాలను సేకరించినట్లు తెలుస్తోంది. ఆ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించిన దర్యాప్తు బృందం.. కీలక సమాచారాన్ని స్వాధీనం చేసుకున్నారు. పేలుడుకు ముందు ఆ ప్రాంతంలో ఇద్దరు వ్యక్తులు సంచరించినట్లు.. క్యాబ్‌లో వచ్చి అక్కడ దిగినట్లు గుర్తించారు. వీరికి ఈ పేలుడుతో ఏదైనా సంబంధం ఉందా అనే కోణంలో దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

Also Read: తెలంగాణకు రూ.250 కోట్లు.. ఏపీకి నిల్‌..!: కేంద్రం వరద సాయం

ఇప్పటికే క్యాబ్‌ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. ఆ ఇద్దరు వ్యక్తుల గురించి ఆరా తీస్తున్నారు. డ్రైవర్‌ ఇచ్చిన సమాచారం మేరకు అనుమానితుల ఊహాచిత్రాల ఆధారంగా గాలింపు చర్యలు చేపట్టారు. కాగా, ఇజ్రాయెల్‌ రాయబార కార్యాలయం వద్ద జరిగిన పేలుడులో అమ్మోనియం నైట్రేట్‌ను ఉపయోగించినట్లు ప్రాథమిక విచారణలో తేలిందని సమాచారం.

Also Read: అక్కడ వారు.. ఇక్కడ వీరు..: మొత్తంగా రైతులే టార్గెట్

అయితే.. ఈ ఘటన వెనుక పెద్ద కుట్రే దాగి ఉందని పోలీసులు అనుమానిస్తున్నారు. ఇందులో భాగంగానే ఈ పేలుడు జరిపినట్లు తెలుస్తోంది. పేలుడు సంభవించిన ప్రాంతానికి కొద్ది దూరంలో ఉన్న ఓ చెట్టుకు కెమెరాను అమర్చినట్లు సమాచారం. ఆ ఫుటేజీని పరిశీలించగా.. టైమ్‌ స్టాంప్‌ 1970గా ఉండడం గుర్తించినట్లు తెలుస్తోంది. అయితే.. అందులో రికార్డయిన దృశ్యాలు మాత్రం స్పష్టంగా లేవని సమాచారం. అలాగే మరికొంత దూరంలో సగం కాలిన గులాబీ రంగు చున్నీ, ఓ ఎన్వలాప్‌ను గుర్తించినట్లు జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి. ఎన్వలాప్‌లో ఇజ్రాయెల్‌ రాయబారిని ఉద్దేశిస్తూ లేఖ కూడా ఉన్నట్లు తెలుస్తోంది.

మరిన్ని జాతీయ రాజకీయ వార్తల కోసం జాతీయ పాలిటిక్స్

గత ఏడాది మరణించిన ఇరాన్‌ అగ్రశ్రేణి కమాండర్‌‌ ఖాసీం సులేమానీ, అణు శాస్త్రవేత్త ఫక్రజాదే పేర్లు ఉన్నట్లు కూడా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో తాజా పేలుడుకు ఇరాన్‌కు సంబంధం ఉండే అవకాశం ఉందని భావిస్తున్నారు. అలాగే ‘ఇది కేవలం ట్రైలర్‌‌ మాత్రమే’ అని కూడా లేఖలో రాసి ఉన్నట్లు సమాచారం. ఈ పేలుడు నేపథ్యంలో దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో భద్రతా బలగాలను అప్రమత్తం చేశారు. కేంద్ర హోంశాఖ దీనిపై ఎప్పటికప్పుడు ఆరా తీస్తోంది. ముంబయిలోని ప్రధాన ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. అలాగే.. దేశవ్యాప్తంగా విమానాశ్రయాలు, ముఖ్యమైన సంస్థలు, అణు, ఏరోస్పేస్‌ విభాగాలు, కీలక ప్రాంగణాల వద్ద భద్రతను పెంచారు.