జానారెడ్డి వ్యాఖ్యల వెనుక మర్మమేంటి..?

నాగార్జున సాగర్‌‌ సిట్టింగ్‌ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య మృతితో ఆ స్థానానికి ఉప ఎన్నిక అనివార్యమైంది. దీంతో మరికొద్ది రోజుల్లో ఈ ఉప ఎన్నికకు షెడ్యూల్‌ రిలీజ్‌ కానుంది. దీంతో ఇప్పటినుంచే ఆయా పార్టీలు ఆ సీటుపై కన్నేశాయి. ఎలాగైనా సిట్టింగ్‌ స్థానాన్ని తమ ఖాతాలోనే వేసుకోవాలని టీఆర్‌‌ఎస్‌ ఆరాటపడుతుండగా.. ప్రతిపక్ష కాంగ్రెస్‌ కూడా ఆ స్థానాన్ని వదిలేది లేదంటూ చెబుతోంది. ఇక ఇప్పటికే దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో సత్తా చాటిన బీజేపీ కూడా ఇక్కడా గెలిచితీరుతామంటూ […]

Written By: Srinivas, Updated On : January 30, 2021 2:11 pm
Follow us on


నాగార్జున సాగర్‌‌ సిట్టింగ్‌ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య మృతితో ఆ స్థానానికి ఉప ఎన్నిక అనివార్యమైంది. దీంతో మరికొద్ది రోజుల్లో ఈ ఉప ఎన్నికకు షెడ్యూల్‌ రిలీజ్‌ కానుంది. దీంతో ఇప్పటినుంచే ఆయా పార్టీలు ఆ సీటుపై కన్నేశాయి. ఎలాగైనా సిట్టింగ్‌ స్థానాన్ని తమ ఖాతాలోనే వేసుకోవాలని టీఆర్‌‌ఎస్‌ ఆరాటపడుతుండగా.. ప్రతిపక్ష కాంగ్రెస్‌ కూడా ఆ స్థానాన్ని వదిలేది లేదంటూ చెబుతోంది. ఇక ఇప్పటికే దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో సత్తా చాటిన బీజేపీ కూడా ఇక్కడా గెలిచితీరుతామంటూ చెబుతోంది.

Also Read: వైసీపీ నేతల తిట్ల దండకం.. ఎస్ఈసీపై ఎందుకంత కోపం..?

ఇవన్నీ ఇలా ఉంటే.. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ స్థానం నుంచి జానారెడ్డి బరిలో నిలుస్తారంటూ ప్రచారం జరిగిందే. ప్రచారమే కాదు ఆ విషయాన్ని స్వయానా జానారెడ్డినే ప్రకటించేశారు కూడా. ఈ ఉప ఎన్నికలో నాగార్జునసాగర్‌‌ స్థానం నుంచి తానే బరిలో నిలుస్తానంటూ చెప్పుకొచ్చారు. అయితే.. ఇప్పుడు ఉన్నట్లుండి ఒక్కసారిగా మాటమార్చారు. ఉప ఎన్నికకు సమయం దగ్గర పడుతున్న వేళ సంచలన వ్యాఖ్యలే చేశారు.

Also Read: అంతా మీరే చేశారు… సీఎస్ విషయంలో.. ప్రవీణ్ ప్రకాశ్

తన కుమారుడు లేదా తన ప్రధాన అనుచరుల్లో ఎవరైనా పోటీ చేస్తానంటే.. వారికి అవకాశం ఇవ్వడానికి తాను సిద్ధంగానే ఉన్నానన్నారు. ఇప్పటి వరకూ తానే పోటీ చేస్తానని చెప్పిన జానారెడ్డి.. ఇప్పుడు కొత్త ప్రతిపాదన తెస్తుండటం కాంగ్రెస్ వర్గాలను ఒకింత ఆశ్చర్యానికి గురి చేసేదే. జానారెడ్డికి కంచుకోట లాంటి నాగార్జునసాగర్‌లో ఆయనే పోటీ చేస్తే.. కాంగ్రెస్ గెలుపు నల్లేరుపై నడకేనని భావించారంతా. ఆయన తనయుడు బరిలోకి దిగితే మాత్రం.. ప్రత్యర్థి పార్టీలు పోటీ ఇచ్చే అవకాశం ఉంది. జానా తనయుడు రఘువీర్ రెడ్డికి బీజేపీ, టీఆర్ఎస్ ఎర వేస్తున్నాయని గతంలో వార్తలొచ్చాయి. ఇవన్నీ తెలుసు గనుకే కాంగ్రెస్ అధిష్టానం జానా రెడ్డితో పోటీ చేయించే దిశగా మంత్రాంగం నడిపింది. మరి ఇప్పుడు కాంగ్రెస్ సీనియర్ నేత కొత్త పల్లవిని అందుకోవడం తన కొడుకును బరిలో నిలపడం కోసమేనా..? లేదంటే ఇతర కారణాలేవైనా ఉన్నాయా? అనేది అంతుపట్టడం లేదు.

మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్

మొత్తంగా సాగర్‌‌ రాజకీయాలు ఇప్పుడే హీట్‌ పుట్టించేస్తున్నాయి. ఇంకా షెడ్యూల్‌ రానేలేదు అప్పుడే కాంగ్రెస్‌లో ఇంట్రెస్టింగ్‌ రాజకీయాలు కనిపిస్తున్నాయి. నిన్నటివరకు ఈ సీటు ఇక తమ ఖాతాలోకే అనుకున్న వారికి జానారెడ్డి ఒక్కసారిగా షాక్‌ ఇచ్చినంత పనే చేశారు. మరి చివరకు ఈ టాపిక్‌ ఎటు మలుపుతిప్పుతుందో.. ఫైనల్‌గా ఎవరు బరిలో నిలుస్తారో చూడాలి.