https://oktelugu.com/

‘అంధకారం’ మూవీ రివ్యూ.. హిట్టా.. ఫ్లాఫా?

కరోనా క్రైసిస్ తో ఓటీటీలకు ఫుల్ డిమాండ్ పెరిగింది. థియేటర్లకు ఇప్పట్లో జనాలు వచ్చేలా కన్పించకపోవడంతో దర్శకులు సైతం ఓటీటీ ప్రేక్షకులు కోరుకునే కంటెంట్ తో నే సినిమాలను తెరకెక్కిస్తున్నారు. ఈక్రమంలోనే ఓటీటీ ప్రేక్షకులు కోరుకుంటే సస్పెన్స్ థిల్లర్.. క్రైమ్ నేపథ్యంలో ‘అంధకారం’ మూవీ నేడు నెట్ ఫిక్స్ లో రిలీజైంది. ఈ మూవీ ప్రేక్షకులను ఈమేరకు ఆకట్టుకుందో చూద్దాం..! Also Read: బిగ్‌బాస్‌ ఫైనల్‌ విన్నర్‌‌ అతనేనా..? ‘అంధకారం’ మూవీ థిల్లర్ జోనర్ కు సంబంధించింది. […]

Written By:
  • NARESH
  • , Updated On : November 25, 2020 / 10:26 AM IST
    Follow us on

    కరోనా క్రైసిస్ తో ఓటీటీలకు ఫుల్ డిమాండ్ పెరిగింది. థియేటర్లకు ఇప్పట్లో జనాలు వచ్చేలా కన్పించకపోవడంతో దర్శకులు సైతం ఓటీటీ ప్రేక్షకులు కోరుకునే కంటెంట్ తో నే సినిమాలను తెరకెక్కిస్తున్నారు. ఈక్రమంలోనే ఓటీటీ ప్రేక్షకులు కోరుకుంటే సస్పెన్స్ థిల్లర్.. క్రైమ్ నేపథ్యంలో ‘అంధకారం’ మూవీ నేడు నెట్ ఫిక్స్ లో రిలీజైంది. ఈ మూవీ ప్రేక్షకులను ఈమేరకు ఆకట్టుకుందో చూద్దాం..!

    Also Read: బిగ్‌బాస్‌ ఫైనల్‌ విన్నర్‌‌ అతనేనా..?

    ‘అంధకారం’ మూవీ థిల్లర్ జోనర్ కు సంబంధించింది. ఈ మూవీలోని నటీనటులు పూర్తిగా కొత్తవారిగానే కన్పిస్తోంది. డైరెక్టర్ అట్లీ నిర్మాణంలో కొత్త దర్శకుడు విఘ్నరాజన్ అంధకారం మూవీని తెరకెక్కించాడు. నటీనటులు అరుణ్‌దాస్.. వినోద్ కిష‌న్‌.. పూజా రామ‌చంద్ర‌న్ త‌దిత‌రులు తమ నటనతో ఆద్యంతం అలరించారు.

    సినిమా విషయానికొస్తే.. క్రికెట్ శిక్ష‌ణ ఇప్పించే వినోద్‌(అరుణ్‌దాస్‌).. క‌ళ్లు లేకున్నప్పటికీ కూడా లైబ్ర‌రీలో క్ల‌ర్క్‌గా ప‌నిచేసే సూర్యం(వినోద్ కిష‌న్‌).. సైక్రియాటిస్ట్ ఇంద్ర‌న్ ఒకే పట్టణంలో నివ‌సిస్తుంటారు. వీరిలో వినోద్‌ను ఓ అజ్ఞాత వ్యక్తి ఫోన్‌లో బెదిరిస్తుండటం..సూర్యంను ఆస్తి కోసం కొంద‌రు హ‌త్య చేయడం..ఇంద్ర‌న్‌పై ఓ వ్య‌క్తి తుపాకీతో కాల్పులకు తెగబడుతారు. ఈ ముగ్గురికి ఇలా జరగడానికి కారణలెంటీ అనేది దర్శకుడు సస్పెన్స్ థిల్లర్ నేపథ్యంలో చూపించాడు.

    Also Read: బిగ్ బాస్ హౌస్ లో మరో ప్రేమజంట !

    ‘అంధకారం’ మూవీ బాగానే ఉన్నప్పటికీ ఈ మూడు పాత్రలకు.. సన్నివేశాలను తీర్చిదిద్దిన విధానం కన్ ఫ్యూజింగ్ కు గురిచేస్తుంది. తొలి అర్థభాగంలో పాత్ర పరిచయాలకు దర్శకుడు ఎక్కువ సమయం తీసుకోవడం ప్రేక్షకులకు విసుగు తెప్పిస్తుంది. సినిమాకు అందించిన నేప‌థ్య సంగీతం.. సినిమాటోగ్ర‌ఫీ ఆకట్టుకుంది. ఓటీటీలో రిలీజైన ఈ సినిమా నిడివి 3గంటలు ఉండటం సినిమాకు మైనస్ గా మారింది. మొత్తానికి ‘అంధకారం’ థిల్లర్ జోనర్ ఆదరించే ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యేలా ఉంది.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్