మందు కొట్టిన సీనియర్ హీరోయిన్

ఒకప్పుడు టాలీవుడ్ లో వెలుగు వెలిగిన హీరోయిన్ ఆమని. ఫ్యామిలీ డ్రామా సినిమాలతో ఎంతో పాపులర్ అయిన ఆమె తాజాగా సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టింది. ‘చావు కబురు చల్లగా’ సినిమాలో ఆమని ఓ గృహిని పాత్ర పోషించింది. సీనియర్ హీరోయిన్ ఆమని ఎంత మంచి నటి అన్నది అందరికీ తెలిసిందే. ఆమె తాజాగా వరుస అవకాశాలు అందిపుచ్చుకుంటోంది. చావుకబురు చల్లాగా సినిమాలో హీరో కార్తికేయ తర్వాత అంతటి ప్రాధాన్యత ఉన్న పాత్రలో ఆమని నటిస్తోంది. తాజాగా ఆమెకు […]

Written By: NARESH, Updated On : March 13, 2021 9:03 pm
Follow us on

ఒకప్పుడు టాలీవుడ్ లో వెలుగు వెలిగిన హీరోయిన్ ఆమని. ఫ్యామిలీ డ్రామా సినిమాలతో ఎంతో పాపులర్ అయిన ఆమె తాజాగా సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టింది. ‘చావు కబురు చల్లగా’ సినిమాలో ఆమని ఓ గృహిని పాత్ర పోషించింది.

సీనియర్ హీరోయిన్ ఆమని ఎంత మంచి నటి అన్నది అందరికీ తెలిసిందే. ఆమె తాజాగా వరుస అవకాశాలు అందిపుచ్చుకుంటోంది.

చావుకబురు చల్లాగా సినిమాలో హీరో కార్తికేయ తర్వాత అంతటి ప్రాధాన్యత ఉన్న పాత్రలో ఆమని నటిస్తోంది. తాజాగా ఆమెకు సంబంధించిన స్టిల్ ను విడుదల చేశారు.

ఈ స్టిల్ లో వంట చేస్తున్న ఆమని.. ఒక గ్లాస్ తో మందు కొడుతున్న సీన్ హైలెట్ గా మారింది. మందు అలవాటు ఉన్న గృహిని పాత్రలో ఆమని నటించినట్లు తెలుస్తోంది.

సినిమాలో మందు అలవాటున్న పాత్రలో ఆమని ఇరగదీసినట్టు సమాచారం. ఆమె అభినయం చూడాలంటే మాత్రం సినిమా వచ్చేదాకా ఆగాల్సిందే..