https://oktelugu.com/

చావుబతుకుల్లో ప్రముఖ నటుడు..డబ్బుల్లేక ఆదుకోవాలని వేడుకోలు

అప్పట్లో విలన్ అంటే ఎలా ఉండాలని ఎవరినైనా అడిగితే ఆ తమిళ విలన్ నే చూపించేవారు. కరుడుగట్టిన దేహం, భీతి గొలిపే చూపులు.. చూస్తేనే భయపడే రూపంతో తమిళ నటుడు పొన్నంబళ్ ప్రతినాయకుడికి ప్రతిరూపంగా ఉండేవాడు. తెలుగు, తమిళ సినిమాల్లో ప్రముఖంగా ఓ వెలుగు వెలిగిన నటుడు పొన్నంబల్ పరిస్థితి ప్రస్తుతం కడుదీనంగా తయారైంది. సినిమాల్లో ఉన్నంతకాలం స్టార్ హీరోల పక్కన నటించిన ఈయన ప్రస్తుతం ఆసుపత్రిలో చావుబతుకుల్లో కొట్టుమిట్టాడుతున్నారు. తనకు ఆర్థిక సాయం అర్థిస్తున్న పరిస్థితి […]

Written By:
  • NARESH
  • , Updated On : March 13, 2021 / 09:18 PM IST
    Follow us on

    అప్పట్లో విలన్ అంటే ఎలా ఉండాలని ఎవరినైనా అడిగితే ఆ తమిళ విలన్ నే చూపించేవారు. కరుడుగట్టిన దేహం, భీతి గొలిపే చూపులు.. చూస్తేనే భయపడే రూపంతో తమిళ నటుడు పొన్నంబళ్ ప్రతినాయకుడికి ప్రతిరూపంగా ఉండేవాడు. తెలుగు, తమిళ సినిమాల్లో ప్రముఖంగా ఓ వెలుగు వెలిగిన నటుడు పొన్నంబల్ పరిస్థితి ప్రస్తుతం కడుదీనంగా తయారైంది.

    సినిమాల్లో ఉన్నంతకాలం స్టార్ హీరోల పక్కన నటించిన ఈయన ప్రస్తుతం ఆసుపత్రిలో చావుబతుకుల్లో కొట్టుమిట్టాడుతున్నారు. తనకు ఆర్థిక సాయం అర్థిస్తున్న పరిస్థితి సినీ అభిమానులను కలిచివేస్తోంది.

    పొన్నంబళ్ తెలుగు, తమిళ సినిమాల్లో విలన్ గా నటించి అందరినీ భయపెట్టిన నటుడు. ఇంతటి క్రూరమైన విలన్ లేడురా అనేంతగా ఆయన పాపులర్ అయ్యాడు. పవన్ కల్యాణ్ నటించిన ‘గుడుంబా శంకర్’ సినిమాలో పవన్ ఎంట్రీ సమయంలో పొన్నంబల్ కనిపిస్తాడు.

    తమిళ, తెలుగులో ఎన్నో చిత్రాల్లో నటించిన పొన్నంబళ్ ప్రస్తుతం చావుబతుకుల మధ్య ఉన్నాడు. కిడ్నీ ఫెయిల్ అయ్యి ట్రాన్స్మిట్ చేయాల్సిన అవసరం ఏర్పడింది. కిడ్నీ ఇవ్వడానికి తన సోదరి కుమారుడు ముందుకు వచ్చాడు. అయితే ఆర్థికంగా మాత్రం చితికిపోయిన ఆయనను ఆదుకోవాలని ఆసుపత్రి నుంచే అందరినీ వేడుకుంటున్నారు.

    ఇప్పటి దాకా రజనీకాంత్, కమల్ హాసన్ వంటివారు సాయం చేశారని… అయితే మరింత డబ్బు అవసరం ఉండగా ఇలా ఆసుపత్రిలోని బెడ్ పై నుంచే రిక్వెస్ట్ చేస్తున్నట్టు పొన్నంబళ్ ఒక వీడియోలో ఆవేదన వ్యక్తం చేశాడు. . ఇప్పటి వరకు ఈ విషయం తెలిసిన కొందరు పొన్నంబల్ కు సాయం చేశారు. ఈ వార్త వైరల్ కావడంతో ఇంకొందరు ముందుకువస్తున్నారు. . అయితే దక్షిణాది ఫిలిం సంఘం తనను ఆదుకోవాలని కోరుతున్నాడు.