కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్ పెన్షన్ తీసుకునే వాళ్లకు శుభవార్త చెప్పింది. పెన్షన్ నిబంధనలలో కేంద్రం కీలక మార్పులు చేసింది. ఓల్డ్ పెన్షనర్లు ఇకపై సులువుగా డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్ ను తీసుకోవచ్చు. కేంద్రం అమలులోకి తెచ్చిన ఈ నిర్ణయం ద్వారా సామాన్య ప్రజలకు ప్రయోజనం చేకూరనుంది. ఇప్పటివరకు పెన్షనర్లు పెన్షన్ పొందాలంటే డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్ ను కచ్చితంగా సమర్పించాలనే నిబంధన ఉండేది.
పెన్షనర్లలో ఎవరైతే డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్ ను పొందాలని అనుకుంటారో వాళ్లు కచ్చితంగా ఆధార్ కార్డును కలిగి ఉండాలి. అయితే ఇకపై ఆధార్ కార్డ్ లేకపోయినా సులువుగా డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్ ను తీసుకోవచ్చు. ఇకపై ప్రభుత్వ కార్యాలయాలలో పని చేసే ఉద్యోగులకు అటెండెన్స్ సిస్టమ్ కోసం కానీ ఇన్ స్టంట్ మెసేజింగ్ సర్వీస్ యాప్ లలో ఒకటైన సందేశ్ యాప్ కు సంబంధించిన ఆధార్ వెరిఫికేషన్ కు కానీ ఆధార్ కార్డును కచ్చితంగా కలిగి ఉండాల్సిన అవసరం లేదు.
కేంద్రం అమలులోకి తెచ్చిన నూతన నిబంధనల వల్ల పెన్షన్ తీసుకునే వాళ్లకు ప్రయోజనం చేకూరనుంది. ఇకపై ఎటువంటి ఇబ్బందులు పడాల్సిన అవసరం లేకుండా సులభంగా పెన్షన్ ను పొందే అవకాశం ఉంటుంది. కేంద్ర ఐటీ శాఖ ఆధార్ అథంటికేషన్ తప్పనిసరి కాదని.. డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్ ను అందించడం కోసం ఇతర మార్గాలను అన్వేషించాలని సూచనలు చేసింది.
రిటైర్మెంట్ అయిన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్రం వాళ్లు పని చేసే విభాగం నుంచే నేరుగా లైఫ్ సర్టిఫికెట్ ను పొందే అవకాశం కల్పిస్తుండటం గమనార్హం. డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్ ఆధార్ కార్డ్ ద్వారా పొందాలంటే ఫింగర్ ప్రింట్ మ్యాచ్ కాకపోవడం వల్ల కొన్ని సమస్యలు ఎదురవుతున్నాయి. ఇకపై ఆధార్ తప్పనిసరి కాకపోవడంతో పెన్షన్ పొందే వాళ్లు ఎటువంటి ఇబ్బందులు లేకుండా సులువుగా పెన్షన్ ను పొందవచ్చు.