ప్రజలకు షాక్.. వంటనూనెల రేట్లు మరింత పెరిగే ఛాన్స్..?

గత మూడు నెలల నుంచి రికార్డు స్థాయిలో వంటనూనెల ధరలు పెరుగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పెరుగుతున్న ధరల వల్ల సామాన్య ప్రజలు పడుతున్న కష్టాలు అన్నీఇన్నీ కావు. పామాయిల్, సన్ ఫ్లవర్ ఆయిల్ తో పాటు గ్రౌండ్ నట్ ఆయిల్ ధరలు కూడా పెరుగుతున్నాయి. లీటర్ పామాయిల్ 140 రూపాయలుగా ఉండగా సన్ ఫ్లవర్ ఆయిల్, వేరుశనగ నూనెల ధరలు 200 రూపాయలకు చేరువలో ఉండటం గమనార్హం. ధరలు తగ్గుతాయని జోరుగా ప్రచారం జరుగుతున్నా రోజురోజుకు […]

Written By: Navya, Updated On : March 22, 2021 11:40 am
Follow us on

గత మూడు నెలల నుంచి రికార్డు స్థాయిలో వంటనూనెల ధరలు పెరుగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పెరుగుతున్న ధరల వల్ల సామాన్య ప్రజలు పడుతున్న కష్టాలు అన్నీఇన్నీ కావు. పామాయిల్, సన్ ఫ్లవర్ ఆయిల్ తో పాటు గ్రౌండ్ నట్ ఆయిల్ ధరలు కూడా పెరుగుతున్నాయి. లీటర్ పామాయిల్ 140 రూపాయలుగా ఉండగా సన్ ఫ్లవర్ ఆయిల్, వేరుశనగ నూనెల ధరలు 200 రూపాయలకు చేరువలో ఉండటం గమనార్హం.

ధరలు తగ్గుతాయని జోరుగా ప్రచారం జరుగుతున్నా రోజురోజుకు ధరలు పెరగడమే తప్ప తగ్గకపోవడం గమనార్హం. ధరల పెరుగుదల వల్ల ప్రజలు నూనెల వినియోగాన్ని తగ్గిస్తున్నారని వ్యాపారులు చెబుతుండటం గమనార్హం. లాక్ డౌన్ సమయంలో రవాణా, ఉత్పత్తి తగ్గడంతో నూనెల ధరలకు రెక్కలొచ్చాయి. లాక్ డౌన్ నిబంధనలు తొలగించినా ధరలు మాత్రం తగ్గలేదు. మరోవైపు పెట్రోల్, డీజిల్ ధరల పెంపు భారం కూడా వంటనూనెలపై పడింది.

ధరలు పెరగడంతో వంటనూనెల ధరలు అడ్డూఅదుపు లేకుండా పెరుగుతున్నాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మరికొన్ని నెలల పాటు వంటనూనెల ధరలు ఇదే విధంగా ఉండే అవకాశం ఉంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టి పెడితే మాత్రమే వంటనూనెల ధరలు తగ్గే అవకాశం ఉంటుందని ప్రచారం జరుగుతోంది. ప్రకృతి విపత్తులు కూడా ధరల పెరుగుదలకు కారణమవుతున్నాయి.

ఏపీలో వేరుశెనగ క్వింటా సగటు ధర 7,000 రూపాయల వరకు పలుకుతుండగా సన్ ఫ్లవర్ క్వింటా ధర 6,000 రూపాయలకు అటూఇటుగా ఉండటం గమనార్హం. పామాయిల్ టన్ను రూ.13,000 కంటే ఎక్కువగా పలుకుతుండగా తెల్లదోమ ప్రభావం వల్ల ఉత్పత్తి తగ్గిందని అధికారులు చెబుతున్నారు.