https://oktelugu.com/

ఈ కంపెనీలో నెలకు రూ.7 లక్షల జీతం.. పనేంటంటే..?

మన దేశంలో చాలామంది ఉద్యోగులు నెలకు 20,000 రూపాయల కంటే తక్కువ వేతనానికే పని చేస్తున్నారు. ఖర్చులు పెరుగుతున్నా అదే స్థాయిలో ఆదాయం పెరగకపోవడం వల్ల చాలామంది ప్రజలు నిత్య జీవితంలో అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఉద్యోగులతో ఎక్కువ సమయం పని చేయించుకునే కంపెనీలు ఉద్యోగులకు అవసరమైన కనీస సౌకర్యాలను కూడా కల్పించడం లేదు. అయితే ఒక కంపెనీ మాత్రం ఉద్యోగులకు భారీ మొత్తంలో వేతనం ఇవ్వడంతో పాటు అనేక సౌకర్యాలను కల్పిస్తోంది. కాలిఫోర్నియాలోని సోనొమా ప్రాంతానికి […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : March 23, 2021 / 12:50 PM IST
    Follow us on

    మన దేశంలో చాలామంది ఉద్యోగులు నెలకు 20,000 రూపాయల కంటే తక్కువ వేతనానికే పని చేస్తున్నారు. ఖర్చులు పెరుగుతున్నా అదే స్థాయిలో ఆదాయం పెరగకపోవడం వల్ల చాలామంది ప్రజలు నిత్య జీవితంలో అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఉద్యోగులతో ఎక్కువ సమయం పని చేయించుకునే కంపెనీలు ఉద్యోగులకు అవసరమైన కనీస సౌకర్యాలను కూడా కల్పించడం లేదు.

    అయితే ఒక కంపెనీ మాత్రం ఉద్యోగులకు భారీ మొత్తంలో వేతనం ఇవ్వడంతో పాటు అనేక సౌకర్యాలను కల్పిస్తోంది. కాలిఫోర్నియాలోని సోనొమా ప్రాంతానికి చెందిన మర్ఫీ గూడె వైనరీ అనే కంపెనీ నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.7.24 లక్షలు ఇవ్వనుంది. భారీ వేతనంతో పాటు ఈ ఉద్యోగాలకు ఎంపికైన వాళ్లకు ఆహారం, బెడ్ సౌకర్యం కల్పించనుంది.

    ఉద్యోగాలకు ఎంపికైన వాళ్లకు శాలరీతో పాటు లగ్జరీ బెనిఫిట్స్ కూడా అందుతుండటంతో చాలామంది నిరుద్యోగులు ఈ ఉద్యోగాలలో చేరడానికి ఆకర్షితులు అవుతున్నారు. అయితే ఈ ఉద్యోగాలకు ఎంపికైన వాళ్లు కేవలం సంవత్సరం మాత్రమే పని చేయాల్సి ఉంటుంది. కంపెనీ ఉద్యోగి అభిరుచికి తగిన విధంగా ఇక్కడ పని చేసే అవకాశాన్ని కల్పిస్తూ ఉండటం గమనార్హం.

    ఉద్యోగానికి ఎంపికైన వాళ్లు మద్యాన్ని టేస్ట్ చేయడంతో పాటు టేస్ట్ కు సంబంధించిన నివేదికను అందజేయాల్సి ఉంటుంది. 21 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్న అభ్యర్థులు జూన్ నెల 30వ తేదీలోగా ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.