‘తలైవి’ ట్రైలర్: జయలలిత జీవితమిదీ

తమిళుల ఆరాధ్యదైవం.. మాజీ ముఖ్యమంత్రి జయలలిత బయోపిక్ సిద్ధమైంది. జాతీయ ఉత్తమనటిగా గుర్తింపు పొందిన ‘కంగనారౌనత్’ జయలలిత బయోపిక్ ‘తలైవీ’లో అమ్మ పాత్రను పోషించారు. ఈ సినిమా ట్రైలర్ అన్ని భాషల్లో కొద్దిసేపటి క్రితమే విడుదలైంది. సినీ నటిగా ప్రారంభమైన జయలలిత ప్రయాణం ఆ తర్వాత హీరోలతో ఎలా సాగింది.. ఆమె రాజకీయాలకు అడుగులు ఎలా పడ్డాయి? ఎలా సీఎం అయ్యారనే దానిపై ట్రైలర్ లో చూపించారు. ట్రైలర్ అంచనాలను రెట్టింపు చేసేలానే ఉంది. ‘అమ్మ’ జయలలిత […]

Written By: NARESH, Updated On : March 23, 2021 12:50 pm
Follow us on

తమిళుల ఆరాధ్యదైవం.. మాజీ ముఖ్యమంత్రి జయలలిత బయోపిక్ సిద్ధమైంది. జాతీయ ఉత్తమనటిగా గుర్తింపు పొందిన ‘కంగనారౌనత్’ జయలలిత బయోపిక్ ‘తలైవీ’లో అమ్మ పాత్రను పోషించారు. ఈ సినిమా ట్రైలర్ అన్ని భాషల్లో కొద్దిసేపటి క్రితమే విడుదలైంది.

సినీ నటిగా ప్రారంభమైన జయలలిత ప్రయాణం ఆ తర్వాత హీరోలతో ఎలా సాగింది.. ఆమె రాజకీయాలకు అడుగులు ఎలా పడ్డాయి? ఎలా సీఎం అయ్యారనే దానిపై ట్రైలర్ లో చూపించారు. ట్రైలర్ అంచనాలను రెట్టింపు చేసేలానే ఉంది.

‘అమ్మ’ జయలలిత పాత్రలో కంగనా ఒదిగిపోయింది. డైలాగులు తూటాల్లా పేలుతున్నాయి. రాజకీయాల్లోకి రమ్మంటూ ఎంజీఆర్ పాత్రధారి అరవిందస్వామి ఆహ్వానిస్తూ చెబుతున్న డైలాగ్ కథను మలుపుతిప్పుతుందని ట్రైలర్ చూస్తే తెలుస్తోంది.

‘మహా భారతానికి ఇంకో పేరుంది.. జయ’ అంటూ కంగనా చెప్పిన సినిమా డైలాగ్ ప్రతిపక్ష డీఎంకే అధినేత కరుణానిధి చేసిన అవమానం మీదేనని తెలుస్తోంది.

ఈ చిత్రాన్ని ఏప్రిల్ 23న తెలుగు,తమిళం, హిందీ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నారు. విజయ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని విష్ణువర్ధన్ , శైలేష్ ఆర్ సింగ్ నిర్మించారు. జీవీ ప్రకాష్ సంగీతం అందించారు.