Modi Government: అధికారం కోల్పోతున్నది. కీలక నేతలు ఇతర పార్టీల్లోకి వెళ్తున్నారు. ఉన్నవారు ఇతర పార్టీలకు కోవర్ట్ లుగా పనిచేస్తున్నారు. ప్రస్తుతం రాజస్థాన్, చత్తీస్ గడ్ మాత్రమే చేతిలో ఉన్నాయి. ఛత్తీస్ గడ్ ప్రభుత్వం కూడా సపక్ష ఎమ్మెల్యేల విమర్శలు ఎదుర్కొంటున్నది. దీనికి తోడు మోదీ, షా ద్వయం కాంగ్రెస్ ముక్త భారత్ కు కంకణం కట్టుకున్నది చేతికి సంబంధించిన ఒక్కో కీలు విరిచేస్తున్నది. ఇక అప్పుడెప్పుడో సుబ్రహ్మణ్య స్వామి దాఖలు చేసిన నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ విచారణకు హాజరవుతున్నారు. ఇదే సమయంలో అధికార బీజేపీ దర్యాప్తు సంస్థలను రాజకీయ కక్ష సాధింపునకు వాడుకుంటున్నదని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. కానీ ఇదే సమయంలో సుప్రీంకోర్టు విలువరించిన తీర్పు ఈడికి మరింత బలాన్ని చేకూర్చింది. అదే సమయంలో ఎన్డీఏ ప్రభుత్వంపై గగ్గోలు పెడుతున్న విపక్షాలకు చెంపపెట్టు లాంటి సమాధానం ఇచ్చింది. అసలు ఇన్ఫోర్స్మెంట్ డైరెక్ట్ అంటే ఏంటి? ఈ విభాగానికి ఉన్న పరిధిలు ఏమిటి? వివిధ సెక్షన్లు ఏం చెబుతున్నాయి?
…
మొట్టి కాయ వేసింది
..
ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కి ప్రీవెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ చట్టం 2002 ఇస్తున్న అపరిమిత అధికారాలని సవాలు చేస్తూ దాదాపుగా 250 మంది సుప్రీం కోర్టులో పీటీషన్లు వేశారు. వారంతా కూడా కాంగ్రెస్ అనుయాయులే. పీటీషన్లన్నిటినీ కలిపి విచారణ చేసిన సుప్రీం కోర్ట్ బుధవారం తన తీర్పుని వెల్లడించింది. ప్రధానంగా పీటీషనర్లు సవాలు చేసింది ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ చట్టంలోని సెక్షన్లు 5, 8[4], 15, 17, మరియు 19 PMLA . ఈ సెక్షన్లు ఈడీ అధికారులకి అరెస్ట్, అటాచ్మెంట్,సోదాలు, నిర్బంధించడం, అధికారాలని ఇస్తున్నాయి కానీ పీటీషనర్లు ఈ సెక్షన్లు రాజ్యాంగం కల్పిస్తున్న హక్కులకి భంగం కలిగిస్తున్నాయని వాదించారు. కానీ సుప్రీం కోర్ట్ బెంచ్ మాత్రం పీటీషనర్ల వాదనని తోసిపుచ్చుతూ పైన చెప్పిన పీఎంఎల్ఏ చట్టంలోని ఆయా సెక్షన్లు, అవి కల్పిస్తున్న అధికారాలు చట్టబద్ధమే అని తీర్పు ఇచ్చింది. పీఎంఎల్ఏ చట్టంలోని సెక్షన్ 24 ని కూడా సుప్రీం కోర్ట్ సమర్ధించింది. సెక్షన్ 24 ప్రకారం అధికారులు కనుగొన్న లేదా జప్తు చేసిన ఆస్తులు లేదా డబ్బు ని అవి సక్రమంగా సంపాదించినవే అని నిరూపించుకోవాల్సిన బాధ్యత నిందితుడి మీదనే ఉంటుంది. కానీ ఈ సెక్షన్ దుర్వినియోగం అయ్యే అవకాశాలు ఉన్నాయంటూ చాలా మంది వివిధ హై కోర్టులలో గతంలో పీటీషన్లు దాఖలు చేశారు. తాజా సుప్రీం కోర్ట్ తీర్పు సదరు సెక్షన్ 24 సక్రమేమే అని తీర్పు ఇచ్చింది. సీఆర్పీసీ సెక్షన్ల ప్రకారం ప్రాసిక్యూషన్ సదరు నిందితుడి ఆస్తులు అక్రమం అని నిరూపించాల్సిన బాధ్యత దర్యాప్తు చేసే అధికారిమీదనే ఉంటుంది కానీ పీఎంఎల్ఏ సెక్షన్ 24 దానికి విరుద్ధంగా ఉన్నది. ఇక ఈడీ కేసులలో అరెస్ట్ అయిన వారికి ఇచ్చే బెయిల్ దాని నియమ నిబంధనలకి ఆస్కారమిచ్చే సెక్షన్ 45 మీద కూడా వివిధ హై కోర్టులు భిన్నంగా స్పందించాయి. సీఆర్పీసీ సెక్షన్ల కింద ఇచ్చే బెయిల్ నిబంధనలని పేర్కొంటూ సెక్షన్ 45 విషయంలో ట్విన్ కండిషన్స్ బెయిల్ మీద కూడా సుప్రీం తన తీర్పుని వెల్లడిస్తూ సదరు సెక్షన్ లో పేర్కొన్న అంశాలు రాజ్యాంగ బద్ధమయినవే అని పేర్కొంది. 2018 లో మనీ లాండరింగ్ కేసుల్లో అరెస్ట్ అయినవారికి ఇచ్చే బెయిల్ నియమ నిబంధనల్ని సవరిస్తూ పార్లమెంట్ ఉభయ సభలు బిల్లుని ఆమోదించాయి అయితే సుప్రీం కోర్ట్ ఈ సవరణ చేసే అధికారం పార్లమెంట్ ఉభయ సభలకి ఉందని కాబట్టి ఈ విషయంలో జోక్యం చేసుకోలేమని చెప్తూ సదరు సెక్షన్ 45 చెల్లుబాటుని ఆమోదించింది.
…
ఈడీ అధికారులు పోలీసులు కాదు
..
సుప్రీం కోర్ట్ మరో విషయం మీద స్పష్టత ఇచ్చింది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు పోలీసులు కాదని కాబట్టి సదరు ఈడీ అధికారులు సెక్షన్ 50 ప్రకారం రికార్డ్ చేసే స్టేట్మెంట్ చెల్లుబాటు అవుతుంది. ఇది రాజ్యాంగంలో ఉన్న ఆర్టికల్ 20[3] ప్రకారం ఫండమెంటల్ హక్కులు కి సంబంధం లేదని స్పష్టం చేసింది.
సుప్రీం కోర్ట్ మరో విషయం మీద కూడా స్పష్టత ని ఇచ్చింది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు నిందితుల దగ్గర రికార్డ్ చేసే స్టేట్మెంట్ ని ఎన్ఫోర్స్మెంట్ కేస్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ అనేది దాని అంతర్గత డాక్యుమెంట్ గా పరిగణిస్తూ ఈ ఈసీఐఆర్ కి పోలీసులు ఫైల్ చేసే ఎఫ్ఐఆర్ గా పరిగణించలేమని, కాబట్టి ఎఫ్ఐఆర్ విషయంలో వర్తించే సీఆర్పీసీ సెక్షన్లు ఈసీఐఆర్ కి వర్తించవని స్పష్టం చేసింది. మూడు రోజుల క్రితం కేంద్ర ఆర్థిక శాఖ మాజీ మంత్రి చిదంబరం ఎఫ్ఐఆర్ నమోదు చేయకుండా ఈడీ అధికారులు సోనియాకి సమన్లు ఎలా జారీ చేస్తారు అంటూ వివాస్పద వ్యాఖ్య చేశారు. దాని మీద పలువురు అడ్వొకేట్లు చిదంబరం ని ఆదేమన్నా పోలీస్ కేసా ? ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడానికి అది ఈడీ కేసని, ఈడీ అధికారులు, పోలీసులు కాదని ఒక అడ్వకేట్ గా చిదంబేరానికి తెలియకపోవడం విడ్డూరం అంటూ ట్రోల్ చేశారు.
…
ఈసీఐఆర్ ఇవ్వాల్సిన అవసరం లేదు
…
ఈడీ అధికారులు నిందితుడిని అరెస్ట్ చేసే సమయంలో కానీ అరెస్ట్ చేసిన తరువాత కానీ ఈసిఐఆర్ కాపీ ఇవ్వాల్సిన అవసరం లేదని, కేవలం ఎందుకు అరెస్ట్ చేస్తున్నారో చెపితే సరిపోతుందని స్పష్టం చేసింది. అయితే కేసు విచారణ జరిగి కోర్టులో ప్రవేశపెట్టిన తరువాత నిందితుడు ఈసిఐఆర్ కాపీని ఆడగవచ్చు అని స్పష్టం చేసింది. సుప్రీం కోర్ట్ మరో విషయం మీద కూడా స్పష్టతని ఇచ్చింది. పీటీషనర్లు సుప్రీం ముందు ఉంచిన అంశం : మనీ లాండరింగ్ కేసులో అసలు కేసుతో సంబంధంలేని ఆస్తులని కూడా ఈడి అధికారులు జప్తు చేస్తున్నారని కాబట్టి దీని మీద చర్యలు తీసుకోవాలని కోరారు.
సెక్షన్ 3 మనీ లాండరింగ్ విషయంలో విస్తృతంగా చర్చించింది. ఒక సారి మనీ లాండరింగ్ కేసు సెక్షన్ 3 కింద నమోదు అయ్యాక ఆస్తులు జప్తు చేయడం అనేది సక్రమమే అదే సమయంలో అవి సక్రమమయిన ఆస్తులా లేక అక్రమంగా మనీ లాండరింగ్ ద్వారా సంపాదించారా అనేది విచారణ పూర్తయిన తరువాత తెలుస్తుంది. ప్రత్యేక కోర్టు విచారణలో వాటికి సంబంధించిన విషయాలు పూర్తిగా బయటపడ్డాక ఏవి అక్రమ ఆస్తులు ఏవి సక్రమ ఆస్తులు అన్నది తేలుతుంది. కాబట్టి కోర్టులో విచారణ పూర్తి కాకముందే వాటి మీద నిర్ణయం తీసుకోలేము అని తేల్చి చెప్పింది. సెక్షన్ 3 మనీ లాండరింగ్ చట్టం ప్రకారం ప్రతీ చర్యని పూర్తిగా విచారించాల్సిన అవసరం ఉందని స్పష్టంగా చెపుతున్నది. సదరు సెక్షన్ కాబట్టి ఈడీ చర్యలని సమర్ధిస్తున్నట్లుగా తేల్చి చెప్పింది సుప్రీం కోర్ట్ జస్టిస్ కన్వీల్కర్, జస్టిస్ దినేష్ మహేశ్వరి,జస్టీస్ రవి కుమార్ ల తో కూడిన సుప్రీం కోర్ట్ బెంచ్ ఈ కేసులని విచారించి తుది తీర్పుని 15-03-2022 న రిజర్వ్ చేసింది. బుధవారం తీర్పుని వెల్లడించింది.
మొత్తానికి ఈడీ విచారణ, అరెస్ట్,ఆస్తుల జప్తు లాంటి కీలమయిన వాటి మీద స్పష్టమయిన తీర్పుని ఇచ్చింది కాబట్టి రాబోయే రోజుల్లో ఈడి కేసుల విచారణ మరింత వేగం పుంజుకుంటుంది. ఇక ముందు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అధికారులు ఎవన్నా అరెస్ట్ లు కానీ ఆస్తుల స్వాధీనం కానీ చేసుకోవాల్సి వస్తే పూర్తి స్వేచ్ఛగా చేసుకునే వేసులుబాటును ఇచ్చింది సుప్రీం కోర్ట్. ఇంతకీ ఈ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ని ఏర్పాటు చేసింది విదేశాల నుంచి అక్రమంగా హవాలా ద్వారా డబ్బుని భారత్ లోకి పంపించి మన దేశంలో అస్థిరతని కలిగించే ఉగ్రవాదుల పీచమణచడానికి !
ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ ని ఏర్పాటు చేసింది కూడా అంతర్జాతీయంగా మనీ లాండరింగ్ ద్వారా ఉగ్రవాదాన్ని అణిచివేయడానికి. కాబట్టి ఎఫ్ ఏ టి ఎఫ్ లో మన దేశం కూడా భాగస్వామిగా 1998లో చేరింది. ఆ ఎఫ్ఏ టీఎఫ్ నియమ నిబంధలను ఆధారం చేసుకొని ఏర్పాటు చేసిందే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్.
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Read MoreWeb Title: Modi sarkar may get more angry
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com