T20 World Cup 2022 Pakistan vs Zimbabwe: ఐసీసీ టీ20 ప్రపంచ కప్ లో నిన్న సంచలనం నమోదైంది. బలమైన పాకిస్తాన్ ను పసికూన జింబాబ్వే ఓడించి టోర్నీలో సంచలనానికి దారితీసింది. సగం టోర్నీ కాకముందే ఇలాంటి అద్భుతాలు చోటుచేసుకుంటుండడంతో టోర్నీపై ఆసక్తి మరింత పెరుగుతోంది. టీ20 ప్రపంచకప్‌లో పాకిస్థాన్‌ను చిత్తుచేసిన తర్వాత జింబాబ్వే ఆ టీం భారత్ బ్రాండ్ బీర్‌తో విజయాన్ని సంబరాలు చేసుకోవడం విశేషం. పాకిస్తాన్‌ను వెక్కిరించేందుకు జింబాబ్వే క్రికెట్ టీమ్ ప్లేయర్స్ ఇండియన్ బీర్ బ్రాండ్ బీరా తాగారని సమాచారం. ఇది పాకిస్తాన్ జట్టుకు పుండు మీద కారం చల్లినట్టైంది. దీన్ని సోషల్ మీడియాలో షేర్ చేయడంతో పాక్ అభిమానులు రగిలిపోతున్నారు.

పాక్ ఓటమిలో కీలక పాత్ర పోషించిన జింబాబ్వే క్రికెటర్ సికిందర్ రజా వరుసగా మూడోసారి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు. పాకిస్తాన్ లోని సియాల్‌కోట్‌లో జన్మించిన ఈ జింబాబ్వే క్రికెటర్ రజా 2022 అంతటా అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. సూపర్ 12 స్టేజ్‌కి జింబాబ్వేను క్వాలిఫై చేయడంలో అతను ప్రధాన పాత్ర పోషించాడు. పాకిస్తాన్‌పై అతడు వేసిన ఒక ఓవర్ కేవలం కొన్ని క్షణాల్లోనే జింబాబ్వే వైపు ఆటను మార్చింది.
రజా బౌలింగ్ లో బ్యాక్ టు బ్యాక్ 2 సిక్సర్లు కొట్టేందుకు ప్రయత్నించిన షదాద్ ఖాన్‌ను ఔట్ చేసి మ్యాచ్ ను మలుపు తిప్పాడు. కొత్త బ్యాట్స్‌మెన్ హైదర్ అలీని గోల్డెన్ డక్ గా అవుట్ చేసి పాకిస్తాన్ ఓటమిని శాసించాడు.

చివరిగా, రజా స్పెల్ ఓవర్లోనే 44 పరుగులతో ఒంటరిపోరాటం చేస్తున్న పాక్ బ్యాటర్ షాన్ మసూద్ వికెట్ తీసుకొని పతనాన్ని శాసించాడు. బ్యాటింగ్ లో విఫలమైన రజా బౌలింగ్ లో మాత్రం 3 పాక్ కీలక వికెట్లు తీసి పతనాన్ని శాసించాడు.
పాక్ ఓపెనర్లు బాబర్, రిజ్వాన్ మరోసారి విఫలమయ్యారు. బాబర్-రిజ్వాన్‌పై పాక్ బ్యాటింగ్ లైనప్ అతిగా ఆధారపడిందని మరోసారి బట్టబయలైంది. జింబాబ్వే పేసర్లు చక్కగా బౌలింగ్ చేశారు. జింబాబ్వే పేసర్లు పరిస్థితిని బాగా ఉపయోగించుకున్నారు. హార్డ్ లెంగ్త్‌తో బౌలింగ్ చేశారు. దీంతో పాకిస్తానీ బ్యాట్స్‌మన్ పరుగులు చేయడానికి కష్టపడ్డారు.
బుధవారం ఐర్లాండ్ జట్టు కూడా బలమైన ఇంగ్లండ్ జట్టును ఓడించి షాక్ ఇచ్చింది. మరుసటి రోజే పెర్త్ స్టేడియంలో జింబాబ్వే పాకిస్థాన్‌ను చిత్తు చేసింది.
Zimbabwe players celebrating the win over pak by drinking Indian bira
This is some epic level trolling#PAKvsZIM pic.twitter.com/hszdCGsu4H— God (@Indic_God) October 27, 2022