Elon Musk Twitter: ప్రముఖ సోషల్ మీడియా సంస్థ ట్విట్టర్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ట్విట్టర్ కొనుగోలుపై గత కొన్ని సంవత్సరాలుగా వస్తున్న వార్తలకు తాజాగా బ్రేక్ పడినట్లయింది. టెస్లా కార్ల అధినేత ఎలెన్ మస్క్ ట్విట్టర్ ను మొత్తానికి హస్తగతం చేసుకున్నారు. ఇటీవల ఆయన ట్విట్టర్ కార్యాలయంలో అడుగుపెట్టడంతో ప్రముఖ సోషల్ మీడియా సంస్థ ఆయన చేతికి వెళ్లిపోయింది. ట్విట్టర్లో తన ప్రొఫైల్ కూడా మార్చుకొని చీఫ్ నేనే అని ప్రకటించుకున్నారు. దీంతో ఇక నుంచి ఎలెన్ మస్క్ ట్విట్టర్ ను ఏలనున్నాడు. ట్విట్టర్లోకి ఎలెన్ మస్క్ అడుగుపెడితే ఉద్యోగుల భవిష్యత్ ప్రశ్నార్థకమేనని భారతీయ సీఈవో పరాగ్ అగర్వాల్ గతంలో ప్రకటించారు. అనుకున్నట్లుగానే ఎలెన్ మస్క్ ముందుగా సీఈవో పరాగ్ అగర్వాల్, సీఎఫ్.వో విజయ గద్దెల ను తొలగించినట్లు అమెరికా మీడియా పేర్కొంది.

టెస్లా కార్ల కంపెనీ అధినేత ఎలెన్ మస్క్ ట్విట్టర్ ను కొనుగోలు చేస్తున్నారనే విషయం హాట్ టాపిక్ గా మారింది. 44 బిలియన్ డాలర్లతో ట్విట్టర్ ను ఎలెన్ మస్క్ కొనుగోలు చేయనున్నట్లు గతంలో ప్రకటించారు. కానీ కొన్ని నెలల కిందట ఆయన ఈ కొనుగోలు ఒప్పందాన్ని విరమించుకుంటున్నట్లు ప్రకటించారు. ఆ సమయంలో కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు కూడా చేశారు. దీనిపై ట్విట్టర్ యాజమాన్యం న్యాయస్థానాన్ని ఆశ్రయించి పిటిషన్ వేసింది. ఈ పిటిషన్ పై ఇటీవలే విచారణ జరిగింది. ఈ శుక్రవారం లోగా కొనుగోలు ప్రక్రియ పూర్తి చేయాలని న్యాయస్థానం ఆదేశించింది. ఈ నేపథ్యంలో గడువు కంటే ముందే ఈ డీల్ ను పూర్తి చేశారు. డీల్ పూర్తి కావడంతో ఎలెస్ మస్క్ శాన్ ఫ్రాన్సిస్కోలోని ట్విట్టర్ కార్యాలయలంలో అడుగుపెట్టారు. దీంతో ఎలెన్ మస్క్ చేతికి ట్విట్టర్ వచ్చినట్లే అని తేలిపోయింది. అయితే ఇక నుంచి ఎలెన్ మస్క్ ఎలాంటి వివాదాల జోలికి వెళ్లకూడదని నిర్ణయించుకున్నారు.
ట్విట్టర్లోకి ఎలెన్ మస్క్ అడుగుపెట్టడంతో కంపెనీ సీఈవో పరాగ్ అగర్వాల్ భవిష్యత్ పై అనేక వార్తలు వచ్చాయి. ట్విట్టర్లోకి ఎలెన్ మస్క్ వస్తే ఉద్యోగుల భవిష్యత్ ప్రశ్నార్థకమే అని భారత్ కు చెందిన పరాగ్ ముందు నుంచే ఆయన రాకను వ్యతిరేకిస్తున్నారు. తాజాగా ఆయన కార్యాలయంలోకి అడుగుపెట్టడంతో ఎలెన్ మస్క్ అనుకున్న పని చేశాడు. ముందుగా సీఈవో పరాగ్ అగర్వాల్, సీఎఫ్.వో విజయ గద్దె లపై వేటు వేసినట్లు తెలుస్తోంది. 2021 నవంబర్ లో పరాగ్ అగర్వాల్ ట్విట్టర్ సీఈవోగా నియమితులయ్యారు. అంతకుముందున్న జాక్ డోర్సే రాజీనామా చేయడంతో పరాగ్ కు సీఈవోగా అవకాశం వచ్చింది. పరాగ్ అగర్వాల్ ట్విట్టర్లో 10 సంవత్సరాలుగా పనిచేస్తోన్నారు. చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ నుంచి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా పదోన్నతి పొందారు.

ఎలెన్ మస్క్ చేతికి ట్విట్టర్ వెళ్తుందని తెలియడంతో పరాగ్ అగర్వాల్ రాజీనామా చేస్తారా..? లేక ఎలెన్ మస్క్ తొలగిస్తారా..? అనేది చర్చనీయాంశంగా మారింది. ఒకవేళ తొలగించాల్సి వస్తే ట్విట్టర్ నష్టపరిహారం చెల్లించాల్సి ఉంటుంది. 12 నెలలకాలంలో ఈ అత్యున్నత హోదా నుంచి తీసేస్తే కొత్త మేనేజ్మెంట్ ఆయనకు 42 మిలియన్ డాలర్లు చెల్లించాల్సి ఉంటుంది. కానీ ఇంత పెద్ద మొత్తాన్ని చెల్లించకుండా ఆయనను కొనసాగిస్తారని అంటున్నారు. కానీ పరాగ్ అగర్వాల్ ముందుగా రాజీనామా చేస్తే ఎలాంటి పరిహారం ఉండదు. పరాగ్ తో పాటు లీగల్, పాలసీ చీఫ్ విజయ గద్దెను కూడా తొలగించినట్లు సమాచారం. ప్రస్తుతం ఆమె ట్విట్టర్ జనరల్ కౌన్సిల్ సీన్ ఎడ్గెట్ గా విధులు నిర్వహిస్తున్నారు.