Katrina Kaif- Vicky Kaushal: కత్రినా కైఫ్.. ఈ పొడుగు కాళ్ల సుందరి బాలీవుడ్ ను దశాబ్దం పైచిలుకు నుంచే ఏలుతోంది. పెళ్లయినప్పటికీ ఊపిరి సలపని ప్రాజెక్టులతో బిజీ బిజీగా ఉంది. కెరీర్ తొలినాళ్లలో సల్మాన్ ఖాన్ తో సంథింగ్ సంథింగ్ నడిపినట్టు సమాచారం. తర్వాత రణబీర్ కపూర్ తో చెట్టా పట్టాలు వేసుకొని తిరిగినట్టు అప్పట్లో బాలీవుడ్ కోడయి కూసింది. తర్వాత ఏమైందో ఏమో గాని ఇద్దరు బ్రేకప్ చెప్పుకున్నారు. తర్వాత రణ్ బీర్ కపూర్ ఆలియా భట్ ను పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు తండ్రి కాబోతున్నాడు. ఇక కత్రినా కైఫ్ విక్కీ కౌశల్ ను ప్రేమించి డిసెంబర్ 9 2021న రాజస్థాన్ లోని సన్నిహితులు, కుటుంబ సభ్యుల మధ్య పెళ్లి చేసుకుంది. ఈ మధ్య వీరు జంటగా తొలిసారి దీపావళి జరుపుకున్నారు. అంతకుముందు కార్వా చౌత్ వేడుకల్లోనూ పాల్గొన్నారు. అయితే కత్రినా కైఫ్ ఇటీవల ఒక మ్యాగజైన్ కి ఇంటర్వ్యూ ఇచ్చారు. పెళ్లయిన సందర్భంగా జీవితం ఎలా ఉందో, కౌశల్ కు ఎలాంటి అలవాట్లు ఉన్నాయో.. మొత్తం పూసగుచ్చినట్టు చెప్పింది.

ఇంతకీ ఏం చెప్పిందంటే
విక్కీ కౌశల్ డ్యాన్స్ బాగా వేస్తాడట. పాటలు కూడా బాగా పాడతాడటా! అది కత్రినాకి బాగా నచ్చుతుందట. అతనిలో నిజాయితీ ని బాగా ఇష్టపడుతుందట.” అతను డాన్స్ చేస్తున్నప్పుడు అమితమైన ఆనందాన్ని పొందుతాడు. దాన్ని అలానే చూస్తూ ఉండిపోతాను” అని కత్రినా హొయలు పోతూ చెప్పింది. ” విక్కీ మంచి గాయకుడు. ఒక్కోసారి నాకు నిద్ర పట్టనప్పుడు చేసి నాకోసం ఒక పాట పాడగలవా? అని నేను అడిగేదానిని. అతడు పాడుతుంటే అమ్మ జోల పాట పాడినట్టు ఉండేది. వెంటనే నిద్రలోకి జారుకునేదాన్ని” అని కత్రినా పూసగుచ్చినట్టు వివరించింది. విక్కీలో మీకు నచ్చనిది ఏమిటని అడిగితే.. అతడి మొండితనం అని మరో మాట లేకుండా సమాధానం చెప్పింది.
సల్మాన్ ఖాన్ తో బంధం ఏమిటంటే
కత్రినా కైఫ్ బాలీవుడ్ కు పరిచయమైన తొలినాళ్లలో ఆమెకు లిఫ్ట్ ఇచ్చింది సల్మాన్ ఖాన్. ఇద్దరు కలిసి లెక్కకు మిక్కిలి సినిమాల్లో నటించారు. ఆ మధ్య ఇద్దరూ ప్రేమలో ఉన్నారని, త్వరలో పెళ్లికూడా చేసుకుంటున్నారని వార్తలు వచ్చాయి. అంతలోనే ఏమైందో గానీ.. ఇద్దరు జస్ట్ ఫ్రెండ్స్ మాత్రమే అని చెప్పుకొచ్చారు. ఇక ఇదే సమయంలో సల్మాన్ ఖాన్ తో మీకు ఉన్న బంధం ఏమిటని అడిగితే.. నాకు ఎల్లప్పుడూ అది సరదాగా ఉంటుందని వ్యాఖ్యానించింది.. ఇక ఆలియా భట్ గురించి ప్రస్థానం వచ్చినప్పుడు ఆమె నాకు ఎప్పుడూ ప్రత్యేకమని కితాబు ఇచ్చింది. ప్రియాంక చోప్రా గురించి అడిగితే ఆల్వేస్ స్పెషల్ ఐ థింక్ అని సమాధానం చెప్పింది. షారుఖ్ ఖాన్ గురించి మీ అభిప్రాయం ఏమిటి అని అడిగితే.. ఆయన ఎల్లప్పుడూ ఇన్ఫర్మేటివ్ గా ఉంటారని బదులు ఇచ్చింది. కాగా కత్రినా కైఫ్ ప్రస్తుతం చేతినిండా సినిమాలతో బిజీ బిజీగా ఉంది.

ఆమె నటించిన ఫోన్ భూత్ విడుదలకు సిద్ధమైంది.. ఈ సినిమాలో ఇషాన్ ఖట్టర్, సిద్ధాంత్ చతుర్వేదితో కలిసి ఆమె నటించింది. ఈ హర్రర్ కామెడీ సినిమా నవంబర్ 4వ తేదీన విడుదల కానుంది. మిమ్మల్ని కాకుండా టైగర్ 3 సల్మాన్ ఖాన్ తో ఆడిపాడనుంది. శ్రీరామ్ రాఘవన్ సరసన వెర్రి క్రిస్మస్ లో కూడా కనిపించనుంది. విజయ్ సేతుపతి, ఆలియా భట్, ప్రియాంక చోప్రా తో “జీ లే జరా” అనే సినిమాలో నటించనుంది. ఈ సినిమాను ఎక్స్ఎల్ మీడియా నిర్మించనుంది. మరోవైపు విక్కీ కౌశల్ కూడా సామ్ బహదూర్, మేరా నామ్ గోవిందా తో పాటు లక్ష్మణ్ ఉటేకర్, ఆనంద్ తివారి దర్శకత్వంలో ఇంకా పేర్లు ఖరారు కాని సినిమాల్లో నటిస్తున్నాడు.