Astrology : వాహనాలపై ప్రయాణాలు వేసే సమయంలో జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే దూర ప్రయాణాలు చేసే సమయంలో అన్నీ కలిసి రావాలని కొందరు ముందే కొబ్బరికాయ కొట్టి ప్రయాణం చేస్తారు. ఇంకొందరు తమ వాహనంపై ప్రయాణం చేసే సమయంలో ఎటువంటి ప్రమాదాలు జరగకూడదని నిమ్మకాయ, మిరపకాయ వంటివి కడుతూ ఉంటారు. అయితే కొందరికి ఇది అర్థం కాక అయోమయంలో ఉంటారు. మరికొందరు ఇది ఇలా కట్టడం వలన కొన్ని ప్రమాదాల నుంచి తప్పించుకోవచ్చని చెబుతూ ఉంటారు. అయితే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహస్థితి బాగుండాలంటే వీటిని వాహనాలకు కట్టి ఉంచాలని చెబుతుంది. నిమ్మకాయ, మిర్చి వంటివి కొన్ని గ్రహాలకు అనుకూలంగా ఉంటాయని.. వీటిని వాహనాలకు కట్టడం వల్ల ఆయాగ్రహాలు శాంతిస్తాయని తెలుపుతాయి. ఇంతకీ ఏ గ్రహాలు వీటికి అనుకూలంగా ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం..
Also Read : ఇంకొన్ని రోజుల్లో ఈ రాశుల వారికి గురు బలం.. ఏ పని మొదలుపెట్టినా సక్సెస్ ఖాయం..
ముందుగా నిమ్మకాయ గురించి తెలుసుకుందాం. వాహనాలకు కచ్చితంగా నిమ్మకాయ ఉంటుంది. నిమ్మకాయ అంటే పులుపు. శుక్ర గ్రహానికి పులుపు అంటే చాలా ఇష్టం.పులుపు కలిగిన వస్తువులతో పూజలు చేయడం వల్ల శుక్ర గ్రహం అనుకూలంగా ఉంటుందని భక్తుల నమ్మకం. అందువల్ల ఏదైనా వాహనం ప్రయాణానికి బయలుదేరినందు ఎలాంటి ఆటంకాలు ఉండకుండా నిమ్మకాయతో దిష్టి తీస్తారు. మరికొందరు నిమ్మకాయను వాహనం వెంటే ఉంచుకుంటారు.
మరొకటి మిర్చి. ప్రతి వాహనానికి నిమ్మకాయతో పాటు మిర్చి ఖచ్చితంగా కనిపిస్తుంది. మిర్చి కారంగా ఉంటుంది. కారం అనేది సూర్య గ్రహానికి సంబంధించినది. గ్రహాలకు సూర్యుడు అధిపతి అయినందున.. అన్ని గ్రహాలు అనుకూలంగా ఉండాలంటే సూర్యుడి చల్లని చూపు ఉండాలని మిర్చిని వాహనానికి కడతారు. అలాగే సూర్యుడు అంతటా ప్రసరిస్తాడు. అందువల్ల ఎక్కడా ఎలాంటి ఆటంకం కలగకుండా ఉండాలని మిర్చిని వాహనానికి కడతారు.
ఇక వాహన పూజను ఆంజనేయస్వామి లో ఎక్కువగా చేస్తూ ఉంటారు. ఈ సమయంలో కొందరు గుమ్మడికాయను పగలగొడుతూ ఉంటారు. ఆంజనేయస్వామి ఆలయంలోనే వాహనానికి ఎందుకు పూజ చేస్తారు అని సందేహం చాలా మందికి వస్తుంది. అయితే ఆంజనేయస్వామి ఆలయంలో పూజ చేయడం వల్ల వాహనానికి ఎలాంటి ప్రమాదం ఉండదని భావిస్తారు. అంతేకాకుండా కుజుడు గ్రహం పై ఆంజనేయస్వామి ఆధిపత్యాన్ని చలా ఇస్తాడు. అందువల్ల కుజగ్రహం అనుకూలంగా ఉంటే ఇలాంటి ప్రమాదాలు ఉండవని అంటారు. అందుకే ఎక్కువగా ఆంజనేయస్వామి ఆలయంలో పూజ చేస్తూ ఉంటారు.
అలాగే వాహనాలు ప్రయాణాలు చేసేటప్పుడు ఇతర దేవతలకు కూడా పూజలు చేయడం వల్ల కొన్ని ప్రమాదాల నుంచి తప్పించుకోవచ్చు అని పండితులు చెబుతున్నారు. అంతేకాకుండా ప్రతిరోజు ప్రయాణం చేసే ముందు కాసేపు దేవతలు అందరిని స్మరించుకొని ప్రయాణం మొదలు పెట్టాలని అంటున్నారు. ఇలా చేయడం వల్ల కొన్ని ప్రమాదాల నుంచి తప్పించుకోవచ్చని అంటున్నారు. ఎందుకంటే ప్రస్తుత కాలంలో చాలామంది డ్రైవింగ్ పై పూర్తిగా అవగాహన లేకుండానే వాహనాలు నడుపుతున్నారు. అంతేకాకుండా చిన్న వయసులోనే డ్రైవింగ్ చేసేవారు కూడా పెరిగిపోయారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రమాదాలు ఎక్కువగా అవుతున్నాయి. అయితే సొంత వాహనాల విషయంలో మాత్రం ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ఉండాలంటే ఇలాంటి పరిహారం చేస్తే ఫలితం ఉంటుందని అంటున్నారు.
Also Read : ఈ రాశులంటే శని దేవుడికి బాగా ఇష్టం.. ఇందులో మీ రాశి ఉందా?