Children: మీరు కూడా పిల్లలను వద్దు అనుకుంటున్నారా?

దేశంలో కూడా యువత డింక్ సంస్కృతి ని పాటిస్తున్నారు. ఈ వేగం కూడా చాలా పెరుగుతోంది. దీని వల్ల సంతానోత్పత్తి రేటు తగ్గుతుందని లాన్సెట్ సంస్థ అంచనా వేసింది.

Written By: Swathi Chilukuri, Updated On : April 29, 2024 3:25 pm

You Dont Want Children

Follow us on

Children: ఇంట్లో పిల్లలు ఉంటే ఎంత అందంగా, అల్లరిగా ఉంటుంది కదా. పనులు చేసి ఇంటికి వచ్చిన తర్వాత వారితో కాసేపు సరదాగా గడిపితే ఆ ఆనందమే వేరు. పనుల స్ట్రెస్ మొత్తం పోతుంది. ఒకప్పుడు ఇదే విధంగా ఆలోచించే వారు. కానీ ఇప్పుడు పిల్లలు ఉంటేనే స్ట్రెస్ అనుకుంటున్నారు. అందుకే డ్యుయల్ ఇన్ కం నో కిడ్స్ అనే ట్రెండ్ ఫాలో అవుతున్నారు చాలా మంది. ఇంతకీ ఇదేంటి మన దేశంలో కూడా ఉందా లేదా అనే వివరాలు తెలుసుకుందాం.

మన దేశంలో కూడా యువత డింక్ సంస్కృతి ని పాటిస్తున్నారు. ఈ వేగం కూడా చాలా పెరుగుతోంది. దీని వల్ల సంతానోత్పత్తి రేటు తగ్గుతుందని లాన్సెట్ సంస్థ అంచనా వేసింది. దీని వల్ల వృధ్ధ జనాభాకు దారి మల్లుతుంది. ఇదే సమస్యను ప్రస్తుతం చైనా ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. అక్కడ ఇప్పటికే సీనియర్ సిటిజన్ ల సంఖ్య పెరగడం వల్ల శ్రామిక శక్తి తగ్గింది అని అంటున్నారు.

ప్రొడక్టివిటీ మీద కూడా ఈ సమస్య ఎఫెక్ట్ ను చూపిస్తుందట. అయితే మన దగ్గర 1950లో సంతానోత్పత్తి రేటు 6.18గా ఉంటే.. 1980లో 4.60 కి, 2021లో 1.9కి తగ్గింది. మరి ఇలా తగ్గడానికి కారణాలు ఉన్నాయా అంటే చాలానే ఉన్నాయి అంటున్నారు నిపుణులు. గతంలో మెరుగైన శిశు సంరక్షణ లేకపోవడం వల్ల పిల్లలు చనిపోతారు అనే భయం ఉండేది. దీని వల్ల ఎక్కువ మందిని కనేవారు.

ఇప్పుడు శిశు మరణాల రేటు తగ్గింది. అందుకే ఎక్కువ మంది పిల్లలను కనాల్సిన అవసరం లేదు. కొందరు మాత్రం పిల్లలను కనడానికి, కన్న తర్వాత కూడా ఎక్కువ ఖర్చులు అవుతున్నాయని భావించి పిల్లలను కనడం లేదు. వారి పోషణను భారం గా పరిగణిస్తున్నారు. ఇలాంటి వారంతా డింక్ లుగా మారిపోతున్నారట. ఎక్కడో కాదు మన దగ్గర ఉన్న నగరాల్లో కూడా ఇలాంటి వారు ఉన్నారు. కానీ పిల్లలు లేని ఇల్లు బోసినట్టుగా ఉంటుంది. కాబట్టి ఒకరిని అయినా ప్లాన్ చేసుకోండి.