World Oldest Baby: తొమ్మిది నెలల పాటు కడుపులో మోసిన బిడ్డకు జన్మనివ్వడం చూశాం.. ఐవీఎఫ్ ద్వారా పిల్లలను పుట్టించడం చూశాం.. కానీ ఒక పిండం 30 ఏళ్ల తరువాత ఫ్రీజ్ లో ఉండి.. ఆ తరువాత జన్మతెచ్చుకోవడం ఇప్పుడు చూస్తున్నాయి. జూలై 26న థాడెయస్ అనే శిశువు జన్మించారు. ఇతడు సాధారణంగా జన్మిస్తే చర్చ ఉండేది కాదు. కానీ ఇతడు 30 ఏళ్ల కిందటే తయారయ్యాడు. కానీ ఇప్పుడు ప్రాణం పోసుకున్నాడు. అందుకే ఇతనిని ప్రపంచంలోనే ఓల్డెస్ట్ బేబీ అని అంటున్నారు. మరీ ఈ బేబీ గురించి పూర్తి వివరాల్లోకి వెళితే..
Also Read: హాట్ బెడ్డింగ్..డబ్బు సంపాదనకు ఈ యువతికి అదే మార్గం..
బ్రిటన్ లో 1994వ సంవత్సరంలో ఓహియో దంపతుల ద్వారాఇన్ విట్రో ఫెట్టిలైజేషన్ (IVF)ద్వారా పిండాన్ని ఉత్పత్తి చేశారు. ఈ సమయంలో ఆర్చర్డ్ అనే మహిళ నాలుగు పిండాలను ఉత్పత్తి చేశారు. అందులో ఇది ఒకటి. వీటిలో ఒక పిండము ద్వారా కుమార్తె జన్మనిచ్చింది. అయితే తన భర్తతో విడాకులు తీసుకున్న తరువాత మిగిలిన పిండాలను పిండ దత్తత సంస్థ నైట్ లైట్ కు దానం చేసినట్లు తెలిపారు. ప్రస్తుతం 62 ఏళ్ల వయసు ఉన్న ఆమె మీడియాతో మాట్లాడారు. దేశం విడిచి వెళ్లడం కంటే అమెరికాలో ఉండడానికి ఇష్టపడినట్లు తెలిపారు. అయితే ఆమె మాట్లాడుతూ 30 ఏళ్ల కింద పురుడు పోసుకున్న తన బిడ్డ ఫొటోను.. ఇప్పుడు జన్మనిచ్చిన బేబీని పక్క పక్కనే ఉంచగా.. ఇద్దరూ ఒకేలా ఉన్నారని అన్నారు.
యునైటెడ్ కింగ్ డమ్ (UK) లో ఐవీఎఫ్ జననాల శాతం 2000లో 1.3 శాతం ఉండగా.. 2023లో 3.1 శాతానికి పెరిగింది. అమెరికాలో దాదాపు ఐవీఎఫ్ 2 శాతంగా ఉంది. భారత్ లో 2023 ప్రకారం ఐవీఎఫ్ జననాల శాతం 2.6 శాతంగా నమోదైంది. చాలా మంది సంతానం లేనివారు ఫెర్టిలిటీ ద్వారా పిల్లలను కంటున్నారు. దీనిపై అవగాహన పెరగడంతో ఆసక్తి చూపుతున్నారు. అయితే పిండాలను దాచే సంస్థలు కూడా కొత్తగా అందుబాటులోకి వస్తున్నాయి. భవిష్యత్ లో ఇలా పిండాలను దాచి ఆ తరువాత వాటికి జన్మను ఇచ్చే శాతం పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు.
Also Read: మీరు ఏం వాటర్ తాగుతున్నారో..బాటిల్ మూత చెబుతుంది.. ఎలాగంటే..
అయితే గతంలోనూ అమెరికాలోని టెన్నెసీ రాష్ట్రంలో అక్టోబర్ 31న ఇదే విధంగా జరిగింది. అయితే ఆ సమయంలో కవలలు జన్మించడం విశేషం. అంతకుముందు ఫ్రీజ్ లో ఉంచిన పిండాన్ని ఆ తేదీన పుట్టించారు. ఈ పిల్లలు సజీవంగా ఉన్నారు. తొలిసారిగా ఈ పిండం విజయవంతం అయినట్లు రికార్డులో నమోదైంది.