Health : ఆరోగ్యం మహాభాగ్యం అని అన్నారు పెద్దలు. నేటి కాలంలో డబ్బు సంపాదన కోసం కొందరు ఆరోగ్యంపై నిర్లక్ష్యం చేస్తున్నారు. మరికొందరు ఉద్యోగం, వ్యాపారం కారణంగా తీరిక లేకుండా ఉండడంతో కొన్ని ఆరోగ్యకరమైన పనులు చేయలేకపోతున్నారు. ముఖ్యంగా ఉదయం వ్యాయామం చేయడానికి కూడా కొందరికి సమయం ఉండడం లేదు. అలాగే ఆరోగ్యకరమైన ఆహారం తినడానికి అనువైన వాతావరణం కలగడం లేదు. ఈ క్రమంలో చేసే పనిలోనే ఆరోగ్యాన్ని వెతుక్కోవాలని కొందరు అంటున్నారు. అంటే మనం ఉదయం నుంచి సాయంత్రం వరకు కొన్ని పనుల వల్ల ఆరోగ్యంతో పాటు అవసరాలు కూడా తీరుతాయని అంటున్నారు. ఆ పనులేవో ఇప్పుడు చూద్దాం..
Also Read : నిత్యం యవ్వనంగా ఉండాలనుకుంటున్నారా? ఈ అలవాట్లు చేసుకోండి..
నేటి కాలంలో ప్రతి చిన్న విషయానికి వాహనంపై వెళ్లి తెచ్చుకోవడం అలవాటైపోయింది. కొందరు ఇంటికి దగ్గరగా ఉన్న మార్కెట్లోకి సైతం వాహనాలపై వెళ్లి సరుకులు తెచ్చుకుంటారు. అయితే ఉదయం మార్కెట్లోకి నడుచుకుంటూ వెళ్లి కూరగాయలు తీసుకొని రావడం వల్ల వాకింగ్ చేసినట్లు అవుతుంది. అలాగే పెట్రోల్ సేవ్ కూడా అవుతుంది. ఇలా ప్రతిరోజు కూరగాయల కోసం మాత్రమే కాకుండా దగ్గర్లోని ఏదైనా పని కోసం వెళ్ళినప్పుడు కాలినడక ద్వారా వెళ్లడం వల్ల అనుకోకుండానే వాకింగ్ చేసిన వారవుతారు. ఇలాంటి పనుల కోసం నడవడం వల్ల ప్రతిరోజు ఉదయం ప్రత్యేకంగా వాకింగ్ చేయాల్సిన అవసరం లేదు.
ప్రతిరోజు ఉదయం బ్రేక్ ఫాస్ట్ చేయడం తప్పనిసరి. నిద్ర లేచిన తర్వాత గంటలోపు ఏదైనా తీసుకోవడం వల్ల శరీరం అలసట నుంచి మాయమవుతుంది. అయితే ఈ బ్రేక్ ఫాస్ట్ ఆరోగ్యకరమైనదిగా ఉండాలి. కొంతమంది ఉదయం కూడా రుచికరమైన ఆహారం ఉండాలని అనుకుంటారు. దీంతో ఆయిల్ తో చేసిన ఫుడ్ ను ఎక్కువగా తీసుకుంటారు. అలాకాకుండా ఇంట్లోనే కొన్ని రకాల పదార్థాలను తయారు చేసుకోవచ్చు. అవి సలాడ్ కావచ్చు లేదా డ్రింక్స్ కు సంబంధించిన ఏవైనా ఇంట్లో తయారు చేసుకోవడం వల్ల అదనపు ఖర్చు తగ్గుతుంది. ఫలితంగా ఆరోగ్యాన్ని కూడా ఇస్తాయి.
కొందరికి డ్యాన్స్ నేర్చుకోవడం అంటే చాలా ఇష్టం. ముఖ్యంగా పిల్లలకు డాన్స్ నేర్పించాలి కూడా. అయితే డాన్స్ కోసం ప్రత్యేకంగా డాన్స్ స్కూల్ కు వెళ్లడం వల్ల అదనంగా డబ్బు ఖర్చు అవుతుందని భావించేవారు.. ఇంట్లోనే పిల్లలకు ప్రాథమికంగా డాన్స్ నేర్పించవచ్చు. వారికి డాన్స్ నేర్పిస్తూనే మీరు కూడా డాన్స్ చేయవచ్చు. ఇలా చేయడం వల్ల మీకు ఆరోగ్యం ఉంటుంది. పిల్లల్లో తల్లిదండ్రులపై నమ్మకం పెరుగుతుంది.
ఫోన్ వాడడానికి అందరూ ఇష్టపడతారు. కానీ రీఛార్జి చేసే సమయంలోనే చాలా ఇబ్బందులకు గురవుతారు. అయితే కొన్ని నివేదికల ప్రకారం రాత్రుల సమయంలోనే ఎక్కువమంది మొబైల్ వాడుతున్నట్లు తేలింది. నిద్రపోయే ముందు మొబైల్ చూడడం వల్ల నిద్రలేమి సమస్య వచ్చే అవకాశం ఉంది. అలాకాకుండా నిద్రపోయే సమయంలో ఫోన్ ఆఫ్ చేయడం వల్ల డాటా సేవ్ అవుతుంది. కొన్ని పుస్తకాలను కొనుగోలు చేసి వాటిని చదవడం వల్ల మనసు ప్రశాంతంగా మారుతుంది. ఈ పని వల్ల ఆరోగ్యంతో పాటు ఖర్చులు కూడా సేవ్ అవుతాయి.
Also Read : అస్తమానం నిరాశకు గురి అవుతుంటారా? మీ లైఫ్ స్టైల్ దీనికి కారణం..