https://oktelugu.com/

Health Tips: నిత్యం యవ్వనంగా ఉండాలనుకుంటున్నారా? ఈ అలవాట్లు చేసుకోండి..

Health Tips: ఒక వ్యక్తి నిత్యం యవ్వనంగా ఉండాలంటే గుండెను కాపాడుకోవాలని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అమెరికన్ హార్ట్ అసోసియేషన్ తెలిపిన ప్రకారం గుండె పనితీరు మెరుగ్గా ఉంటే ఎక్కువ రోజులు యాక్టివ్ గా ఉండడంతో పాటు ఎక్కువ కాలం బతుకుతారని తేల్చారు.

Written By: , Updated On : March 31, 2025 / 07:00 AM IST
Health Tips (14)

Health Tips (14)

Follow us on

Health Tips: ప్రతి వ్యక్తిలో యవ్వన దశ అనేది చాలా ఉత్సాహంగా ఉంటుంది. ఈ సమయంలో ఆరోగ్యంగా ఉండడంతోపాటు ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనే శక్తి ఉంటుంది. అందుకే చాలామంది యవ్వనంలో ఎంజాయ్ చేయాలని అనుకుంటారు. అయితే కొంతమంది యవ్వన జీవితం ఇంకా కొనసాగాలని ఆరాటపడుతూ ఉంటారు. కానీ యవ్వనంగా ఉండేందుకు మాత్రం కొన్ని అలవాట్లను మానుకోరు. 40 ఏళ్ల లోపు యవ్వనంగా ఉంటూ ఏ పనైనా ఈజీగా చేసుకోగలుగుతారు. ఆ తర్వాత కొన్ని పనులు కష్టతరంగా మారుతాయి. అయితే 40 దాటిన తర్వాత కూడా యవ్వనంగా ఉండాలంటే కొన్ని అలవాట్లు చేసుకోవాలి. వీటి ద్వారా ఎక్కువ సంవత్సరాలు యవ్వనంగా ఉండగలుగుతారు.. ఇంతకీ ఆ అలవాట్లు ఏంటంటే?

ఒక వ్యక్తి నిత్యం యవ్వనంగా ఉండాలంటే గుండెను కాపాడుకోవాలని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అమెరికన్ హార్ట్ అసోసియేషన్ తెలిపిన ప్రకారం గుండె పనితీరు మెరుగ్గా ఉంటే ఎక్కువ రోజులు యాక్టివ్ గా ఉండడంతో పాటు ఎక్కువ కాలం బతుకుతారని తేల్చారు. అయితే గుండె తీరు మెరుగ్గా ఉండాలంటే..

సరైన ఆహారం తీసుకోవాలి:
గుండె పనితీరు మెరుగ్గా ఉండాలంటే మంచి ఆహారాన్ని తీసుకుంటూ ఉండాలి. ప్రాసెస్ చేసిన ఫుడ్డు తో పాటు ఆయిల్ ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల కొవ్వు పేరుకుపోతుంది. దీంతో గుండెకు సరఫరా అయ్యే రక్తనాళాల పనితీరు నశించి గుండెపోటు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అందువల్ల సరైన ఆహారం తీసుకోవడం వల్ల గుండె మెరుగ్గా ఉండి రక్త ప్రసరణ మఠంకా లేకుండా సాగుతుంది. దీంతో అన్ని అవయవాలకు సరైన దిశలో రక్తం సరఫరా ఆరోగ్యంగా ఉండగలుగుతారు.

ప్రతిరోజు వ్యాయామం చేయాలి..
గుండె పనితీరు మెరుగ్గా ఉండాలంటే ప్రతి రోజు వ్యాయామం చేయాలి. కనీసం వాకింగ్ అయినా చేస్తూ ఉండాలి. ఇలా చేయడం వల్ల రక్తంలో చక్కెర నిల్వలు తగ్గుతాయి. అలాగే వ్యాయామం చేయడం వల్ల కొలెస్ట్రాల్ తగ్గిపోతుంది. దీంతో గుండె సమస్యలు తగ్గిపోతాయి.

వ్యసనాలకు దూరంగా ఉండాలి;
గుండె పనితీరు మెరుగ్గా ఉండాలంటే మద్యపానం, ధూమపానం కు దూరంగా ఉండాలి. ఈ అలవాట్ల వల్ల గుండె పై ప్రభావం పడతాయి. వీటిని దూరం చేసుకోవడం వల్ల మానసిక ఆందోళన నుంచి విముక్తి అయి గుండె సమస్యలు రాకుండా ఉంటాయి. అంతేకాకుండా ఊపిరితిత్తుల సమస్యలు ఏర్పడడంతో కూడా గుండెపై ప్రభావం పడే అవకాశం ఉంది.

సరైన సమయంలో నిద్ర పోవాలి:
ప్రతి వ్యక్తి కనీసం రోజుకు 8 గంటల పాటు నిద్రపోవడం వల్ల వృద్ధాప్య కణాలను దరిచేరానీయకుండా ఉండగలుగుతారు. రోజు నిద్రలేమితో మృత కణాలు ఎక్కువగా ఏర్పడతాయి. దీంతో చిన్న వయసులోనే యవ్వనాన్ని కోల్పోతారు. సరైన సమయంలో నిద్ర పోవడం వల్ల మానసికంగా ఒత్తిడి తగ్గి ప్రశాంతంగా ఉండగలుగుతారు. దీంతో గుండెపై ఒత్తిడి తగ్గుతుంది.

బరువు తగ్గించుకోవాలి:
బరువు పెరగడం వల్ల శరీరం లోని కణాలు సరిగ్గా పనిచేయవు. అందువల్ల బరువు తగ్గే ప్రయత్నం చేయాలి. బరువు తగ్గేందుకు సాత్విక ఆహారాన్ని తీసుకోవాలి. ప్రతిరోజు వ్యాయామం చేస్తూ ప్రోటీన్ ఫుడ్ మాత్రమే తీసుకోవాలి. అలా చేయడం వల్ల ఒత్తిడి తగ్గి గుండెపై ప్రభావం పడకుండా ఉంటుంది. ఫలితంగా యవ్వనంగా ఉండగలుగుతారు.