https://oktelugu.com/

Bearded men : గడ్డం ఉన్న మగాళ్ళతో రొమాన్స్.. అధ్యయనం లో షాకింగ్ నిజాలు

ఇటీవల జరిగిన అధ్యయనంలో ఇలాంటి కీలక విషయాలే వెలుగులోకి వచ్చాయట. అందులోనూ.. మహిళలు ఎలాంటి అబ్బాయిలను కోరుకుంటున్నారు.. ఎటువంటి వారిని ఇష్టపడుతున్నారని తెలిసిందట. అవేంటో ఒక లుక్ వేద్దాం..

Written By:
  • Velishala Suresh
  • , Updated On : September 15, 2024 / 04:29 AM IST

    Bearded men

    Follow us on

    Bearded men : ఏ మహిళ అయినా తన భర్త రొమాంటిక్‌గా ఉండాలని కోరుకుంటుంది. అందుకోసం పెళ్లికి ముందే ఎన్నో కలలు కంటుంది. పెళ్లయ్యాక కూడా తన భర్త అలా ఉండాలని ఆశగా ఎదురుచూస్తుంటుంది. అయితే.. భార్యాభర్తల మధ్య మంచి రిలేషన్‌షిప్ కొనసాగాలంటే వ్యక్తిత్వం కీలకం. ప్రేమ, గౌరవం మెయింటెన్ చేస్తే ఏ బంధమయినా కలకాలం నిలుస్తుంది. ఇటీవల జరిగిన అధ్యయనంలో ఇలాంటి కీలక విషయాలే వెలుగులోకి వచ్చాయట. అందులోనూ.. మహిళలు ఎలాంటి అబ్బాయిలను కోరుకుంటున్నారు.. ఎటువంటి వారిని ఇష్టపడుతున్నారని తెలిసిందట. అవేంటో ఒక లుక్ వేద్దాం..

    ప్రపంచాన్ని కరోనా చుట్టిముట్టినప్పటి నుంచి మగాళ్లు బార్బర్ షాపులకు వెళ్లే అవకాశం లేక గడ్డాలు పెంచారు. అది కాస్త రానురాను అలవాటుగా మారిపోయింది. అప్పటి నుంచి చాలా మంది మగాళ్లు క్లీన్ షేవ్ చేయించిన దాఖలాలు తక్కువే. అయితే.. ఆర్కైవ్ ఆఫ్ సెక్సువల్ బిహేవియర్‌లో ప్రచురితమైన ఈ కొత్త అధ్యయనం ప్రకారం.. గడ్డం ఉన్న అబ్బాయిలు చాలా రొమాంటిక్ అని, వారే మంచి ఫ్యామిలీ మ్యాన్ అవుతాడని తేల్చింది. గడ్డం లేని మగాళ్ల కంటే గడ్డం మెయింటెన్ చేసే వారే శృంగారంలో రెచ్చిపోతారని తెలిపింది.

    గడ్డాలు పెంచే పురుషులు తమ భాగస్వామిని సంతోష పెడుతారట. అటు ఫ్యామిలీ విలువలకు కూడా చాలా వరకు విలువనిస్తారని పేర్కొంది. క్లీన్ షేవ్ చేసుకునే వారి పట్ల సంచలన విషయం చెప్పింది. అలాంటి వారు తరచూ కొత్త భాగస్వామి కోసం వెతుకుతూ ఉంటారట. అయితే.. ఈ అధ్యయనంలో 18 నుంచి 40 ఏళ్ల వయసు ఉన్న 414 మంది పురుషులు పాల్గొన్నారు. గడ్డం ఉన్న పురుషులే క్రమశిక్షణతో ఉంటారని ఆ అధ్యయనం తెలిపింది.

    అలాగే.. గడ్డం ఉన్న పురుషులు తమ బంధాలను నిలబెట్టుకునేందుకు ప్రాధాన్యత ఇస్తారని తెలిపింది. వీరు వేగవంతమైన జీవనాన్ని ఇష్టపడరని పేర్కొంది. పేస్ ఫుల్‌గా గడ్డం పెంచుకునే పురుషులు కాస్త యవ్వనంగానూ కనిపిస్తారని తెలిపింది. అందుకే.. ఇప్పుడు యువతులంతా గడ్డంతో ఉన్న బ్యాచ్‌నే ఇష్టపడుతున్నారట. గడ్డం పెంచుకుంటున్న వ్యక్తినే భాగస్వామిగా చేసుకోవాలని తాపత్రయపడుతున్నారని సమాచారం.