Chutnis : చాలా మందికి పచ్చళ్లు అంటే ఫుల్ గా ఇష్టం ఉంటుంది కదా. ఎండాకాలంలో ఆవకాయ పచ్చడి పెడితే కాస్త వేడి వేడి అన్నంలో పచ్చడి వేసుకొని నెయ్యి వేసుకొని తింటే అబ్బ చికెన్ కూడా అవసరం లేదు కదా. సూపర్ గా ఉంటుంది. కొన్ని సార్లు కూరలు ఉన్నా సరే పచ్చడినే పెట్టుకొని మరీ తింటారు. కూర లేకున్నా సరే పచ్చడి ఉంది కదా చాలు అనుకుంటారు. ఈ విధంగా ఫీలయ్యే వాళ్ళు చాలామంది ఉంటారు కదా. ఇందులో మీరు కూడా ఒకరా?. అయితే చాలామంది నిలువ పచ్చళ్ళు అంటే.. మామిడి, ఉసిరి ,నిమ్మ ,టమాట, వంటి రకరకాల పచ్చళ్లను తింటారు.
సంవత్సరం పాటు నిల్వ ఉండాలని వాటిల్లో ఉప్పు కారం నూనెలను ఫుల్లుగా దట్టించి ప్రిపేర్ చేసి నిల్వ చేస్తారు. ఇక నిలువ పచ్చళ్లను ఎక్కువగా తినేవారు కొన్ని విషయాలను తప్పక తెలుసుకోవాలి. నిలువ పచ్చళ్ళు ఎక్కువగా తింటే ఆరోగ్యానికి మంచిది కాదు. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి అనుకునేవారు పచ్చళ్లకు దూరంగా ఉండాలని చెబుతున్నారు. నిలువ పచ్చళ్ళలో పోషకాలు తక్కువగా ఉంటాయి. అయినా ఇవి ఏమాత్రం ఆరోగ్యానికి మంచిది కాదు అంటున్నారు నిపుణులు.
ప్రతిరోజు నిలువ పచ్చళ్ళు తింటే సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి అంటున్నారు నిపుణులు. నిలువ పచ్చళ్ళు ఎక్కువగా తింటే కడుపులో మంట, ఎసిడిటీ వంటి సమస్యలు వస్తాయట. కూరగాయలు, ఆకుకూరలతో చేసిన కూరలను తినాలి. ఇవి కాకుండా ఎక్కువగా పచ్చళ్ళు తింటే చాలా డేంజర్ అని హెచ్చరిస్తున్నారు నిపుణులు. ఇక పచ్చళ్ళు అతిగా తింటే మీ ఆరోగ్యం కచ్చితంగా డేంజర్ లో ఉన్నట్టేనట.
బిపి, డయాబెటిస్ ఉన్నవారు పచ్చడి ఎంత తక్కువ తింటే అంత మంచిది. పచ్చళ్ళు నిల్వ ఉండడానికి వాటిలో ఉప్పు కాస్త ఎక్కువగా కలుపుతుంటారు. పచ్చళ్లలో ఉప్పు శాతం ఎక్కువగా ఉంటుంది. అంటే దీని వల్ల బిపి, డయాబెటిస్ వంటి సమస్యలను పెంచుతాయి. ఊరగాయ పచ్చళ్లలో ఉప్పు ఎక్కువగా ఉంటుంది. ఇవి కిడ్నీల పైన భారం పడేలా చేస్తాయి. తద్వారా కిడ్నీలు పాడయ్యే అవకాశం ఎక్కువ ఉంటుందట.
నిల్వ పచ్చళ్ళు రక్తపోటును పెంచి, గుండె సమస్యలకు కారణం అవుతాయి. ఇక పచ్చళ్లలో ఎక్కువగా పోసే నూనె శరీరంలో చెడు కొలెస్ట్రాల్ ను పెంచుతుంది. సో పచ్చళ్లకు సాధ్యమైనంత దూరంగా ఉండాలి. పచ్చళ్ళను తినడం తగ్గించండి అంటున్నారు పోషకాహార నిపుణులు, వైద్యులు. శరీరానికి పోషకాలను ఇచ్చే ఆహారాన్ని తీసుకోండి. తద్వారా ఆరోగ్యాన్ని పెంచుకోండి. ఇక ఈ విషయాన్ని ముఖ్యంగా పచ్చళ్ళ ప్రియులు తెలుసుకుంటే మరీ మంచిది. అనారోగ్య సమస్యల నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకోవచ్చు.
ఇందులోని ఆక్సిటోసిస్ వాంతులు, వికారాన్ని కూడా కలిగిస్తుందట. అధిక లాక్టిక్ యాసిడ్ విడుదల అవుతుంది కాబట్టి కడుపు నొప్పి, గ్యాస్, మలబద్ధకం వంటి సమస్యలు వస్తాయి. ఆక్సిడోసిస్ కారణంగా నోరు పొడిబారే అవకాశం కూడా ఉంది. దీనివల్ల తినడం, తాగడం ఇబ్బంది అవుతుంది. పచ్చళ్లలో ఉండే అధిక లాక్టిక్ యాసిడ్ ఛాతీ నొప్పి, క్రమరహిత హృదయ స్పందన వంటి గుండె సమస్యలకు కారణం అవుతుంది. లాక్టిక్ యాసిడ్ అధికంగా తీసుకుంటే తలనొప్పి, కళ్లు తిరగడం వంటి సమస్యలు వస్తాయి.
Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ సూచనలు పాటించే ముందు వైద్య నిపుణుల సలహాలు తీసుకోగలరు.