https://oktelugu.com/

Biryani leaf : బిర్యానీ ఆకుతో టీ ఎప్పుడైనా తాగారా? దీని ప్రయోజనాలు తెలిస్తే షాక్ అవుతారు

ఈ ఆకు వాళ్ల కలిగే ప్రయోజనాలు ఒక్కసారి తెలిస్తే.. జన్మలో వీటిని వదిలిపెట్టరు. సాధారణంగా వీటిని మసాలా కోసం వాడుతారు. అయితే ఈ ఆకుతో టీ చేసి తాగితే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. మరి అవేంటో ఈ రోజు తెలుసుకుందాం.

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : September 15, 2024 / 05:33 AM IST

    Biryani Leaf Tea

    Follow us on

    Biryani leaf : సాధారణంగా చాలామందికి బిర్యానీ ఆకు గురించి తెలిసే ఉంటుంది. దీనిని ఎక్కువగా కూరల్లో మసాలా, బిర్యానీ కోసం వాడుతుంటారు. వీటిని అర్థం వల్ల బిర్యానీకి చాలా రుచి వస్తుంది. ఈ ఆకులో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. కానీ చాలా మందికి ఈ ఆకు చేసే ప్రయోజనాలు అసలు తెలియవు. ఈ ఆకు వాళ్ల కలిగే ప్రయోజనాలు ఒక్కసారి తెలిస్తే.. జన్మలో వీటిని వదిలిపెట్టరు. సాధారణంగా వీటిని మసాలా కోసం వాడుతారు. అయితే ఈ ఆకుతో టీ చేసి తాగితే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. మరి అవేంటో ఈ రోజు తెలుసుకుందాం.

    మనలో చాలామందికి టీ, కాఫీ తాగే అలవాటు ఉంటుంది. అసలు టీ లేకపోతే కొందరికి రోజు కూడా గడవదు. వీటిని తాగడం కూడా ఆరోగ్యానికి అంత మంచిది కాదు. అయిన వీటినే తాగుతుంటారు. అయితే ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా టీ తాగాలనుకుంటే బిర్యానీ ఆకు టీ ఒకసారి తాగండి. ఈ ఆకు టీ రోజు తాగడం వల్ల ఆరోగ్యంగా ఉంటారు. చాలా మందికి టీ, కాఫీ వల్ల నిద్ర పట్టదు. అదే బిర్యానీ ఆకు టీ తాగితే రాత్రి బాగా నిద్రపడుతుంది. నిద్ర లేమితో ఇబ్బంది పడేవాళ్లకి ఈ టీ ఉపయోగపడుతుంది. ఇందులో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ టీ తాగడం వల్ల కీళ్ల నొప్పుల సమస్య తగ్గుతుంది. అలాగే ఆర్థరైటిస్‌ వంటివి రాకుండా కూడా కాపాడుతుంది. ఇందులో రుతిన్‌, కెఫిక్‌ అనే రెండు యాసిడ్‌ సమ్మేళనాలు ఉన్నాయి. ఇవి గుండె ఆరోగ్యాన్ని మెరుగు పరచడంలో సహాయపడతాయి. అలాగే బాడీలోని చెడు కొలెస్ట్రాల్ ను తగ్గిస్తాయి. యాంటీ యాక్సిడెంట్ ఎక్కువగా ఉండే ఈ ఆకులు ఫ్రీ రాడికల్స్ ను తగ్గిస్తుంది. కణజాలలు ఆరోగ్యంగా ఉండేలా సాయపడుతుంది. రోజుకి కనీసం ఒక పూట అయిన బిర్యానీ ఆకు టీ తాగితే రక్తంలో చక్కర స్థాయిలు అదుపులో ఉంటాయి.

    బిర్యానీ ఆకు టీ తయారు చేయడం ఎలా?
    బిర్యానీ ఆకులు పచ్చివి దొరకడం చాలా కష్టం. ఇంట్లో ఈ మొక్కను పెంచుకుంటే తాజా ఆకులు దొరుకుతాయి. పశ్చిమ లేకపోతే ఎండిన బిర్యానీ ఆకులను ఒక నాలుగు తీసుకోవాలి. ఒక పాత్రలో గ్లాస్ నీరు వేసి కాస్త వేడెక్కనివ్వాలి. ఆ తరువాత ఈ ఆకులు వేసి ఒక పది నిమిషాల పాటు మరగనివ్వాలి. అంతే ఇక బిర్యానీ ఆకు టీ రెడీ అయినట్లే. అయితే కొందరు రుచి కోసం నిమ్మరసం, తేనె వంటివి కలుపుతారు. మీ ఇష్టాన్ని బట్టి యాడ్ చేసుకోవచ్చు.

    Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ సూచనలు పాటించేముందు వైద్య నిపుణుల సలహాలు తీసుకోగలరు.