Virat Kohli: మరికొద్ది రోజుల్లో ఐపీఎల్ సీజన్ ప్రారంభం కాబోతోంది. దీని కోసం ఇప్పటి నుంచే కసరత్తులు మొదలయ్యాయి. ఆటగాళ్ల వేలం కోసం ఎదురుచూస్తోంది. బెంగుళూరు రాయల్ చాలెంజర్స్ కోసం ఆటగాళ్ల వేలంలో ఎవరిని తీసుకోవాలనే దానిపై ఆలోచిస్తోంది. 14వ సీజన్ పూర్తయిన తరువాత ఆర్సీబీ కెప్టెన్సీ నుంచి తప్పుకున్న మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లిని తీసుకోవాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. ఇయితే ప్రస్తుతం ఆర్సీబీకి విరాట్ కోహ్లి కెప్టెన్ గా ఉంటేనే మేలు జరుగుతుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.

గతంలో కూడా విరాట్ కోహ్లి ఆర్సీబీకి ఎన్నో విజయాలు నమోదు చేయడంలో కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. ఈ సారి కూడా విరాట్ కోహ్లి నాయకుడిగాఉంటేనే బెంగుళూరుకు కలిసి వస్తుందని అందరి వాదన. ఈ నేపథ్యంలో మెగా వేలంలో విరాట్ ను కొనుగోలు చేయాలనే డిమాండ్ వస్తోంది. ఈ మేరకు ఫ్రాంచైజీ కూడా ఇదే నిర్ణయం తీసుకునే అవకాశం ఏర్పడింది.

Also Read: ఆసియా శ్రీమంతుడు అదానీనే.. కరోనా సంక్షోభంలో లాభపడ్డది ఆయనొక్కడే..!
అయితే ఫ్రాంచైజీకి ఎక్కువ మొత్తంలో డబ్బు లేకపోవడంతోనే దొరికిన ఆటగాళ్లతోనే ఆడించాలని చూస్తోంది. ఎక్కువగా మిడిలార్డర్ పైనే ఆధారపడుతోంది. దీంతో ఆటగాళ్ల కోసం పెద్దగా ఖర్చు చేయడానికి ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ఈ క్రమంలో ఆర్సీబీకి నిధుల సమస్యతో పాటు ఆటగాళ్ల తో కూడా తలనొప్పి తలెత్తుతోంది. దీంతో ప్రస్తుతం ఆటగాళ్ల కోసం ఎంత మేర ఖర్చు చేయనుందో తెలియడం లేదు. ఇది ఆటగాళ్ల ఎంపికపై ప్రభావం చూపే అవకాశం ఏర్పడుతోంది.
రాయల్ చాలెంజర్స్ వద్ద రూ. 57 కోట్లు మాత్రమే ఉన్నట్లు తెలుస్తోంది. ఈ డబ్బుతో కొత్త ఆటగాళ్లను కొనుగోలు చేస్తుందా? లేక ఉన్న వారితోనే మమ అనిపిస్తుందా అనేదే సందేహం. మొత్తానికి కొద్ది రోజుల్లో ప్రారంభమయ్యే ఐపీఎల్ సీజన్ లో ఆర్సీబీ సత్తా చాటుతుందా? లేక తోక ముడుస్తుందా అనేదే తేలాల్సి ఉంది. అంతా డబ్బులతోనే ముడి పడి ఉండటంతో ఆర్సీబీ కష్టాలు తీర్చే వారు దొరుకుతారా? లేక ఉన్న దాంట్లోనే సరిపెట్టుకుంటారా? అనే అనుమానాలు అందరిలో వస్తున్నాయి.
Also Read: తెలంగాణలో మూడో దశ ముగిసినట్లేనా?